Home /News /jobs /

PREPARING FOR JEE ADVANCED EXAM IF YOU PREPARE LIKE THIS YOU ARE GUARANTEED A SEAT IN IIT UMG GH

JEE Advanced 2022: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కు సిద్ధం అవుతున్నారా ? ఇది ఫాలో అయితే ఐఐటీలో సీట్ గ్యారంటీ !

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కు సిద్ధం అవుతున్నారా ? ఇలా ప్రిపేర్ అయ్యారో ఐఐటీలో సీట్ గ్యారంటీ !

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కు సిద్ధం అవుతున్నారా ? ఇలా ప్రిపేర్ అయ్యారో ఐఐటీలో సీట్ గ్యారంటీ !

జేఈఈ (JEE)అడ్వాన్స్‌డ్-2022 పరీక్షను ఆగస్టు 28న నిర్వహించనున్నారు. పేపర్-1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరగనుంది. మాక్ టెస్ట్ కోసం ప్రాక్టీస్ చేయడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ సందర్శించవచ్చని ఎన్‌టీఏ(NTA) సూచించింది

ఇంకా చదవండి ...
జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జేఈఈ(JEE)కి ఎంతో ప్రాధాన్యత ఉంది. జేఈఈ అడ్వాన్స్‌డ్-2022, దరఖాస్తు ప్రక్రియను ఐఐటీ(IIT) బాంబే ఆగస్టు 7 నుంచి ప్రారంభించనుండగా, ఆగస్టు 11 వరకు దరఖాస్తు ఫారమ్ అందుబాటులో ఉంటుంది. జేఈఈ మెయిన్-2022లో ఉత్తీర్ణత సాధించి, ఐఐటీల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం నమోదు చేసుకోవాలి. జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 పరీక్షను ఆగస్టు 28న నిర్వహించనున్నారు. పేపర్-1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరగనుంది. మాక్ టెస్ట్ కోసం ప్రాక్టీస్ చేయడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ సందర్శించవచ్చని ఎన్‌టీఏ సూచించింది.

జేఈఈ మెయిన్ 2022, సెషన్-1‌ టాప్ 2,50,000 దరఖాస్తుదారులు జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాగా, జేఈఈ మెయిన్ సెషన్ -1 జూన్‌లో ముగియగా, సెషన్-2 పరీక్షలు జులై 25 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి.

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష విధానం
జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT). ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒకటి పేపర్-1 కాగా, మరోటి పేపర్-2. ప్రతి పేపర్‌కు మూడు గంటల సమయం కేటాయిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ రెండు లాంగ్వేజ్‌‌లైన హిందీ(Hindi), ఇంగ్లిష్‌లో ఆరు గంటల పాటు జరుగుతుంది. ప్రతి ఏడాది మార్కింగ్ స్కీమ్ మారుతూ ఉంటుంది. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్క్స్ ఉండే అవకాశం ఉంది. అయితే ఇది కొన్ని ప్రశ్నలకు మాత్రమే ఉండవచ్చు. మార్కింగ్ స్కీమ్ వివరాలు ‘ఇన్‌స్ట్రక్షన్ టూ క్యాండిడేట్స్’ సెక్షన్‌లో పరీక్ష సమయంలో అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి పేపర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అనే మూడు భాగాలు ఉంటాయి.

ఇదీ చదవండి: Twitter Spaces: ట్విట్టర్ యూజర్స్ కు అదిరిపోయే న్యూస్.. అందుబాటులో కొత్త ఫీచర్.. వాళ్లకు మాత్రమే!


మార్కింగ్ స్కీమ్
జేఈఈ అడ్వాన్స్‌డ్ జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష. జాయింట్ అడ్మిన్ బోర్డు (JAB) ఆధ్వర్యంలో ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ గౌహతి, ఐఐటీ రూర్కీ వంటి ఏడు ఐఐటీలు లేదా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను నిర్వహిస్తాయి. ఈ ఎగ్జామ్ ద్వారా బీటెక్, బీఎస్, బీఆర్క్ (BArch) బీటెక్ అండ్ ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ, బీఎస్ అండ్ ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ డిగ్రీలను ఐఐటీలు ఆఫర్ చేస్తున్నాయి.



మరోవైపు, ఐఐటీ ఢిల్లీకి చెందిన అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (AIC) 8-18 ఏళ్ల వయసు ఉన్న వారి కోసం స్టెమ్‌రోబో (STEMROBO) టెక్నాలజీస్‌తో కలిసి టెక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (Tech Entrepreneurship) ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా ఫ్యూచర్ బిజినెస్ లీడర్స్‌ను తయారు చేస్తామని ఐఐటీ సంస్థ తెలిపింది.
Published by:Mahesh
First published:

Tags: IIT Bombay, Jee mains 2022, JOBS, National Testing Agency

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు