Home /News /jobs /

POSTAL ASSISTANT JOBS WILL BE HANDLED BY SSC CGL THE QUALIFICATION HAS BEEN INCREASED FROM INTERMEDIATE TO A DEGREE KNOW THE DETAILS HERE VB

Postal Assistant Jobs: పోస్టల్ అసిస్టెంట్(PA/SA) నియామకాలపై కీలక నిర్ణయం.. నోటిఫికేషన్ లో పలు మార్పులు..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Postal Assistant Jobs: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రతీ సంవత్సరం CGL పరీక్షను నిర్వహిస్తుంది. అభ్యర్థులను భారత ప్రభుత్వంలోని వివిధ సంస్థలు, విభాగాలు, కార్యాలయాల్లోకి రిక్రూట్ చేయడానికి ఈ నియామకాలు జరుగుతాయి. ఇది జాతీయ స్థాయి పరీక్ష .

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) ప్రతీ సంవత్సరం CGL పరీక్షను నిర్వహిస్తుంది. అభ్యర్థులను భారత ప్రభుత్వంలోని వివిధ సంస్థలు, విభాగాలు, కార్యాలయాల్లోకి రిక్రూట్(Recruit) చేయడానికి ఈ నియామకాలు జరుగుతాయి. ఇది జాతీయ స్థాయి పరీక్ష(National Exam) . ప్రభుత్వ శాఖలలో గ్రూప్ B మరియు గ్రూప్ C పోస్టులకు ఈ పరీక్ష ద్వారా రిక్రూట్‌మెంట్(Recruitment) జరుగుతుంది. అయితే పోస్టల్ డిపార్ట్ మెంట్లో(Postal Department) కీలక పోస్టులుగా పరిగణించే పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలను(Postal Assistant And Sorting Assistant) SSC సీహెచ్ఎస్ఎల్(CHSL) ద్వారా పరీక్ష నిర్వహించి నియామకాలు చేపడుతున్నారు.

BIS Recruitment 2022: బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్.. BISలో పలు పోస్టుల భర్తీ.. జీతం రూ. 50వేలు..


గత కొన్ని సంవత్సరాల నుంచి ఇలానే పరీక్షను నిర్వహించి నియమిస్తున్నారు. అయితే తాజాగా దీనిపై  పోస్టల్ డిపార్ట్ మెంట్  కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి CHSL ద్వారా కాకుండా.. సీజీఎల్ (Combined Graduate Level) ద్వారా ఈ పోస్టులను నియమించనున్నట్లు పేర్కొన్నారు. అంతే కాదు.. ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ అర్హతగా ఉన్న ఈ పోస్టల్ పోస్టులకు డిగ్రీ అర్హతగా మార్చారు. వచ్చే సంవత్సరం వెలువడే నోటిఫికేషన్ లో ఈ మార్పులు చేయనున్నారు.



ఎంపిక ప్రక్రియ..
ఎంపిక ప్రక్రియ SSC CGL ఎంపిక విధానం నాలుగు దశలను కలిగి ఉంటుంది. టైర్ I - కంప్యూటర్ ఆధారిత పరీక్ష. టైర్ II - కంప్యూటర్ ఆధారిత పరీక్ష. టైర్ III – పెన్ మరియు పేపర్ మోడ్ (డిస్క్రిప్టివ్ పేపర్) టైర్ IV – కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్. ఈ నాలుగు దశల్లో ఎక్కడా ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరగదు.

నేటి నుంచి SSC CGL 2022 టైర్ 2 పరీక్షలు..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC CGL 2022 టైర్ 2 పరీక్షను ఆగస్టు 8 నుండి ప్రారంభించనుంది. SSC CGL పరీక్ష 2022 టైర్ 2 దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాలలో వివిధ షిఫ్టులలో ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించబడుతుంది. SSC CGL పరీక్ష ఆగస్టు 8 మరియు 10, 2022 తేదీల్లో జరగనుంది. అభ్యర్థులు ఎస్‌ఎస్‌సి సిజిఎల్ అడ్మిట్ కార్డ్ 2022తో పాటు ఒక ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తీసుకురావాలన్నారు.

SSC CGL టైర్ 2 పరీక్ష 2022లో తీసుకెళ్లాల్సిన పత్రాలు
SSC CGL టైర్ 2 అడ్మిట్ కార్డ్ 2022 నుండి ప్రింట్ అవుట్. ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో రెండు కాపీలు. ఒక ఐడీ ప్రూప్. వాటిలో పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్ లేదా ఇ-ఆధార్ ప్రింట్ అవుట్, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా PSUలు ఉద్యోగులకు జారీ చేసిన గుర్తింపు కార్డు , విశ్వవిద్యాలయం/కళాశాల/పాఠశాల ద్వారా జారీ చేయబడిన గుర్తింపు కార్డు, ఓటరు ID కార్డ్, PAN కార్డ్, రాష్ట్ర ప్రభుత్వం / కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర ఫోటో ID ప్రూప్ లలో ఎదో ఒకటి చూపిస్తే సరిపోతుంది.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Cgl, Chsl, JOBS, Postal assistant, Staff Selection Commission

తదుపరి వార్తలు