తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పలు విభాగాల్లో 2,942 పోస్టల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. పదోతరగతి విద్యార్హతతోనే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎటుంటి పరీక్ష లేకుండా కేవలం పదోతరగతి మార్కుల మెరిట్, సిస్టమ్ జనరేటెడట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో ఉంటుంది. కేవలం రూ.100 మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://indiapostgdsonline.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జూన్ 5, 2022 వరకు అవకాశం ఉంది.
Jobs in AP: హెచ్‌పీ కంపెనీలో 186 టెక్నీషియన్ ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం తెలుసుకోండి
పోస్టుల వివరాలు..
పోస్టు పేరు | వేతనం | విద్యార్హత |
బీపీఎం | రూ. 12,000 | పదోతరగతి మార్కుల మెరిట్ |
ఏబీపీఎం/డాక్ సేవక్ | రూ.10,000 | పదోతరగతి మార్కుల మెరిట్ |
ఖాళీల వివరాలు..
తెలంగాణ - 1,226, ఆంధ్రప్రదేశ్ - 1,716
ఎంపిక విధానం..
ఎటుంటి పరీక్ష లేకుండా కేవలం పదోతరగతి మార్కుల మెరిట్, సిస్టమ్ జనరేటెడట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం..
Step 1 - దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది.
Step 2 - ముందుగా అధికారికి వెబ్‌సైట్ https://indiapostgdsonline.gov.in/ లోకి వెళ్లాలి.
Step 3 - మీరు ఏ రాష్ట్రానికి దరఖాస్తు చేస్తున్నారో ఆ రాష్ట్రానికి సంబంధించిన పోస్టులు, అర్హతలు సరి చూసుకోవాలి.
Step 4 - అనంతరం Stage 1.Registration పూర్తి చేయాలి. ఇందులో మొబైల్ నంబర్, ఈమెయిల్ వంటి సమాచారం అందించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
Step 5 - అనంతరం Stage 2.Fee Payment పూర్తి చేయాలి. తరువాత Stage 3.Apply Online లింక్‌లోకి వెళ్లాలి.
Step 6 - అప్లికేషన్ ఫాంలో ఎటువంటి తప్పులు లేకుండా వివరాలు నమోదు చేసుకోవాలి.. అనంతరం సబ్‌మిట్ చేయాలి.
Step 7 - దరఖాస్తుకు జూన్ 5, 2022 వరకు అవకాశం ఉంది.
బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో టీచర్ జాబ్స్..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు (Defence Ministry) చెందిన ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లోని (Army Public School) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు స్కూల్ అధికారులు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. మొత్తం 41 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో పోస్టు ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి మే 25, 2022ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులు చేరేలా పంపించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, Govt Jobs 2022, Job notification, JOBS, Postal, Postal department