భారత ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ సర్వీస్ బ్రాడ్క్యాస్టర్ ప్రసార భారతి (Prasar Bharti) పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 9 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 జనవరి 20 చివరి తేదీ. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారు డీడీ కిసాన్ ఛానల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులకు రెండు నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి. ఖాళీల వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
మొత్తం ఖాళీలు | 9 | విద్యార్హతలు | అనుభవం | వయస్సు | వేతనం |
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్ | 3 | సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. హిందీ తెలిసి ఉండాలి. జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన డిగ్రీ, డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. | ఏదైనా టీవీ ఛానెల్, ప్రొడక్షన్ హౌజ్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో నాలుగేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. | 35 ఏళ్ల లోపు | రూ.35,000 నుంచి రూ.40,000 |
సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్ | 6 | సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. హిందీ తెలిసి ఉండాలి. జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన డిగ్రీ, డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. | ఏదైనా టీవీ ఛానెల్, ప్రొడక్షన్ హౌజ్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆరేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. | 50 ఏళ్ల లోపు | రూ.50,000 నుంచి రూ.55,000 |
DSSSB Recruitment 2022: డిగ్రీ అర్హతతో 878 ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు
దరఖాస్తు ప్రారంభం- 2022 జనవరి 5
దరఖాస్తుకు చివరి తేదీ- 2022 జనవరి 20
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
అనుభవం- 4 నుంచి 6 ఏళ్ల అనుభవం తప్పనిసరి.
వేతనం- రూ.35,000 నుంచి రూ.55,000 మధ్య వేతనం లభిస్తుంది.
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటీవ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Step 1- అభ్యర్థులు ముందుగా https://applications.prasarbharati.org/ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో Register Yourself పైన క్లిక్ చేసి అభ్యర్థి తన వివరాలతో రిజిస్టర్ చేయాలి.
Step 3- ఆ తర్వాత లాగిన్ చేసి దరఖాస్తు చేయాలనుకున్న పోస్ట్ సెలెక్ట్ చేయాలి.
Step 4- విద్యార్హతలు, అనుభవం, ఇతర వివరాలతో దరఖాస్తు చేయాలి.
Step 5- దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Central Government Jobs, Govt Jobs 2022, Job notification, JOBS, Prasar Bharti