హోమ్ /వార్తలు /jobs /

Prasar Bharati Jobs: ప్రసార భారతిలో ఉద్యోగాలు... హైదరాబాద్‌లో నివసించేవారికి మాత్రమే

Prasar Bharati Jobs: ప్రసార భారతిలో ఉద్యోగాలు... హైదరాబాద్‌లో నివసించేవారికి మాత్రమే

Prasar Bharati Jobs | హైదరాబాద్‌లోని ఆల్ ఇండియా రేడియో యూనిట్ వెబ్ ఎడిటర్లను నియమిస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

Prasar Bharati Jobs | హైదరాబాద్‌లోని ఆల్ ఇండియా రేడియో యూనిట్ వెబ్ ఎడిటర్లను నియమిస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

Prasar Bharati Jobs | హైదరాబాద్‌లోని ఆల్ ఇండియా రేడియో యూనిట్ వెబ్ ఎడిటర్లను నియమిస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  ప్రసార భారతికి చెందిన ఆల్ ఇండియా రేడియో-AIR ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లోని యూనిట్‌లో వెబ్ ఎడిటర్లను నియమిస్తోంది. క్యాజువల్ అసైన్‌మెంట్ పద్ధతిలో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్-GHMC పరిధిలో నివసించేవారి నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఖాళీల వివరాలను ప్రకటించలేదు. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 మార్చి 1 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://newsonair.com/ వెబ్‌సైట్‌లో Vacancies సెక్షన్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి, చివరి తేదీలోగా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పోస్టులో పంపాలి.

  SSC Recruitment 2021: టెన్త్ పాసైనవారికి వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు... సిలబస్ ఇదే

  Railway Jobs: భారతీయ రైల్వేలో ఉద్యోగాలు... టెన్త్ నుంచి డిగ్రీ వరకు అర్హత

  Prasar Bharati Jobs 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

  భర్తీ చేసే పోస్టులు- వెబ్ ఎడిటర్

  దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 1 సాయంత్రం 5 గంటలు

  విద్యార్హతలు- ఏదైనా డిగ్రీ పాస్ కావాలి. జర్నలిజంలో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జర్నలిజం ఉండాలి.

  అనుభవం- జర్నలిజంలో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జర్నలిజం లేనివారికి ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో రిపోర్టింగ్ లేదా ఎడిటింగ్ వర్క్‌లో 5 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.

  ఇతర అర్హతలు- జీహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తున్నవారే దరఖాస్తు చేయాలి. గ్రాఫిక్ డిజైనింగ్‌తో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్ తెలిసుండాలి.

  వయస్సు- 21 నుంచి 50 ఏళ్లు

  దరఖాస్తు ఫీజు- జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు రూ.225

  ఎంపిక విధానం- రాతపరీక్ష, ఇంటర్వ్యూ

  BRO Recruitment 2021: బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌లో 459 ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్ పాసైతే చాలు

  PNB Recruitment 2021: ఇంటర్ పాస్ అయినవారికి బ్యాంకులో ప్యూన్ ఉద్యోగాలు

  Prasar Bharati Jobs 2021: దరఖాస్తు విధానం

  అభ్యర్థులు ముందుగా http://newsonair.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

  Vacancies సెక్షన్‌లో వెబ్ ఎడిటర్ నోటిఫికేషన్ ఉంటుంది.

  నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు, ఇతర వివరాలు తెలుసుకోవాలి.

  నోటిఫికేషన్‌లోనే దరఖాస్తు ఫామ్ ఉంటుంది.

  దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి, డాక్యుమెంట్స్ జతచేసి 2021 మార్చి 1 సాయంత్రం 5 గంటల్లోగా ఈ కింది అడ్రస్‌కు పోస్టులో పంపాలి.

  దరఖాస్తు ఫామ్‌కు జత చేయాల్సిన డాక్యుమెంట్స్- ప్రూఫ్ ఆఫ్ ఏజ్ (టెన్త్ మెమో లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్), ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ (ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్), జీహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తున్నట్టు ప్రూఫ్ (పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్, ఎంఆర్‌ఓ జారీ చేసిన రెసిడెన్స్ సర్టిఫికెట్, రెంటల్ లీజ్ అగ్రిమెంట్), విద్యార్హతల సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు, వర్క్ ఎక్స్‌పీరియెన్స్‌కు సంబంధించిన ప్రూఫ్స్

  దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:

  Sr. Administrative Officer,

  All India Radio,

  Hyderabad, Saifabad,

  Opp. State Assembly Building,

  Hyderabad ‐ 500004.

  First published:

  ఉత్తమ కథలు