• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • POWERGRID CORPORATION HAS INVITED APPLICATIONS FROM ENGINEERS FOR 35 VACANCIES HERE SALARY AND OTHER DETAILS NS

Power Grid Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

Power Grid Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీలు, విద్యార్హతలు, వేతనాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి,

  • Share this:
    ఇటీవల ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అవుతున్నాయి. తాజాగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ట్రైనీ విభాగంలో ఖాళీల భర్తీకి ఈ నియామకాలు చేపట్టారు. ఈ ఖాళీలు సదరన్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టంలో ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు మొదటగా నెలకు రూ. 27,500 వరకు వేతనం చెల్లించనున్నారు. రెగ్యులరైజ్ చేసిన అనంతరం రూ. 25 వేల నుంచి రూ.1.70 లక్షల వరకు వేతనం ఉంటుంది. ఇతర పూర్తి వివరాలను అభ్యర్థులు నోటిఫికేషన్లో చూడొచ్చు.
    NTPC Recruitment 2021: ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండా మార్కులతోనే ఎంపిక.. దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్
    UPSC Civil Services Free Coaching: సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్.. ఈ సంస్థల్లో ఫ్రీ కోచింగ్.. తెలుసుకోండి

    ఎవరు అప్లై చేయాలంటే..
    మొత్తం 35 డిప్లొమో ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. మూడేళ్ల డిప్లొమో కోర్సును గుర్తింపు పొంది టెక్నికల్ బోర్డు లేదా సంస్థ నుంచి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులు 70 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, PWD, Ex-SM అభ్యర్థులు పాస్ మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థులు ఈ కింది స్ట్రీమ్ లలో డిప్లొమో చేసి ఉండాలి.
    -ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
    -ఎలక్ట్రికల్(పవర్) ఇంజనీరింగ్
    -ఎలక్ట్రికలల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
    -పవర్ సిస్టెమ్స్ ఇంజనీరింగ్
    -పవర్ ఇంజనీరింగ్(ఎలక్ట్రికల్)

    -బీటెక్, ఎంటెక్ విద్యార్హత కలిగి డిప్లొమో చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అనర్హులు. అభ్యర్థుల వయస్సు 27 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు 30 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 32 ఏళ్లను వయో పరిమితిగా నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్ లు నిర్వహించి ఫిట్ గా ఉన్నట్లు తేలితేనే విధుల్లోకి తీసుకుంటారని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    Notification - Direct Link
    Application - Direct Link

    ఎలా అప్లై చేయాలంటే..
    అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్లకు ఈ నెల 29ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసే సమయంలో స్కానింగ్ చేసిన పాస్ పార్ట్ సైజ్ ఫొటో, సిగ్నేచర్, డేట్ ఆఫ్ బర్త్, విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికేట్లు, అనుభవం, కుల ధ్రువీకరణ పత్రం, PWD సర్టిఫికేట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు