హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CBSE Term 2: సీబీఎస్‌ఈ పదో తరగతి విద్యార్థులకు ప్రిపరేషన్ టిప్స్.. మ్యాథ్స్‌లో మంచి మార్కులు సాధించండిలా..!

CBSE Term 2: సీబీఎస్‌ఈ పదో తరగతి విద్యార్థులకు ప్రిపరేషన్ టిప్స్.. మ్యాథ్స్‌లో మంచి మార్కులు సాధించండిలా..!

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

సీబీఎస్‌ఈ (CBSE) విద్యార్థులకు త్వరలో టర్మ్‌2 పరీక్షలు (Term 2 Exams) జరగనున్నాయి. 10, 12వ తరగతి విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. టర్మ్‌ 1 పరీక్షలకు విభిన్నంగా టర్మ్‌ 2 పరీక్షలు జరగనున్నాయి. మ్యాథ్స్ ఎగ్జామ్ లో విద్యార్థులు మంచి మార్కులు సాధించేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం.

ఇంకా చదవండి ...

సీబీఎస్‌ఈ (CBSE) విద్యార్థులకు త్వరలో టర్మ్‌2 పరీక్షలు (Term 2 Exams) జరగనున్నాయి. 10, 12వ తరగతి విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. టర్మ్‌ 1 పరీక్షలకు విభిన్నంగా టర్మ్‌ 2 పరీక్షలు జరగనున్నాయి. దీంతో విద్యార్థులు(Students) పరీక్షకు సంబంధించి కొన్ని అంశాలపై దృష్టి సారించాల్సి ఉంది. టర్మ్‌ 1 పరీక్షలు మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో నిర్వహించారు. ప్రస్తుతం టర్మ్‌ 2లో సబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. టర్మ్‌ 2(Term 2) పరీక్షల్లో వివిధ నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. కాంపిటెన్సీ స్కిల్స్‌, థింకింగ్‌ స్కిల్స్‌, రీజనింగ్‌(Reasoning) స్కిల్స్‌, కేస్‌ స్టడీ అండ్‌ న్యూమరసీ స్కిల్స్‌కు సంబంధించి విద్యార్థులను పరీక్షించనున్నారు. కొవిడ్‌ కారణంగా 50 శాతం సిలబస్‌ నుంచే టర్మ్‌ 2లో ప్రశ్నలు అడుగుతారు. అదే విధంగా ఈ విద్యాసంవత్సరంలో ఎక్కువగా విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులకు హాజరైన కారణంగా పరీక్షల్లో మంచి మార్కలు సాధించాలంటే సాధారణం కంటే కాస్త ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.

Jobs in Hyderabad: డిగ్రీ అర్హతతో రూ.50,000 వేతనం.. ద‌ర‌ఖాస్తుకు రెండురోజే చాన్స్‌

విద్యార్థులు తమ లోపాలను గుర్తించి, మెరుగ్గా పరీక్షలకు సన్నద్ధమవ్వాలంటే ప్రీ బోర్డ్‌ అసెస్‌మెంట్స్‌ ఉపయోగపడతాయి. సీబీఎస్‌సీ విడుదల చేసిన మాదిరి ప్రశ్నాపత్రాలతో ప్రాక్టీస్‌ చేయడం కూడా విద్యార్థులకు మంచి మార్కులు సాధించే అవకాశాలను మెరుగుపరుస్తుంది. ఈ సమయంలో విద్యా నిపుణుల సూచనలు విద్యార్థులకు ఎంతగానో మేలు చేస్తాయి. విద్యార్థులు సమయాన్ని ఆయా సబ్జెక్టులకు సమానంగా కేటాయించి.. ప్రణాళికకు కట్టుబడి పరీక్షలకు సన్నద్ధమయితే మంచి ఫలితాలు వస్తాయి.

మ్యాథ్స్ ఎగ్జామ్‌కు నిపుణుల సూచనలివే..

రివిజన్

సీబీఎస్‌సీ ప్రశ్నాపత్రాలను NCERT పుస్తకాల ఆధారంగా రూపొందిస్తారు. కాబట్టి విద్యార్థులు పరీక్షకు ముందు ఈ పుస్తకాలను శ్రద్ధగా చదవాలి. ఉదాహరణలుగా ఇచ్చిన ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేయాలి. పరీక్షకు ముందు రోజు అన్ని మ్యాథ్స్ ఫార్ములాలను రివైజ్‌ చేసుకోవాలి.

ప్రశ్నల ఎంపిక సరిగా ఉండాలి

ఎగ్జామినేషన్‌ హాల్‌లో ముందు గట్టిగా శ్వాస తీసుకొని ప్రశ్నాపత్రం మొత్తం చదవాలి. ఏ విభాగంలో ఏ ప్రశ్నలకు సమాధానాలు ముందు రాయాలో నిర్ణయించుకోవాలి. సులువుగా అనిపించినవి ముందుగా రాసి.. ఆ తర్వాత మిగతా ప్రశ్నలకు వెళ్లాలి. సమాధానాలు రాయడానికి ఎక్కువ సమయం తీసుకొనే ప్రశ్నలను చివరిలో రాయడం మంచిది.

వాటిపై దృష్టిపెట్టాలి

కొన్ని ప్రశ్నలకు త్వరగా లెక్కించగలిగే సామర్థ్యం ఉండాలి. అడిషన్స్‌, సబ్ట్రాక్షన్స్‌, మల్టిప్లికేషన్స్‌ వంటి వాటిని పెద్ద సంఖ్యలతో కూడా త్వరగా చేసేలా సిద్ధమవ్వాలి. ఏదైనా ప్రశ్నకు సమాధానం రాసే ముందు ప్రశ్న నంబరును రాయడం సరిచూసుకోవాలి. ప్రశ్నను తిరిగి జవాబు పత్రంలో రాయాల్సిన అవసరం లేదు. అలా చేస్తే అనవసరంగా సమయం వృథా అవుతుంది.

Telangana Jobs: టీఎస్ఏసీఎస్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. వేత‌నం రూ.13,000.. అర్హ‌తలు ఇవే!

నీట్‌, క్లీన్‌ పేపర్‌

సమాధానాలు కొట్టివేతలు రాయకుండా చక్కగా రాయాలి. అవసరమైన చోట బొమ్మలు గీయాలి. ముఖ్యంగా జామెట్రీ, సర్ఫేస్‌ ఏరియా అండ్‌ వాల్యూమ్‌, సర్కిల్‌, అప్లికేషన్స్‌ ఆఫ్‌ ది ట్రిగనామెట్రీ వంటి అంశాలకు బొమ్మలు గీస్తే మంచి మార్కులు సాధించవచ్చు. మీరు ఒకవేళ పరీక్షను తొందరగా పూర్తి చేస్తే.. రివైజ్‌ చేసుకోవడానికి ఆ సమయాన్ని వినియోగించుకోండి. సాధారణంగా గంట నుంచి 1 గంట 20 నిమిషాల్లో పరీక్షను పూర్తి చేయవచ్చు. ఏదైనా తప్పులు దొర్లాయేమో చూసుకోవడానికి మిగతా సమయాన్ని కేటాయిస్తే మంచిది. ఏదైనా ప్రశ్నలకు సమాధానాలు రాయడం మర్చిపోయారేమో సరి చూసుకోవాలి. చివరిగా మీరు తీసుకొన్న సప్లెమెంటరీ ఆన్సర్‌ షీట్లను సరిగా కట్టి అందజేయాలి.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, CBSE, Education CBSE, Maths

ఉత్తమ కథలు