జాతీయ స్థాయిలో నిర్వహించే మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ (NEET 2022) ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను జూలై 17న(July) నిర్వహించనుంది. దీంతో విద్యార్థులు పరీక్షకు సన్నద్ధం కావడానికి మరో రెండు నెలల సమయం ఉంది. మరోపక్క బోర్డు(Board) పరీక్షలు(Exams) ఇంకా కొనసాగుతుండడంతో నీట్ కోచింగ్‌కు సమయం కేటాయిచడం సవాల్‌తో పాటు చాలా ఖరీదైనదిగా మారింది. అయితే నీట్ కోసం సన్నద్ధం కావడానికి ఆన్‌లైన్‌లో అనేక ఫ్రీ ప్లాట్‌ఫామ్స్(Free Platforms) ఉన్నాయి. కొన్ని పెయిడ్ పోర్టల్స్‌లో(Paid Portals) ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. నచ్చిన సమయంలో విద్యార్థులు వాటిని యాక్సెస్ చేసుకుని అధ్యయనం చేయవచ్చు. నీట్ కోసం అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ రిసోర్సెస్ ఏవో పరిశీలిద్దాం.
* స్వయం(SWAYAM)
ఈ పోర్టల్ ద్వారా నీట్‌కు సంబంధించిన ఉచిత ఆన్‌లైన్ కోర్సులను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందుకోసం అభ్యర్థులు స్వయం వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. ఏయే విద్యార్థులు ఫీజు చెల్లించాలో అంచనా వేయడానికి పోర్టల్ ప్రోక్టార్డ్ పరీక్షలను కూడా నిర్వహిస్తుంది. ఇంటర్నెట్ సదుపాయం లేని అభ్యర్థులు అందుబాటులో ఉన్న వివిధ DTH ఛానెల్‌ల ద్వారా లెక్చర్లను కూడా యాక్సెస్ చేయవచ్చు.
* నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)
నీట్ పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్‌టీఏ కూడా ప్రముఖ ప్రొఫెసర్ల లెక్చర్లు, మాక్ టెస్ట్ సిరీస్‌లను ఉచితంగా అందిస్తుంది. ఇవి సంస్థ అధికారిక వెబ్‌సైట్ nta.nic.inలో అందుబాటులో ఉన్నాయి. వీటిని ప్రతి ఒక్కరూ యాక్సెస్ చేసుకోవచ్చు.
* ఉత్తర ప్రదేశ్ అభ్యుదయ్ యోజన
ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులతో పాటు తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన అభ్యర్థుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రోగ్రామ్ కోసం నమోదు చేసుకున్న విద్యార్థులను స్క్రీనింగ్ ప్రక్రియ తర్వాత ఎంపిక చేయనున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లోని సిలబస్, నోట్స్, మాక్ క్వశ్చన్స్ మొదలైన స్టడీ మెటీరియల్‌లను ఈ పథకం ద్వారా విద్యార్థులకు అందజేస్తారు. వీటిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* News18 బ్రెయిన్ టీజర్
News18.com న్యూస్ వెబ్‌సైట్.... బ్రెయిన్ టీజర్ పేరుతో ఒక సాధారణ కాలమ్‌ను నడుపుతుంది. మెడికల్ ప్రవేశ పరీక్షలో చాలా తరచుగా అడిగే ప్రశ్నలు సమాధానాలతో ఇందులో ఉంటాయి. వీటిని పూర్తిగా ఉచితంగా పొందవచ్చు.
* నీట్Prep
మెడికల్ ప్రవేశ పరీక్ష కోసం పూర్తిగా10 చాప్టలర్ల ఉచిత ట్రయల్ వీడియో లెక్చర్‌లను ఈ పోర్టల్ అందిస్తుంది. అలాగే సందేహాలను క్లియర్ చేయడానికి ఉచిత అభ్యాస ప్రశ్నలు, ఆన్‌లైన్ పరీక్షలు, ప్రత్యక్ష సెషన్‌లను కూడా ఈ పోర్టల్ అందిస్తుంది.
ఈ ఆన్‌లైన్ కోచింగ్ రిసోర్సులతో పాటు నీట్ సిలబస్‌పై అభ్యర్థులు దృష్టిపెట్టాలి. 11, 12వ తరగతులకు చెందిన ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌పై లెక్చర్స్ ఆధారపడి ఉంటుంది. గతేడాది టాపర్ల మనోగతం ప్రకారం. . ఎన్‌సిఇఆర్‌టి సిలబస్ అధ్యయనంతో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన మాడ్యూల్స్ నుండి ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం ఎంతో కీలకం. అలాగే గతేడాది ప్రశ్నపత్రాలను రివైజ్ చేయడం కూడా ముఖ్యమే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Entrance exams, NEET, NEET 2022