National Teachers Awards 2021: 44 మందికి 'ఉత్తమ ఉపాధ్యాయ' అవార్డులు ప్రదానం.. ఎందుకు ఇస్తారో తెలుసా

రామ్‌నాథ్ కోవింద్

సెప్టెంబ‌ర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్స‌వం(Teacher's day) సంద‌ర్భంగా రాష్ట్రప‌తి వ‌ర్చువ‌ల్ వేడుక ద్వారా దేశ‌వ్యాప్తంగా 44 మంది ఉపాధ్యాయుల‌కు(Teachers) అవార్డు ప్ర‌దానం చేశారు. విద్యారంగంలో విశేష కృషి చేసినందుకు ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు.

  • Share this:
    సెప్టెంబ‌ర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్రప‌తి వ‌ర్చువ‌ల్ వేడుక ద్వారా దేశ‌వ్యాప్తంగా 44 మంది ఉపాధ్యాయుల‌కు(Teachers) అవార్డు ప్ర‌దానం చేశారు. విద్యారంగంలో విశేష కృషి చేసినందుకు ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు.
    రికొత్త బోధనా పద్దతులతో పిల్లల భవిష్యత్తును నిర్మించిన వారిని ఉత్తమ గురువులుగా రాష్ట్ర‌ప‌తి సత్కరించారు. ప్రతి రాష్ట్రం నుంచి ఉపాధ్యాయులు ఎంపికయ్యారు మరియు ఇందులో తొమ్మిది మంది మహిళా ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ విద్యార్థుల(Students) స్వాభావిక ప‌తిభ‌ను మిళితం చేసే ప్రాథ‌మిక బాధ్య‌త ఉపాధ్యాయుల‌దే అన్నారు. మంచి ఉపాధ్యాయుడు విద్యార్థుల వ్య‌క్తిత్వాన్ని నిర్మించ‌డ‌మే కాకుండా స‌మాజాన్ని(Society) నిర్మించేవార‌ని అన్నారు.



    భవిష్య‌త్ త‌రం ఉత్త‌మ ఉపాధ్యాయుల చేతిలో సుర‌క్షితంగా ఉంటుంద‌ని న‌మ్మ‌కం ఉంద‌న్నారు. ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రంగా ప్ర‌పంచ‌మంతా సంక్ష‌భాన్ని ఎదుర్కొంటుంద‌న్నారు. పాఠ‌శాల‌లు తెరుచుకోవ‌డం క‌ష్ట‌త‌రం అయ్యింది. ఆ స‌మ‌యంలోనే ఉపాధ్యాయులు అతి త్వ‌ర‌గా డిజిట‌ల్ బోధ‌ను నేర్చుకొని విద్యార్థుల‌కు డిజ‌ట‌ల్ ప్లాట్‌ఫారం(Digital platform) ద్వారా విద్యానందించార‌ని రాష్ట్ర‌ప‌తి(President) అన్నారు. విద్యా మంత్రిత్వ శాఖ ‘నిష్ఠ’ అనే ఇంటిగ్రేటెడ్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది, దీని కింద ఉపాధ్యాయుల కోసం ‘ఆన్‌లైన్ కెపాసిటీ బిల్డింగ్’ (Online Capacity building) కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని రాష్ట్ర‌ప‌తి అభినందించారు.
    స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌కు నివాళి..
    సెప్టెంబ‌ర్ 5న భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సేవ‌ల‌ను కొనియాడారు.

    JEE Main Scam: విద్యార్థుల‌కు న్యాయం జ‌ర‌గాలి.. జేఈఈ స్కాంపై రాహుల్‌గాంధీ ట్వీట్‌


    ఎప్ప‌టి నుంచి ఎందుకు నిర్వ‌హిస్తారు..
    జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 1958 నుంచి అందజేస్తున్నారు. ఈ అవార్డును ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు అందజేస్తారు. భారత రెండో రాష్ట్రపతి డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ టీచర్(Teacher) గా పని చేశారు. ఆయన జయంతి రోజైన సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
    జాతీయ ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబర్ 5న ప్రతి ఏటా భారత ప్రభుత్వం కొందరు ఉపాధ్యాయులను ఎంపిక చేసి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేస్తుంది. రాష్ట్రపతి  చేతుల మీదుగా టీచర్స్ డే రోజు ఈ అవార్డు అందజయడం ఆనవాయితీ. ఈ అవార్డు ప్రధాన ఉద్దేశం ఏమిటంటే విద్యా రంగంలో దేశంలోని అత్యంత ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు(Headmaster) అందిస్తున్న సేవలను బహిరంగంగా తెలియజేయడం. తద్వారా టీచర్లలో స్పూర్తిని నింపడం కోసమే ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ పుర‌స్కారాన్ని అందించే బాధ్య‌త కేంద్ర విద్యా శాఖపై ఉంది.
    Published by:Sharath Chandra
    First published: