హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC పేపర్ లీక్ కేసులో కీలక పురోగతి..మరో వ్యక్తి అరెస్ట్..!

TSPSC పేపర్ లీక్ కేసులో కీలక పురోగతి..మరో వ్యక్తి అరెస్ట్..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TSPSC Paper Leak Case: TSPSC పేపర్ లీక్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్ రేణుక సహా 9 మందిని సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా రమేష్, సురేష్ తో పాటు మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఇక తాజాగా మరొకరిని అధికారులు అరెస్ట్ చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

TSPSC Paper Leak Case: TSPSC పేపర్ లీక్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్ రేణుక సహా 9 మందిని సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా రమేష్, సురేష్ తో పాటు మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఇక తాజాగా మరొకరిని అధికారులు అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేటకు చెందిన ప్రశాంత్ రెడ్డి పేపర్ లీక్ చేసిన వారి నుంచి కొనుగోలు చేసి గ్రూప్ 1 పరీక్ష రాసినట్లు నిర్ధారించారు. దీనితో ప్రశాంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 13కు చేరింది. అలాగే రాజశేఖర్, రేణుకతో జరిగిన ఆర్ధిక లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

TSPSC Paper Leak Case: TSPSC పేపర్ లీక్ లో కొత్త లింకులు..వాట్సప్ చాట్ ఆధారంగా కూపీ లాగుతున్న సిట్

ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు TSPSCలో పని చేసే 42 మందికి నోటీసులు ఇచ్చారు. ప్రవీణ్, రాజశేఖర్ తో సన్నిహితంగా ఉన్న వారందరిని సిట్ విచారించనున్నట్లు తెలుస్తుంది. ఔట్ సోర్సింగ్ లో పని చేసే ఐటీ సిబ్బందికి కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. అలాగే కాన్ఫిడెన్షియల్ రూం ఇంఛార్జి శంకర్ లక్ష్మిని కూడా అధికారులు లోతుగా విచారిస్తున్నారు. ఇప్పటివరకు కమీషన్ లో పని చేసే ప్రవీణ్ ఒక్కడే గ్రూప్ 1 పరీక్ష రాశాడని తేలగా తాజాగా మరో 10 మంది కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయినట్లు తెలుస్తుంది. ఇందులో ఏడుగురు రెగ్యులర్ ఉద్యోగులు కాగా మరో ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా తెలుస్తుంది. ఈ క్రమంలో పరీక్ష రాసిన వారిని కూడా సిట్ విచారించనుంది. ఇక ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న రేణుక ఆమె భర్త డాక్వా నాయక్ కు కోచింగ్ సెంటర్ నిర్వాహకులతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. దీనితో ఆ అభ్యర్థులను కూడా సిట్ విచారించేందుకు సిద్దమయింది.

పేపర్ లీక్ లో తొలి వేటు..

పేపర్ లీక్ లో కేసులో అధికారులు తొలి వేటు వేశారు. పేపర్ లీక్ లో రేణుక, ఆమె భర్త ప్రమేయం ఉండడంతో వారిద్దరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం బాలికల గురుకుల పాఠశాలలో రేణుక హిందీ టీచర్ గా పని చేస్తుంది. అలాగే ఆమె భర్త డాక్యా నాయక్ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ఎంపిడివో ఆఫీస్ లో ఉపాధి హామీ స్కీమ్ టెక్నీకల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. మరి రానున్న రోజుల్లో ఈ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

First published:

Tags: Crime, JOBS, Telangana, Telangana government jobs, TSPSC

ఉత్తమ కథలు