Jobs: ప్రసార భారతిలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే

Prasar Bharati Recruitment 2020 | ప్రసార భారతి సోషల్ మీడియా కంటెంట్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: July 8, 2020, 2:54 PM IST
Jobs: ప్రసార భారతిలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే
Jobs: ప్రసార భారతిలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు శుభవార్త. ప్రసార భారతి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కంటెంట్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల్ని ప్రకటించింది. సోషల్ మీడియా కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 7 ఖాళీలున్నాయి. న్యూ ఢిల్లీలో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 20 చివరి తేదీ. దరఖాస్తుల్ని పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రసార భారతి అధికారిక వెబ్‌సైట్ http://prasarbharati.gov.in/ లో తెలుసుకోవచ్చు.

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 723 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

Police Jobs: డిగ్రీ పాసైనవారికి 1564 పోలీస్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Prasar Bharati Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


మొత్తం కంటెంట్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులు- 7
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 20 సాయంత్రం 5 గంటలు
వేతనం- రూ.20,000విద్యార్హత- పీజీ డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ జర్నలిజం. ఏడాది అనుభవం తప్పనిసరి. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సామర్థ్యం ఉండాలి.
వయస్సు- 30 ఏళ్లు
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Deputy Director (HR),
Doordarshan News,
Room No. 413,
Doordarshan Bhawan,
Tower-B, Copernicus Marg,
New Delhi - 110001
Published by: Santhosh Kumar S
First published: July 8, 2020, 2:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading