హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs In Post Payment Bank: పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. జీతం రూ. లక్షల్లో..

Jobs In Post Payment Bank: పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. జీతం రూ. లక్షల్లో..

Jobs In Post Payment Bank: పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. జీతం రూ. లక్షల్లో..

Jobs In Post Payment Bank: పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. జీతం రూ. లక్షల్లో..

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (IPPB) దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో.. రెగ్యులర్ మరియు ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (IPPB) దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో.. రెగ్యులర్ మరియు ఒప్పంద ప్రాతిపదికన 13 ఏజీఎం, చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్ తదితర (AGM Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు(Application) చేసుకోవాలనే అభ్యర్థుల యొక్క అర్హతలు సంబంధిత సబ్జెక్ట్ లో స్పెషలైజేషన్‌ సీఏ(CA) చేసి ఉండాలి. అంతే కాకుండా.. డిగ్రీ, పీజీ(PG) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు పని అనుభవం కూడా ఉండాలి.

TSPSC New Notification: తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్.. పోస్టులు, అర్హత వివరాలిలా.. 

వయో పరిమితి: అభ్యర్థుల యొక్క వయస్సు సెప్టెంబర్ 1, 2022 నాటికి 23 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

1. మేనేజర్ పోస్టులకు- 23 నుండి 35 సంవత్సరాలు

2.సీనియర్ మేనేజర్ పోస్టులకు - 26 నుండి 35 సంవత్సరాలు

3.చీఫ్ మేనేజర్ పోస్టులకు - 29 నుండి 45 సంవత్సరాలు

4.సిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులకు - 32 నుండి 45 సంవత్సరాలు

5.డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు - 35 నుండి 55 సంవత్సరాలు

6.DGM - ప్రోగ్రామ్/వెండర్ మేనేజ్‌మెంట్ పోస్టులకు - 35 నుండి 55 సంవత్సరాలు

7.చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ పోస్టులకు - 38 నుండి 55 సంవత్సరాలు

8. అంతర్గత అంబుడ్స్‌మన్ పోస్టులకు - 65 ఏళ్లకు మించకూడదు

పోస్టులు వివరాలు ఇలా..

విభాగంపోస్టు పేరుపోస్టుల సంఖ్య
టెక్నాలజీఏజీఎం- ఎంటర్‌ప్రైజ్/ ఇంటిగ్రేషన్ ఆర్కిటెక్ట్ పోస్టులు01
చీఫ్ మేనేజర్- ఐటీ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ పోస్టులు01
ప్రొడక్ట్ఏజీఎం- బీఎస్‌జీ(బిజినెస్ సొల్యూషన్స్ గ్రూప్) పోస్టులు01
చీఫ్ మేనేజర్- రిటైల్ ప్రొడక్ట్స్‌ పోస్టులు01
చీఫ్ మేనేజర్- రిటైల్ పేమెంట్స్‌ పోస్టులు01
ఆపరేషన్ఏజీఎం(ఆపరేషన్స్) పోస్టులు01
సీనియర్ మేనేజర్(ఆపరేషన్స్) పోస్టులు01
రిస్క్ మేనేజ్              మెంట్చీఫ్ మేనేజర్- ఫ్రాడ్ మానిటరింగ్ పోస్టులు01
ఫైనాన్స్డీజీఎం- ఫైనాన్స్ అండ్‌ అకౌంట్స్ పోస్టులు01
మేనేజర్ (ప్రొక్యూర్‌మెంట్) పోస్టులు01
                                           కాంట్రాక్ట్ బేసిస్ మీద నియమించే పోస్టులు.
టెక్నాలజీ విభాగండీజీఎం- ప్రోగ్రామ్/ వెండార్ మేనేజ్‌మెంట్ పోస్టులు01
Compliance విభాగంచీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ పోస్టులు01
ఆపరేషన్ విభాగంఇంటర్నల్‌ అంబుడ్స్‌మన్ పోస్టులు01

ముఖ్యమైన తేదీలు..

ఆన్ లైన్ లో దరఖాస్తులు సెప్టెంబర్ 20, 2022 నుంచి ప్రారంభం అయ్యాయి.

దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 24, 2022గా పేర్కొన్నారు.

దరఖాస్తు ఫీజు..

జానరల్ అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అప్లికేషన్ ఫీజు రూ.150లుగా పేర్కొన్నారు.

ఎంపిక విధానం..

అభ్యర్థులకు మొదట ఆన్ లైన్ టెస్ట్ ఉంటుంది. దీనిలో అర్హత సాధించిన వారికి గ్రూప్ డిస్కషన్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. అర్హులైన వారికి నెలకు రూ.1,12,000ల నుంచి రూ.3,50,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, India post payments bank, JOBS

ఉత్తమ కథలు