హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

PNB Careers: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. రెండు రోజుల్లో ముగియనున్న దరఖాస్తుల ప్రక్రియ..

PNB Careers: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. రెండు రోజుల్లో ముగియనున్న దరఖాస్తుల ప్రక్రియ..

PNB Careers: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. రెండు రోజుల్లో ముగియనున్న దరఖాస్తుల ప్రక్రియ..

PNB Careers: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. రెండు రోజుల్లో ముగియనున్న దరఖాస్తుల ప్రక్రియ..

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఫైర్ అండ్ సేఫ్టీ , సెక్యూరిటీ విభాగాలలో ఆఫీసర్స్ అండ్ మేనేజర్స్ పోస్ట్‌లకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) ను విడుదల చేసింది. ఫైర్ అండ్ సేఫ్టీ(Fire And Safety), సెక్యూరిటీ(Security) విభాగాలలో ఆఫీసర్స్ అండ్ మేనేజర్స్ పోస్ట్‌లకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి గల వ్యక్తులు దరఖాస్తునలు ఆఫ్ లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ ద్వారా నిర్ణీత గడువులోగా పంపించాలి. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 30. అంటే మరో రెండు రోజుల్లో ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. నోటిఫికేషన్ ను సంబంధించి వివరాలను pnbindia.inవెబ్ సైట్ సందర్శించి తెలుసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం 103 ఖాళీలను ఈ రిక్య్రూట్ మెంట్ ద్వారా భర్త చేయనున్నారు.


Telangana Government Key Announcement: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ 9 వేల మంది సెప్టెంబర్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులే..!


ఇందలో 23 ఆఫీసర్ (ఫైర్-సేఫ్టీ)లు.. 80 మేనేజర్ (సెక్యూరిటీ) పోస్టులు ఉన్నాయి.


జీతం.. నెలకు రూ.36వేల నుంచి రూ. 69 వేల వరకు చెల్లిస్తారు. పోస్టును బట్టి ఈ జీతం ఉంటుంది.అర్హతలు:


మేనేజర్ - AICTE/UGC గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్‌లో 5 సంవత్సరాల కమీషన్డ్ సర్వీస్ ఉన్న అధికారి లేదా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంక్ కంటే తక్కువ లేని గెజిటెడ్ పోలీస్ ఆఫీసర్ లేదా సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో (CAPF) తత్సమాన ర్యాంక్ కనీసం 05 సంవత్సరాల సర్వీస్ ఉన్న అధికారి అర్హులు.


ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ -AICTE/UGC ఆమోదించిన కళాశాల/విశ్వవిద్యాలయం నుండి ఫైర్ టెక్నాలజీ/ఫైర్ ఇంజనీరింగ్/సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజినీరింగ్‌లో నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్ డిగ్రీ(B.Tech/BE లేదా తత్సమానం) కలిగి ఉండాలి. వీటితో పాటు.. పని అనుభం కూడా ఉండాలి.


వయో పరిమితి: అభ్యర్థుల అయస్సు.. 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు ఫీజు.. SC/ST/PWBD కేటగిరీ అభ్యర్థులు - రూ. 59, మిగతా అభ్యర్థులందరూ రూ. 1003 చెల్లించాలి.


దరఖాస్తు విధానం..


- అధికారిక వెబ్‌సైట్ అంటే www.pnbindia.inకి వెళ్లి <Recruitments> లింక్ చేసి, సూచించిన దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.


-దానిని పూరించి.. స్పీడ్/రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించాలి.


-పోస్ట్ ద్వారా పంపించే ఎన్వలప్ పోస్ట్ వివరాలను నమోదు చేయాలి. దానిని "చీఫ్ మేనేజర్ (రిక్రూట్‌మెంట్ విభాగం), HRD డివిజన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కార్పొరేట్ ఆఫీస్, ప్లాట్ నెం 4, సెక్టార్ 10, ద్వారక, న్యూఢిల్లీ -1107" అడ్రస్ కు పంపించాలి. పూర్తి వివరాకలు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.


ఎంపిక విధానం.. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా లేదా రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను సెలెక్ట్ చేయనున్నారు.

Published by:Veera Babu
First published:

Tags: Bank Jobs, Career and Courses, JOBS, Punjab National Bank

ఉత్తమ కథలు