హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

BYJU’S Young Genius సీజన్ 2 రిజిస్ట్రేషన్‌కు అనూహ్య స్పందన

BYJU’S Young Genius సీజన్ 2 రిజిస్ట్రేషన్‌కు అనూహ్య స్పందన

_Byjus-logo

_Byjus-logo

షోటాపర్లు అనుకున్న వారిని కాదని మేధావులు విజయాన్ని చేజిక్కించుకున్నారు. ఈ అద్భుతాన్ని టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా

  షోటాపర్లు అనుకున్న వారిని కాదని మేధావులు విజయాన్ని చేజిక్కించుకున్నారు. ఈ అద్భుతాన్ని టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా మరియు మీరాబాయి చాను వంటి క్రీడాకారులు ఆవిష్కరించారు. మెడల్ సాధించడానికి కీలకమైన రౌండ్‌లలో ధృడ సంకల్పం అలాగే పట్టుదలతో ఉండి, జావెలిన్ త్రో అలాగే వెయిట్‌లిఫ్టింగ్‌లలో బంగారం మరియు రజత పతకాలు గెలుచుకున్నప్పుడు ఎంతో హుందాగా వ్యవహరించడం వరకు టోక్యో ఒలింపిక్స్ విజయతీరాలు చేరే వరకు మేధావులు వెలుగులోనికి రారు అని నిరూపించింది.

  BYJU’S Young Genius కూడా ఈ ఉద్దేశ్యంతోనే News 18తో కలిసి ఈ కార్యక్రమం ప్రారంభించింది. News18  ఎడిటర్లు అలాగే ప్రఖ్యాత వ్యక్తులు ఉన్న ప్యానెల్ ఎంపిక చేసిన యువ మేధావులు ఛానెల్‌లో వారి ప్రతిభను ప్రదర్శిస్తారు.

  ఇప్పుడు Young Genius రెండవ ఎడిషన్‌కు రంగం సిద్ధమవ్వగానే, అప్లికేషన్ల సంఖ్య, పాల్గొనాలి అనుకుంటున్న వారి ప్రతిభ స్థాయి ఊహించలేని విధంగా ఉన్నాయి. దాని గురించి మాట్లాడుకునే ముందు, BYJU’S Young Genius మొదటి ఎడిషన్ ఉత్తమ విషయాలను మరొక్క సారి చూద్దాం. 

  సీజన్ 1లో ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చిన వాళ్లలో కళ్ళకు గంతలు కట్టుకుని నిమిషానికి 190 బీట్‌లతో పియానో వాయించిన నాదసవరం (15సం.) తన అద్భుత IQతో ‘గూగుల్ గర్ల్ ఆఫ్ ఇండియా’ అని పిలవబడే మేఘాలి మాళవిక (14సం.) ఉన్నారు. వీరితో పాటు మెన్సా సొసైటీ సభ్యురాలు, అనేక యాప్‌ల డెవలపర్ అలాగే పుస్తక రచయిత, అద్భుతంగా 180 IQ ఉన్న రిషి శివ్ పి (6సం.); 6 అంకెల వర్గమూలాన్ని చేసిన అతి చిన్న వయస్కురాలిగా రికార్డ్ ఉన్న అవంతిక కాంబ్లి (10సం.) ఇంకా బార్ల కింద నుండి ఎక్కువ దూరం లింబో స్కేటింగ్ చేసిన వ్యక్తిగా గిన్నీస్ రికార్డ్ సాధించిన తిలక్ కైసమ్ (13సం.) ఉన్నారు.

  BYJU’S Young Genius సీజన్ 2 మరింత గ్రాండ్‌గా ఉండబోతుంది. ఎంట్రీలు ప్రారంభించినప్పటి నుండి దేశం నలుమూలల నుండి తల్లిదండ్రులు వారి చిన్నారులలో ఉత్సాహం మాకు స్పష్టంగా కనుబడుతోంది. ఇది BYJU’S Young Genius పాప్యులర్ అని చెప్పడానికి మాత్రమే కాదు, వెలుగు రావడానికి ఎదురుచూస్తున్న ఎందురో యువ మేధావులు ఎదురుచూస్తున్నారు అని చెప్పడానికి ప్రమాణం.

  కేవలం మొదటి రెండు వారాలలోనే 7,500 ఎంట్రీలు వచ్చాయి. దీనితో సీజన్ 2లో ప్రేక్షకులు అలాగే జడ్జీల కళ్ళు చెదిరేలా తమ ప్రతిభను, నైపుణ్యాలను ప్రదర్శించడానికి భారతదేశం అంతటి నుండి వజ్రాల వంటి యువకులు సిద్ధంగా ఉన్నారని అర్థం అవుతోంది. కార్యక్రమం గురించి ప్రచారం చేస్తున్న News18network, History Channel అలాగే Viacom network ఛానెల్‌ల వంటి ప్లాట్‌ఫామ్‌లలో అత్యంత ఆదరణ లభిస్తోంది. సోషల్ మీడియాలో BYJU’S Young Genius షోషల్ రీచ్ ఇప్పటికే రోజుకు 2 మిలియన్ల ఇంప్రెషన్‌లు దాటింది అలాగే కార్యక్రమం మైక్రోసైట్‌కు వచ్చే వ్యూల సంఖ్య స్థిరంగా రోజుకు 1 లక్ష వద్ద కొనసాగుతోంది.

  News 18 సీనియర్ ఎడిటర్, యాంకర్ ఆనంద్ నరసింహన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కార్యక్రమం 2022 జనవరిలో ప్రారంభం కానుంది. ఇందులో 6 నుండి 15 సంవత్సరాల వయస్సు ఉన్న యువ మేధావులు లలిత కళలు, విద్యా రంగం నుండు మొదలుకొని సాంకేతికత, వ్యాపారం, క్రీడలు ఇంకా మరెన్నో రంగాలలో తమ ప్రతిభను ఆవిష్కరిస్తారు. ప్రతీ ఎపిసోడ్‌లో వీరితో పాటు ప్రముఖ వ్యక్తులు వీరిని ప్రోత్సహించడానికి అలాగే తమ కథలను పంచుకోవడానికి వస్తారు, కాబట్టి ప్రతీ ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది.

  ప్రతీ చిన్నారిని వారి వ్యక్తిత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎలాంటి వివక్షలు లేకుండా గౌరవించే ఈ అసాధారణ కార్యక్రమంలో మీ చిన్నారి కూడా పాల్గొనాలి అనుకుంటే, ఇక్కడకు వెళ్ళి రిజిస్ట్రేషన్ ఫారమ్ నింపండి. ఈ మొదటి అడుగు తర్వాత, అనేక దశలలో మీ చిన్నారిని విశ్లేషించడానికి వివరణాత్మకమైన ఫారమ్ నింపాల్సి ఉంటుంది. ఇదే కాకుండా, ఎవరైనా BYJU’S యాప్ డౌన్‌లోడ్ చేసుకుని BYJU’S Young Genius సెక్షన్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు.

  త్వరలో రాబోతున్న News18 BYJU’S Young Genius సీజన్ 2తో మీ చిన్నారిని ప్రపంచానికి పరిచయం చేయాల్సిన సమయం వచ్చేసింది.

  Published by:Rekulapally Saichand
  First published:

  Tags: BYJUS

  ఉత్తమ కథలు