హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Post Office Jobs: పోస్ట్‌మ్యాన్, పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

Post Office Jobs: పోస్ట్‌మ్యాన్, పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

ఈ బ్యాంక్ డబ్బును డిపాజిట్ చేసినందుకు కూడా రుసుము విధిస్తారు. జనవరి 1 నుండి ఈ నియమం వర్తిస్తుంది. సాధారణ సేవింగ్స్ ఖాతా నుండి ప్రతి నెలా నాలుగు సార్లు నగదు విత్‌డ్రా చేసుకుంటే ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఈ బ్యాంక్ డబ్బును డిపాజిట్ చేసినందుకు కూడా రుసుము విధిస్తారు. జనవరి 1 నుండి ఈ నియమం వర్తిస్తుంది. సాధారణ సేవింగ్స్ ఖాతా నుండి ప్రతి నెలా నాలుగు సార్లు నగదు విత్‌డ్రా చేసుకుంటే ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

Post Office Recruitment 2021 | పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది ఇండియా పోస్ట్. ఖాళీల వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

  పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు కోరుకునే నిరుద్యోగులకు శుభవార్త. పోస్ట్ ఆఫీసుల్లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. పశ్చిమ బెంగాల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఖాళీగా ఉన్న పోస్టల్ అసిస్టెంట్ (PA), సార్టింగ్ అసిస్టెంట్ (SA), పోస్ట్‌మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్ట్ ఆఫీసులు, సేవింగ్స్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్, సర్కిల్ ఆఫీస్, రీజనల్ ఆఫీస్, రైల్వే మెయిల్ సర్వీస్‌లో ఈ పోస్టులున్నాయి. మొత్తం 124 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 24 చివరి తేదీ.

  ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో అంటే పోస్టులో దరఖాస్తుల్ని పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. అభ్యర్థులకు విద్యార్హతలతో పాటు క్రీడార్హతలు కూడా ఉండాలి. స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు కాబట్టి ఆయా క్రీడల్లో రాణించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.

  Railway Recruitment 2021: రైల్వేస్‌లో 1785 పోస్టులు... పరీక్షలు లేకుండానే భర్తీ

  Post Office Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


  మొత్తం ఖాళీలు124విద్యార్హతలువయస్సువేతనం
  పోస్టల్ అసిస్టెంట్51గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డ్ నుంచి ఇంటర్మీడియట్ పాస్ కావాలి. 60 రోజుల బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి.18 నుంచి 27 ఏళ్లురూ.25,000 బేసిక్ వేతనంతో మొత్తం రూ.81,100
  సార్టింగ్ అసిస్టెంట్25గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డ్ నుంచి ఇంటర్మీడియట్ పాస్ కావాలి. 60 రోజుల బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి.18 నుంచి 27 ఏళ్లురూ.25,000 బేసిక్ వేతనంతో మొత్తం రూ.81,100
  పోస్ట్‌మ్యాన్48గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డ్ నుంచి ఇంటర్మీడియట్ పాస్ కావాలి. 60 రోజుల బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి.18 నుంచి 27 ఏళ్లురూ.21,700 బేసిక్ వేతనంతో మొత్తం రూ.69,100


  BOB Recruitment 2021: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  Post Office Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


  దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 24

  విద్యార్హతలు- ఇంటర్మీడియట్ పాస్ కావాలి. 60 రోజుల బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి.

  క్రీడార్హతలు- రాష్ట్రం తరఫున లేదా దేశం తరఫున జాతీయ, అంతర్జాతీయ క్రీడలు, గేమ్స్‌లో పాల్గొని ఉండాలి. ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్‌లో పాల్గొనాలి. నేషనల్ స్పోర్ట్స్‌లో స్టేట్ స్కూల్ టీమ్స్ నుంచి పార్టిసిపేట్ చేయాలి.

  దరఖాస్తు విధానం- అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ https://www.indiapost.gov.in/ లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేయాలి. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు 2021 డిసెంబర్ 24 లోగా చేరేలా పోస్టులో పంపాలి.

  ఈ జాబ్ నోటిఫికేషన్, అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:

  The Assistant Director (Recruitment),

  Office of the Chief Postmaster General,

  West Bengal Circle, P-36, CR Avenue,

  Yogayog, Bhawan,

  Kolakata - 700012.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, Central Government Jobs, Govt Jobs 2021, India post, Job notification, JOBS, Post office, Postal department

  ఉత్తమ కథలు