• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • POLICE ARREST DOCTOR SON FOR CHEATING IN JEE MAINS EXAM NS

JEE Exam: పరీక్ష రాయకుండానే JEEలో ఫస్ట్ ర్యాంక్.. కుమారుడి కోసం ఓ డాక్టర్ చేసిన కుట్ర ఇదే..

JEE Exam: పరీక్ష రాయకుండానే JEEలో ఫస్ట్ ర్యాంక్.. కుమారుడి కోసం ఓ డాక్టర్ చేసిన కుట్ర ఇదే..

(ప్రతీకాత్మక చిత్రం)

JEE Exam: అస్సాంకు చెందిన ఓ డాక్టర్ కుమారుడు ఇటీవల విడుదలైన జేఈఈ ఫలితాల్లో 99. 8 శాతం మార్కులు సాధించి టాపర్ గా నిలిచాడు. అయితే అతడు పరీక్ష రాయకుండానే ఈ మార్కులు సాధించాడు. ఇది ఎలా సాధ్యమైందంటే..

  • Share this:
    కరోనా నేపథ్యంలో ఈ ఏడాది అనేక ప్రభుత్వాలు వివిధ తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదు. ఎగ్జామ్స్ లేకుండానే వారందరినీ పాస్ చేసింది. దీంతో ఆయా తరగతులు చదువుతున్న వారంతా పాస్ అయ్యారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రతిభ అంతగా లేని వారు సైతం పాస్ అయ్యారు. వారంతా పై తరగతులకు ప్రమోట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆ సమయంలో సోషల్ మీడియాలో అనేక జోకులు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా అస్సాంకు చెందిన ఓ డాక్టర్ కుమారుడు ఇటీవల విడుదలైన జేఈఈ ఫలితాల్లో 99. 8 శాతం మార్కులు సాధించి టాపర్ గా నిలిచాడు. అయితే అతడు పరీక్ష రాయకుండానే ఈ మార్కులు సాధించడం విశేషం. ప్రవేశ పరీక్ష రాయకుండానే ఇంత శాతం మార్కులు ఎలా సాధించాడని ఆశ్చర్యపోతున్నారా? ఇక్కడే ఆ డాక్టర్ మాయ చేశాడు.

    తన కుమారుడికి మంచి మార్కులు రావాలన్న దుర్భుద్ధితో వేరే వ్యక్తులతో పరీక్ష రాయించాడు. ఇందు కోసం అతడు రూ. 20 లక్షలు ఖర్చు పెట్టాడు ఈ కుట్రలో డాక్టర్, అతడితో పాటు మరో ముగ్గురు పాల్గొన్నారు. పరీక్షకు వెళ్లిన డాక్టర్ కుమారుడు రాయకుండా బయటకు వచ్చాడు. అతని బదులుగా మరో వ్యక్తి పరీక్ష రాశాడు. డాక్టర్ కొడుకు టెలిఫోనిక్ సంభాషణ ద్వారా తన స్నేహితుడితో తాను చేసిన ఈ దొంగ పని గురించి గొప్పగా చెప్పుకున్నాడు.

    అయితే ఈ సంభాషణ వైరల్ కావడంతో ఈ నేరం బయటపడింది. దీంతో విద్యార్థి నీల్ నక్షత్ర దాస్, అతని తండ్రి డాక్టర్ జ్యోతిర్మయి దాస్, వారికి సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై చీటింగ్, క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ విద్యార్థి యొక్క తండ్రి గౌహతిలో ప్రముఖ గైనకాలజిస్టు. ఆ విద్యార్థి తల్లి సైతం డాక్టర్ కావడం గమనార్హం. ఉన్నత చదువులు చదివి సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వారు సైతం ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడడం అందరినీ ఆశ్చర్యాన్ని గురి చేస్తోంది.
    Published by:Nikhil Kumar S
    First published: