Home /News /jobs /

CSIR-NCL : ఎన్‌సీఎల్‌లో ప్రాజెక్టు ఇంజ‌నీర్ ఉద్యోగాలు.. జీతం రూ.31,000

CSIR-NCL : ఎన్‌సీఎల్‌లో ప్రాజెక్టు ఇంజ‌నీర్ ఉద్యోగాలు.. జీతం రూ.31,000

సీఎస్ఐఆర్‌-ఎన్‌సీఎల్ జాబ్స్‌

సీఎస్ఐఆర్‌-ఎన్‌సీఎల్ జాబ్స్‌

సీఎస్ఐఆర్‌కు చెందిన నేష‌న‌ల్ కెమిక‌ల్ లాబోరేటరీ (CSIR-National Chemical Laboratory) లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అక్టోబ‌ర్ 7, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...
    సీఎస్ఐఆర్‌కు చెందిన నేష‌న‌ల్ కెమిక‌ల్ లాబోరేటరీ (CSIR-National Chemical Laboratory) లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ప్రాజెక్ట్ అసోసియేట్ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ప్రాజెక్టు ఎంపికైన త‌రువాత‌ ఆరునెల‌లు ప‌ని చేయాల్సి ఉంటుంది. అనంత‌రం ఆ కాలాన్ని పెంచుతార‌ని నోటిఫికేష‌న్‌లో తెలిపారు. ప‌నితీరు ఆధారంగా మాత్ర‌మే కాల‌ప‌రిమిత పెంపు ఉంట‌దని నోటిఫికేష‌న్‌లో తెలిపారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకొనే వారు అధికారిక వెబ్‌సైట్ https://www.ncl-india.org/ ను సంద‌ర్శించాలి. ద‌ర‌ఖాస్తు ప‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా ఉంటుంది. ఎటువంటి ప‌రీక్ష లేకుండా నేరుగా ఇంట‌ర్వ్యూ ద్వారా అభ్య‌ర్థిని ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అక్టోబ‌ర్ 7, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    ముఖ్య‌మైన స‌మాచారం























    పోస్టు పేరు ప్రాజెక్టు అసోసియేట్‌
    పోస్టుల సంఖ్య  5
    జీతం రూ.31,000+హెచ్ఆర్ఏ
    ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 7, 2021
    అధికారిక వెబ్‌సైట్ https://www.ncl-india.org/

    APPSC Jobs: ఏపీపీఎస్సీ ఆయుష్ విభాగంలో ఖాళీలు.. అర్హ‌త‌లు ఇవే


     ఎంపిక విధానం..
    - ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థుల‌ను మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
    - షార్ట్ లిస్ట్ అయిన అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తారు.
    - ఇంట‌ర్వ్యూ తేదీ అక్టోబ‌ర్ 12, 2021

    ద‌ర‌ఖాస్తు విధానం..
    Step 1:  ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.ncl-india.org/ కు వెళ్లాలి.
    Step 2: అందులో JoinUsలో Job Vacancies విభాగాన్ని క్లిక్ చేయాలి.
    Step 3: అనంత‌రం అందులో ప్రాజెక్ట్ జాబ్స్‌లోకి వెళ్లాలి.
    Step 4: అక్క‌డ ప్రాజెక్ట్ అసోసియేట్ నోటిఫికేష‌న్ క్లిక్ చేసి చ‌ద‌వాలి (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)
    Step 5: అనంతరం APPLY ONLINE ఆప్ష‌న్‌పై క్లిక్ చేసి ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
    Step 6: ద‌ర‌ఖాస్తుకు సంబంధించిన అనుమానాలు ఏమైన ఉంటే 02025902647 నంబ‌ర్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు.
    Step 7: ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 7, 2021
    Published by:Sharath Chandra
    First published:

    Tags: CAREER, Government jobs, Govt Jobs 2021, Job notification

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు