హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UPSC Exam: ఇంట్లోనే సివిల్​ సర్వీసెస్​కు సిద్ధమవుతున్నారా.. అయితే ఈ షెడ్యూల్​తో విజయం సాధించండి..

UPSC Exam: ఇంట్లోనే సివిల్​ సర్వీసెస్​కు సిద్ధమవుతున్నారా.. అయితే ఈ షెడ్యూల్​తో విజయం సాధించండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇంట్లోనే ఉండి ప్రణాళికా బద్దంగా చదివితే సివిల్స్​ క్రాక్​ చేయవచ్చని ఎంతో మంది నిరూపించారు. కేవలం మాక్ టెస్టులు రాస్తూ స్వీయ అధ్యయనంతో సివిల్స్​లో నెగ్గిన వారు ఎంతో మంది. అయితే, దీనికి ఏకాగ్రతతో పాటు ప్రతిరోజూ ప్రణాళిక బద్దంగా సిద్ధమవడం చాలా ముఖ్యం.

ఇంకా చదవండి ...

అత్యున్నతమైన ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులు కావాలనేది ఎంతో మంది విద్యార్థుల కల. ఈ కలను నెరవేర్చుకునేందుకు సంవత్సరాలుగా కఠోర సాధన చేస్తుంటారు. అయితే యూపీఎస్సీ పరీక్షలో నెగ్గడం అంత సులభమైన విషయం కాదు. దీనికి ఏకాగ్రత, పట్టుదలతో పాటు సరైన గైడెన్స్​ కూడా చాలా అవసరం. అందుకే పేరొందిన శిక్షణా సంస్థలో కోచింగ్​ తీసుకుంటేనే సివిల్స్​లో విజయం సాధించగలమని చాలా మంది నమ్ముతారు. వాస్తవానికి ఇది నిజం కాదు. కోచింగ్ కన్నా ముందు స్వీయ అధ్యయనం చాలా ముఖ్యమని సివిల్స్​ విజేతలు చెబుతున్నారు.  కోచింగ్​ తీసుకోవడం ద్వారా నిపుణుల నుంచి గైడెన్స్​ పొందవచ్చు.

అంతేకానీ దీని వల్ల కచ్చితంగా సివిల్స్​ క్రాక్​ చేయవచ్చనే దానిలో ఎటువంటి నిజం లేదు. రూ.లక్షలు వెచ్చించి కోచింగ్​ తీసుకునే బదులు ఇంట్లోనే ఉండి ప్రణాళికా బద్దంగా చదివితే సివిల్స్​ క్రాక్​ చేయవచ్చని ఎంతో మంది నిరూపించారు. కేవలం మాక్ టెస్టులు రాస్తూ స్వీయ అధ్యయనంతో సివిల్స్​లో నెగ్గిన వారు ఎంతో మంది. అయితే, దీనికి ఏకాగ్రతతో పాటు ప్రతిరోజూ ప్రణాళిక బద్దంగా సిద్ధమవడం చాలా ముఖ్యం. మీరు ఎటువంటి కోచింగ్​ లేకుండా ఇంట్లోనే ఉండి సివిల్స్​ ప్రిపేర్ అవుతుంటే.. ప్రతి రోజూ ఈ షెడ్యుల్​ను అనుసరించండి.

Scholarships: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రూ.31 వేల నుంచి రూ.70వేల మధ్య స్కాలర్​షిప్ పొందాలంటే.. ఇలా చేయండి..


ప్రతి రోజూ ఇలా ప్రిపేరవ్వండి..

ఉదయం 5:00 గంటలకు లేచి మీ రోజును ప్రారంభించండి. ఉదయం 5:15 నుంచి 6:15 వరకు- యోగా, వ్యాయామం లేదా వాకింగ్​ వంటి శారీరక వ్యాయామాల్లో పాల్గొనండి. ధ్యానం, యోగా మీకు విశ్రాంతిని, ఒత్తిడిని తగ్గించడానికి, మీ మనస్సును రాబోయే సవాళ్లకు సిద్ధం చేయడంలో సహాయపడతాయి. ఉదయం 6:30లోపు కాలకృత్యాలు, స్నానం పూర్తి చేయండి. ఉదయం 6:30 నుంచి 7:30 వరకు- ముందు రోజు కవర్ చేసిన అంశాలను రివిజన్​ చేసుకోండి.

ఉదయం 7:30 నుంచి 8:00 వరకు బ్రేక్​ఫాస్​ చేయండి. ఆ తర్వాత వార్తాపత్రిక చదవండి. జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్‌ల గురించి తెలుసుకోవడంలో పేపర్​ చదవడం మీకు ఉపయోగపడుతుంది. ఉదయం 8:00 నుంచి 10:30 వరకు- అత్యంత సంక్లిష్టమైన టాపిక్స్​పై అధ్యయనం చేయండి. ఎందుకంటే ఈ సమయంలో మెదడు చురుగ్గా ఉంటుంది. ఉదయం 10:30 నుంచి 11:30 వరకు విశ్రాంతి తీసుకోండి. ఇది మీ మనస్సు, శరీరం రెండింటినీ ఉత్తేజపరుస్తుంది. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు- ఈ రోజు మీరు కవర్ చేయాల్సిన టాపిక్​పై దృష్టి పెట్టండి.

Online Courses: కోవిడ్ తరువాత ఈ కోర్సులకు పెరిగిన ఆదరణ.. 2021లో టాప్ ట్రెండింగ్ కోర్సులు ఇవే.. 


మధ్యాహ్నం 1:00 నుంచి 1:00 గంటలకు భోజన విరామం తీసుకోండి. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్నే తినండి. ఇది రోజంతా మీకు స్థిరమైన శక్తిని అందిస్తుంది.

మధ్యాహ్నం 1:30. నుంచి 4:00 వరకు రెండు గంటల పాటు చదువుకోండి. ఆ తర్వాత 30 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి. సాయంత్రం 4:00. సాయంత్రం 4:30 వరకు విరామం తీసుకోండి. స్నాక్స్‌, టీ తీసుకోండి. వీలుంటే ఈ సమయంలో కొన్ని వ్యాయామాలు కూడా చేయండి.

సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు యూపీఎస్సీ ఇంటర్వ్యూలో మీకు ఉపయోగపడే టాపిక్స్​పై దృష్టి పెట్టండి. సాయంత్రం మిగిలిన సమయాన్ని క్రీడలు ఆడటానికి లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంభాషించడానికి ఉపయోగించండి. రాత్రి భోజనం త్వరగా ముగించుకొని పడుకోండి.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Central Government, Central Government Jobs, Civil Services, UPSC

ఉత్తమ కథలు