Bank Jobs: పంజాబ్ నేషనల్ బ్యాంకులో 4 వేల ఉద్యోగాలు

Bank Jobs: నిరుద్యోగులకు పంజాబ్ నేషనల్ బ్యాంకు శుభవార్త చెప్పింది. త్వరలో 4 వేల ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రకటించింది.

news18-telugu
Updated: October 7, 2020, 11:52 AM IST
Bank Jobs: పంజాబ్ నేషనల్ బ్యాంకులో 4 వేల ఉద్యోగాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బ్యాంకు ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారా? బ్యాంకులో మంచి ఉద్యోగం కోరుకుంటున్నారా? ఇప్పటికే బ్యాంకింగ్ రంగంలో పనిచేసిన అనుభవం ఉందా? అయితే మీకు శుభవార్త. పంజాబ్ నేషనల్ బ్యాంక్ త్వరలో భారీగా ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తమ సేవలను విస్తరించాలని ఆ బ్యాంకు భావిస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు 500 కొత్త బ్రాంచులను ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో 4000 ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్లు సీఈఓ మల్లికార్జున రావు తెలిపారు.

SBI Jobs 2020: ఎస్‌బీఐలో ఉద్యోగాలకు రెండు రోజుల్లో అప్లై చేయండి... ఖాళీల వివరాలివే



యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ రెండూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో విలీనమైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వ్యాపార, ఉద్యోగుల విలీనం పూర్తైందని సీఈఓ చెప్పారు. తమ బ్యాంకు ప్రస్తుతం 11 వేల బ్రాంచులను కలిగి ఉందన్నారు. ఉత్తర, తూర్పు భారత దేశంలో నూతనంగా 500 బ్రాంచులను ప్రారంభించనున్నట్లు వివరించారు. బ్యాంకుల విలీనంతో 500 మీటర్ల దూరంలో ఉన్న రెండు బ్రాంచులను కలిపి ఒకే బ్రాంచ్ గా మారుస్తున్నామన్నారు.

Bank Jobs, PNB, Punjab natinol Bank, Bank Recruitment, బ్యాంకు ఉద్యోగాలు, పంజాబ్ నేషినల్ బ్యాంక్, భారీగా బ్యాంకు ఉద్యోగాలు, బ్యాంక్ జాబ్స్
ప్రతీకాత్మక చిత్రం


తద్వారా ఉత్తర, తూర్పు భారతదేశంలో మరో బ్రాంచ్ ప్రారంభానికి లైసెన్స్ ఇస్తున్నామన్నారు. దీంతో తాము 500 నూతన బ్రాంచులను ప్రారంభించే అవకాశం ఏర్పడిందన్నారు. నవంబర్ 15 నాటికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ దాదాపు 4 వేల ఉద్యోగులను తమ పేరోల్ కింద చేర్చుకుంటుందన్నారు. కరోనా కారణంగా బ్యాంకుల పనితీరుపై ప్రభావం పడినా.. మరి కొద్ది రోజుల్లో ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకునే అవకాశం ఉందని మల్లికార్జునరావు ఆశాభావం వ్యక్తం చేశారు.
Published by: Nikhil Kumar S
First published: October 7, 2020, 11:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading