తెలంగాణ (Telangana) లో మరో ఆరు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కావేరి అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఆమోదం లభించిందని తెలిపారు. అంతే కాకుండా..
అమిటీ, సీఐఐ (Confederation of Indian Industry) , గురునానక్, నిప్‌మర్, ఎంఎన్ఆర్ యూనిర్సిటీల ఏర్పాటుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన జీవోలు, విధివిధానాలను త్వరలో ప్రకటిస్తారిన తెలిపారు.
ప్రపంచలోనే ఫార్మారంగంలో తెలంగాణ చాలా ప్రధాన కేంద్రం ఈ నేపథ్యంలో ఫార్మా యూనివర్సిటీని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించిందని సీఎంవెల్లడించారు. ఇటీవల మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో భాగంగా అనేక కంపెనీలు ఇందులో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకొచ్చాయని సీఎం కేసీఆర్ వివరించారు.
RRB NTPC CBT 2: రైల్వే అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష తేదీలు విడుదల.. వివరాలు
TS ECET 2022లో క్వాలిఫై అయితే సీటు గ్యారెంటీ..
ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీ ప్రవేశ పెడుతున్నా.. ఇటు పలు కోర్సుల్లో సీట్లు ఖాలీగా ఉండి పోతున్నాయి.. తాజాగా పాలిటెక్నిక్ నుంచి ఇంజినీరింగ్ చేరడానికి ఈసెట్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రతీ ఏడాది ఈ పరీక్షలో సీట్లు మిగిలిపోతున్నాయి. టీఎస్ ఈసెట్‌లో క్వాలిఫై అయితే చాలు.. విద్యార్థులకు ఈ సారి సీటు కచ్చితంగా రానుంది. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) మినహా అన్ని బ్రాంచిల్లో సీట్లు పుష్కలంగా ఉన్నాయి.
ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా బీటెక్ ఫస్టియర్‌లో మిగిలిన 22 వేలకుపైగా సీట్లను ఈ సెట్ ద్వారా భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన వారికి ఈసెట్ ద్వారా బీటెక్ సెకండ్ ఇయర్‌లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇందుకు సెకండియర్‌లో అన్ని కోర్సుల్లో 10శాతం సీట్లను పెంచుతారు. కొంతకాలంగా బీటెక్ కోర్సుల్లో సీట్లు పూర్తిగా నిండటం లేదు. ఈ లెక్కన ఈసెట్‌లో క్వాలిఫై అయిన విద్యార్థులందరికీ సీట్లు దర్కే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో నాణ్యమైన విద్యపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, University