Postal Jobs: 581 పోస్ట‌ల్ ఉద్యోగాల ద‌ర‌ఖాస్తుకు నేడు ఆఖ‌రు తేదీ

ప్రతీకాత్మక చిత్రం

ఉత్తరాఖండ్ పోస్టల్ సర్కిల్ (Circle) కింద 581 గ్రామిన్ డాక్ సేవక్ (GDS) పోస్ట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్ట‌ల్‌ ద‌ర‌ఖాస్తుకు సెప్టెంబ‌ర్ 25 , 2021 ఆఖ‌రు తేదీ. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకొన్న అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాలి.

  • Share this:
    ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) పోస్టుల్ని భర్తీ చేసేందుకు రాష్ట్రాల వారీగా ప్రతీ ఏటా రెండుసార్లు జాబ్ నోటిఫికేషన్లు (Notification) విడుదల చేస్తూ ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన రెండు నెలల్లో ఫలితాలు విడుదల చేస్తూ ఉంటుంది. టెన్త్ అర్హత (Eligibility)తో భర్తీ చేసే పోస్టులు కాబట్టి లక్షల్లో అభ్యర్థులు దరఖాస్తు చేస్తుంటారు.  అందులో భాగంగా ఇండియా పోస్ట్ ఉత్తరాఖండ్ పోస్టల్ సర్కిల్ (Circle) కింద 581 గ్రామిన్ డాక్ సేవక్ (GDS) పోస్ట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్ట‌ల్‌ ద‌ర‌ఖాస్తుకు సెప్టెంబ‌ర్ 25 , 2021 ఆఖ‌రు తేదీ. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకొన్న అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://appost.in/gdsonline/Home.aspx ను సంద‌ర్శించాలి.

    ముఖ్య‌మైన స‌మాచారం































    పోస్టులు 581
    ద‌ర‌ఖాస్తుకు ఆఖ‌రు తేదీ సెప్టెంబ‌ర్ 25, 2021
    వ‌యోప‌రిమితి 18 నుంచి 40 ఏళ్లు
    జీతం బీపీఎం - రూ.14,000
    ప‌రీక్ష ఫీజు రూ.100
    అర్హ‌త‌లు ప‌దోత‌ర‌గ‌తిలో మంచి మార్కులు సాధించాలి. స్థానిక‌భాష‌పై ప‌ట్టు ఉండాలి. కంప్యూట‌ర్ ప‌రీజ్ఞానం (Computer Knowledge) ఉండాలి.
    అధికారిక వెబ్‌సైట్‌ https://appost.in/gdsonline/Home.aspx

    ఎంపిక‌ విధానం..
    - పూర్తిగా అభ్య‌ర్థి అకాడ‌మిక్ మెరిట్ (Academic merit) ఆధారంగా తీసుకొంటారు.
    - ఉన్న‌త విద్య చ‌దివిన వారికి ఎటువంటి ప్ర‌త్యేక మెరిట్ (Special merit) ఇవ్వ‌రు.
    - అప్లికేష‌న్‌లోని మార్కుల వివ‌రాల‌ను జీపీఏ లేదా ప‌ర్సెంటేజ్ (Percentage) రూపంలో ప‌రీక్షించి మెరిట్ ఎంపిక చేస్తారు.

    ద‌ర‌ఖాస్తు విధానం..
    Step 1:  అభ్య‌ర్థి ఆన్‌లైన్‌ (Online) లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

    Step 2: ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://appost.in/gdsonline/Home.aspx లోకి వెళ్లాలి.

    Step 3:  (Registration): అభ్యర్థులు పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు, పుట్టిన రోజు, మొబైల్ నంబర్, ఆధార్, చిరునామా, విద్యార్హతల వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

    Step 4:  (Fee Payment): ఈ దశలో రిజిస్ట్రేషన్ నంబర్ ను నమోదు చేసి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

    Step 5: (Apply Online): అనంతరం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ నంబర్ తో పాటు కావాల్సిన వివరాలను నమోదు చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

    Step 6: అనంత‌రం పూర్తి వివ‌రాల‌తో ఫాం నింపాలి.

    Step 7: అనంత‌రం ఫీజు చెల్లించాలి. ఓసీ, ఈడ‌బ్ల్యూఎస్‌, ఓబీసీల‌కు రూ.100 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు.
    Published by:Sharath Chandra
    First published: