Home /News /jobs /

PREPARATION TIPS FOR CBSE 12TH CLASS STUDENTS TIPS TO FOLLOW FOR HIGHER MARKS IN ENGLISH GH VB

CBSE Term 2: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ప్రిపరేషన్ టిప్స్.. ఇంగ్లీష్‌లో ఎక్కువ మార్కులకు ఇలా చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం సీబీఎస్‌ఈ టర్మ్‌ 1 పరీక్షలు పూర్తయ్యాయి. టర్మ్‌ 2 పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. 12వ తరగతి ఇంగ్లీష్ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం నిపుణులు కొన్ని సూచనలు చేశారు.

కరోనా(Corona) కారణంగా దాదాపు రెండేళ్లపాటు పాఠశాలలు, కళాశాలలు మూతబడ్డాయి. ప్రత్యక్ష తరగతులు కొన్ని రోజులు, ఆన్‌లైన్‌ తరగతులు(Online Classes) కొన్ని రోజులు నిర్వహించారు. విద్యా విధానంలో వచ్చిన మార్పులు, కరోనా విజృంభణతో ఇంటికే పరిమితం అవ్వడం వంటి కారణాలతో పిల్లలు ఒత్తిడికి గురయ్యారు. పబ్లిక్‌ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పటికే ప్రవేశ పరీక్షలు(Entrance Exams), బోర్డు పరీక్షలకు మధ్య తగినంత వ్యవధి ఉండేలా చూడాలని విద్యార్థుల నుంచి ఎక్కువగా డిమాండ్లు వినిపించాయి. జేఈఈ మెయిన్‌(JEE Main) పరీక్ష తేదీల ప్రకటనతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేశాయి. జేఈఈ మెయిన్‌ని నాలుగు విడతల్లో నిర్వహించాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం సీబీఎస్‌ఈ టర్మ్‌ 1 పరీక్షలు పూర్తయ్యాయి. టర్మ్‌ 2 పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. 12వ తరగతి ఇంగ్లీష్ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం నిపుణులు కొన్ని సూచనలు చేశారు. ఈ సూచనలు, సలహాలు పాటిస్తే ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరుకాగలరని, మంచి మార్కులు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

స్టడీ షెడ్యూల్‌
పరీక్షలకు ముందు సరైన ప్రణాళిక సిద్ధం చేసుకోవడం చాలా అవసరం. ఉన్న సమయాన్ని బట్టి సబ్జెక్టులకు సమయం కేటాయించుకోవాలి. ప్రాధాన్యాన్ని బట్టి సబ్జెక్టులకు ఎక్కువ సమయం ఇవ్వాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకొనేందుకు ఇంట్లోని ఓ గదినో, స్థలాన్నో ఎంచుకొని అక్కడే కూర్చుని చదువుకోవాలి.

CBSE 12th CLASS: సీబీఎస్‌ఈ 12వ తరగతి టర్మ్1 ఫలితాలపై అభ్యంతరాలు ఉన్నాయా..? ఇలా ఫిర్యాదు చేయండి..


ప్రాక్టీస్‌ రైటింగ్‌
ప్రశ్నలకు సమాధానాలు రాయడం ప్రాక్టీస్‌ చేయాలి. అలా చేయడం ద్వారా సమాధానాల్లోని ముఖ్యమైన అంశాలను గుర్తించగలుగుతారు. సీబీఎస్‌ఈ ఇప్పటికే మాదిరి ప్రశ్నాపత్రాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ముందుగా సమాధానాలు రాయడం ప్రాక్టీస్‌ చేయడం ద్వారా పరీక్షలో ఆలస్యం కాకుండా వేగంగా సమాధానాలు రాయగలుగుతారు. సమయం ఆదా అవుతుంది.

ప్రజెంటేషన్‌పై దృష్టి
ఫైనల్‌ పరీక్షల్లో సమాధానాలపై మాత్రమే కాకుండా.. హ్యాండ్‌ రైటింగ్‌, స్పెల్లింగ్‌ మిస్టేక్‌లు, గ్రామర్‌ వంటి అంశాలకు సంబంధించి ఎటువంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తపడాలి. సమాధానాలు రాసే సమయంలో ప్రతి పదానికి మధ్య అవసరమైనంత దూరం ఇస్తూ అందంగా అక్షరాలు రాయాలి. జవాబుపత్రం మొత్తం చక్కగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రశ్న నంబర్లు సక్రమంగా వేశారా? లేదా? అనేది సరి చూసుకోవాలి. సమాధానాల్లోని ముఖ్యమైన అంశాలను అండర్‌లైన్‌ చేస్తే బాగుంటుంది.

పుస్తకాలు
విద్యార్థులు తమ పుస్తకాలను పూర్తిగా చదవాలి. పాఠ్యాంశాలకు సంబంధించిన మైండ్‌ మ్యాప్‌లను గుర్తించుకోవాలి. ఇలా చేస్తే అన్ని పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రాథమిక అవగాహన ఉంటుంది. అన్ని రకాల ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే స్థాయిలో ఉంటారు.

మాదిరి ప్రశ్నాపత్రాలు
సీబీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ http://cbseacadenic.nic.in/qbclass12.htmlలో 12వ తరగతి ఇంగ్లీష్ ప్రశ్నాపత్రాలను అందుబాటులో ఉంచారు. ఇతర సబ్జెక్టులకు సంబంధించి ప్రశ్నాపత్రాలను చూడటం ద్వారా విద్యార్థులకు మేలు జరుగుతుంది. పరీక్షలపై ఓ అవగాహన కలుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు ప్రశాంతంగా ఉండి, ఒత్తిడిని దగ్గరికి రానీయకుండా పరీక్షలకు హాజరుకావడం అవసరం.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, CBSE, Cbse exams, Students

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు