హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

GK Questions: ఏ జీవికి ఐదు కళ్ళు ఉన్నాయి? ఈ జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలకు సమాధానాలు తెలుసా?

GK Questions: ఏ జీవికి ఐదు కళ్ళు ఉన్నాయి? ఈ జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలకు సమాధానాలు తెలుసా?

GK Questions

GK Questions

GK Questions: ప్రస్తుతం నెలకొన్న పోటీలో నెగ్గి ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం. నిరంతర శ్రమ, పట్టుదలతోనే విజయావకాశాలు పెరుగుతాయి. పరీక్ష సిలబస్‌లోని అన్ని విభాగాలపై పట్టు సాధించడం అవసరం. దాదాపు అన్ని ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు, వివిధ కళాశాలల ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌లలో కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ విభాగం కచ్చితంగా ఉంటుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రస్తుతం నెలకొన్న పోటీలో నెగ్గి ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం. నిరంతర శ్రమ, పట్టుదలతోనే విజయావకాశాలు పెరుగుతాయి. పరీక్ష సిలబస్‌లోని అన్ని విభాగాలపై పట్టు సాధించడం అవసరం. దాదాపు అన్ని ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు, వివిధ కళాశాలల ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌లలో కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ విభాగం కచ్చితంగా ఉంటుంది. రాత పరీక్ష మొదలుకుని, ఇంటర్వ్యూ వరకు అభ్యర్థులకు జనరల్ నాలడ్జ్‌ నుంచి ప్రశ్నలు ఎదురవుతుంటాయి. జనలర్‌ నాలెడ్జ్‌ సబ్జెక్ట్‌ చాలా పెద్దది, ప్రతిరోజూ చదువుతున్నా, మొత్తం కవర్‌ చేశామనే దీమా రాదు. అందుకే ప్రతిరోజూ పది కొత్త ప్రశ్ననలకు సమాధానాలు తెలుసుకోవడం జనరల్‌ నాలెడ్జ్‌ ప్రిపరేషన్‌ని చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అందిస్తున్న ఈ క్విజ్‌కు మీకు సమాధానాలు తెలుసో? లేదో? చెక్‌ చేసుకోండి.

* ఒకరిని చూసిన తర్వాత ఎందుకు ఆవలింత వస్తుంది?

(ఎ) ఇతర వ్యక్తులు అలా చేయడం చూసినప్పుడు న్యూరాన్లు చురుకుగా మారతాయి, (బి) ఇన్ఫెక్షన్ కారణంగా, (సి) ఇలా జరగడానికి కారణం లేదు, (డి) వీటిలో ఏదీ కాదు

జవాబు-(ఎ) ఇతర వ్యక్తులు అలా చేయడం చూసినప్పుడు న్యూరాన్లు చురుకుగా మారతాయి

* ఏ జీవి తన నాలుకతో కానీ పాదాలతో రుచి చూడదు?

(ఎ) సీతాకోకచిలుక, (బి) ఆక్టోపస్, (సి) స్పైడర్, (డి) పక్షి

జవాబు-(ఎ) సీతాకోకచిలుక

* మేక ఏ దేశ జాతీయ జంతువు?

(ఎ) ఇరాన్, (బి) ఇరాక్, (సి) బుర్కినా ఫాసో, (డి)నైజీరియా

జవాబు-(సి) బుర్కినా ఫాసో

* ఇటీవల, హమ్జా యూసుఫ్ ఏ దేశానికి మొదటి మంత్రిగా ఎన్నికయ్యారు?

(ఎ) బ్రిటన్, (బి) స్కాట్లాండ్, (సి) యునైటెడ్ కింగ్‌డమ్,, (డి) స్కాట్లాండ్

జవాబు-(డి) స్కాట్లాండ్

* IMF ఇటీవల ఏ ఆఫ్రికన్ దేశానికి $80.77 మిలియన్ల సహాయాన్ని అందించింది?

(ఎ) థాయిలాండ్, (బి) బుర్కినా ఫాసో, (సి) ఇటలీ, (డి) టాంజానియా

జవాబు-(బి) బుర్కినా ఫాసో

* గేట్‌వే ఆఫ్ ఇండియా నుండి ఎలిఫెంటా గుహల వరకు ఈత కొట్టిన మొదటి వ్యక్తి ఎవరు?

(ఎ) IPS కృష్ణ ప్రకాష్, (బి) దేవ్ ప్రకాష్, (సి) ప్రేమ్ ప్రకాష్, (డి) నీరజ్ పాండే

జవాబు- (ఎ) IPS కృష్ణ ప్రకాష్

* ఇరాక్‌ను ఇంతకు ముందు ఏమని పిలిచేవారు?

(ఎ) మెసొపొటేమియా, (బి) అక్కద్, (సి) బాబిలోన్, (డి) అస్సిరియా

జవాబు- (ఎ) మెసొపొటేమియా

* ఏ జీవికి ఐదు కళ్ళు ఉన్నాయి?

(ఎ) బల్లి, (బి) తేనెటీగ, (సి) స్పైడర్, (డి) బొద్దింక

జవాబు-(బి) తేనెటీగ

* 100 రూపాయల నోటుపై ఎన్ని భాషల్లో అక్షరాలు ఉంటాయి?

(ఎ) 19 భాషలు, (బి) 18 భాషలు, (సి) 17 భాషలు, (డి) 25 భాషలు

జవాబు- (సి) 17 భాషలు

* ఏ జంతువు పాలు గులాబీ రంగులో ఉంటాయి?

(ఎ) మేక, (బి) ఒంటె, (సి) గాడిద, (డి) నీటి ఏనుగు

జవాబు-(డి) నీటి ఏనుగు

First published:

Tags: Career and Courses, EDUCATION, General knowledge, GK Capsule, Gk questions, JOBS

ఉత్తమ కథలు