భారత ప్రభుత్వ సమాచార, మంత్రిత్వ శాఖకు చెందిన ప్రసార భారతి ఢిల్లీ (Delhi) విభాగంలో కాస్ట్ ట్రైనీ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందుకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ (Notification) ఆధారంగా 16 కాస్ట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తారు. కాంట్రాక్టు (Contract) కాల పరిమితి రెండేళ్లు ఉంటుంది. కాంట్రాక్టు కాల పరిమితి మూడేళ్లు ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారా ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష (Written Test) ఇంటర్వ్యూ (Interview) ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 31, 2021 వరకు అవకాశం ఉంది. ఎంపిక విధానం తో పాటు పూర్తి వివరాల కోసం ప్రసార భారతి అధికారిక వెబ్సైట్ https://prasarbharati.gov.in/ ను సందర్శించాలి.
ముఖ్యమైన సమాచారం..
పోస్టు పేరు | కాస్ట్ ట్రైనీ |
పోస్టుల సంఖ్య | 16 |
అర్హతలు | ఇంటర్మీడియట్లో 60 శాతం మార్కులు రావాలి. |
అధికారిక వెబ్సైట్ | https://prasarbharati.gov.in/ |
జీతం | మొదటి ఏడాది రూ.10,000 రెండో ఏడాది రూ.12,500, మూడో ఏడాది రూ. 15,000 |
దరఖాస్తుకు చివరి తేదీ | అక్టోబర్ 31, 2021 |
ఎంపిక విధానం..
Step 1 : దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.
Step 2 : పరీక్షలో పాసైన వారికి ఇంటర్వ్యూలు (Interviews) నిర్వహించి ఎంపిక చేస్తారు.
IIT Kanpur: ఒలింపియాడ్‌లకు అర్హత సాధించిన విద్యార్థులకు నేరుగా ఐఐటీల్లోకి ప్రవేశం..
దరఖాస్తు విధానం..
Step 1: దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది.
Step 2: ముందుగా అధికారిక వెబ్సైట్ https://prasarbharati.gov.in/ ను సందర్శించాలి.
Step 3: అనంతరం నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 4: అర్హత ఉన్న పోస్టులకు ఆన్లైన్ లింక్ https://applications.prasarbharati.org లోకి వెళ్లాలి.
Step 5: అనంతరం మొబైల్ నంబర్ ద్వారా రిజిస్టర్ (Register) చేసుకోవాలి.
Step 6: రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత దరఖాస్తు ఫాం నింపాలి.
Step 7: నింపిన తరువాత అప్లికేషన్‌కు అవసరమైన డాక్యుమెంట్లు (Documents) అప్లోడ్ చేయాలి.
Step 8: దరఖాస్తు పూర్తయిన తరువాత సబ్మిట్ కొట్టాలి.
Step 9: అప్లికేషన్ ఫాంను ఒక కాపీ ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.
Step 10: దరఖాస్తుకు ఆఖరు తేదీ అక్టోబర్ 31, 2021
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Govt Jobs 2021, Job notification, JOBS