Home /News /jobs /

POSTPONE NEET PG PLEA FILED IN SUPREME COURT BY ASPIRANTS NBE EDU IN DETAILS HERE GH VB

NEET PG: నీట్ పీజీ- 2022 పరీక్షను వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు.. కారణం ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జాతీయ స్థాయిలో నిర్వహించే పీజీ మెడికల్ ఎంట్రన్స్.. నీట్ పీజీ-2022 విషయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIMSA) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

జాతీయ స్థాయిలో నిర్వహించే పీజీ మెడికల్ ఎంట్రన్స్(PG Medical Entrance).. నీట్ పీజీ(NEET PG-2022) విషయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIMSA) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని న్యాయవాది సందీప్ తివారీ ట్విట్టర్‌లో పంచుకున్నారు. షెడ్యూల్ ప్రకారం నీట్ పీజీ పరీక్ష మే 21న జరగాల్సి ఉంది. ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIMSA) తరఫున (NEET) PG- 2022 పరీక్ష షెడ్యుల్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించామని తివారీ తెలిపారు. NEET-PG 2021 కౌన్సెలింగ్‌ తేదీలతో ఈ ఏడాది ఎగ్జామ్ డేట్స్ సరిపోలకపోవడంతో అభ్యర్థులు ఫిర్యాదు రూపంలో అభ్యంతరం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

NEET PG -2021 కౌన్సెలింగ్ ప్రక్రియలో జాప్యం కారణంగా అనేక మంది NEET PG -2022 ఆశావహులు పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియను వాయిదా వేయడం వల్ల తాము ప్రవేశ పరీక్షకు సిద్ధం కావడానికి చాలా తక్కువ సమయం మిగిలి ఉందని విద్యార్థులు అంటున్నారు. ఒక వేళ పరీక్ష నిర్వహించినా కోవిడ్-19 మహమ్మారి సమయంలో కోవిడ్ యోధులుగా సేవలందించిన దాదాపు 5,000 మంది మెడికల్ ఇంటర్న్‌లు పరీక్షకు హాజరు కావడానికి అనర్హులు అవుతారని చెప్పారు.

ఇటీవల ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ NEET PG- 2022 పరీక్షను 8 నుండి 10 వారాలకు వాయిదా వేయాలని కోరుతూ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. 2021 కౌన్సెలింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, అది మే 3 నాటికి ముగుస్తుందని, దీంతో విద్యార్థులు డైలమాలో ఉన్నారని AIMSA లేఖలో పేర్కొంది. ఆలస్యమైన కౌన్సెలింగ్ ప్రక్రియ కారణంగా విద్యార్థులు అనిశ్చితిలో ఉన్నారని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

Gadgets: సమ్మర్‌లో స్మార్ట్ గాడ్జెట్స్ హీట్ అవుతున్నాయా..? మీ డివైజ్‌లను సేఫ్‌గా, కూల్‌గా ఉంచే టిప్స్ పాటించండి..


కౌన్సెలింగ్‌లో బిజీగా ఉండడంతో నమోదు చేసుకోకపోవడంతో సీట్లు దొరకని విద్యార్థులు లేదా మాప్-అప్ రద్దు సమయంలో సీట్లు కోల్పోయిన వారు పరీక్షకు సిద్ధం కావడానికి, అలాగే నమోదు చేసుకోవడానికి మరింత సమయం పడుతుందని AIMSA పేర్కొంది. ప్రస్తుత షెడ్యూల్‌లో సీట్లను పెంచడానికి లేదా కుదించడానికి ఇప్పుడు సమయం ఇచ్చినా ఎటువంటి ప్రయోజనం ఉండదని.. దీంతో పరీక్షను వాయిదా వేయడమే మేలని వైద్య విద్యార్థుల సంఘం లేఖలో పేర్కొంది.

మరోవైపు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) అడ్మిషన్ టెస్ట్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ iiseradmission.in / iisermohali.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే20, 2022 అని ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత ఐఐఎస్‌ఈఆర్.. అడ్మిషన్ టెస్ట్(IAT)ను జూలై3, 2022న నిర్వహిస్తుంది. ఇందులో వచ్చిన స్కోర్ ఆధారంగా అడ్మిషన్లను చేపట్టనుంది.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, NEET, NEET 2022, Students

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు