హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Schools Reopen: అక్కడ ఎల్లుండి నుంచి స్కూళ్లు ప్రారంభం.. అన్ని తరగతులకు ఓపెన్..

Schools Reopen: అక్కడ ఎల్లుండి నుంచి స్కూళ్లు ప్రారంభం.. అన్ని తరగతులకు ఓపెన్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా కారణంగా విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుతుండటంతో పాఠశాలలు తిరిగి ప్రారంభించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి.

కరోనా కారణంగా స్కూళ్లు, విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. కరోనా లాక్‌డౌన్ పూర్తైన తర్వాత చాలాచోట్ల కొద్దిరోజుల పాటు పాఠశాలలు, విద్యా సంస్థల తెరిచిన సంగతి తెలిసిందే. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా మరోసారి పాఠశాలలను మూసేశారు. విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుతుండటంతో పాఠశాలలు తిరిగి ప్రారంభించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని స్కూల్స్‌ను ఓపెన్ చేయనున్నట్టు ప్రకటించింది. అన్ని తరగతుల వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది. కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకన్నట్టుగా తెలిపింది.

ఇక, రాష్ట్ర ప్రభుత్వం 10 నుంచి 12వ తరగతుల వారికి జూలై 26 నుంచి స్కూల్స్ ఓపెన్ చేసేందుకు అనుమతించిన సంగతి తెలిసిందే. ‘అన్ని తరగతుల వారికి ఆగస్టు 2వ తేదీ నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభిస్తున్నాం. కరోనా కేసులు ఇంకా వెలుగుచూస్తూనే ఉన్నందన.. తప్పనిసరిగా కోవిడ్‌ నిబంధనల పాటించాలి’అని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

అన్ని పాఠశాలల్లో కరోనా నిబంధనలు పక్కాగా అమలు చేసేలా చూడాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు తగు మార్గదర్శకాలు జారీ చేసింది. పంజాబ్‌లో శుక్రవారం కొత్తగా 49 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,99,053కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 16,292 మంది కరోనాతో మరణించారు.

First published:

Tags: Punjab, Schools reopening

ఉత్తమ కథలు