Bank Jobs 2020: పంజాబ్ నేషనల్ బ్యాంకులో 535 ఉద్యోగాలు

PNB Recruitment 2020 | బ్యాంకు ఉద్యోగాలు కోరుకునేవారి కోసం మరో నోటిఫికేషన్ విడుదలైంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 535 పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

news18-telugu
Updated: September 9, 2020, 12:42 PM IST
Bank Jobs 2020: పంజాబ్ నేషనల్ బ్యాంకులో 535 ఉద్యోగాలు
Bank Jobs 2020: పంజాబ్ నేషనల్ బ్యాంకులో 535 ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బ్యాంకు ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారా? బ్యాంకులో మంచి ఉద్యోగం కోరుకుంటున్నారా? ఇప్పటికే బ్యాంకింగ్ రంగంలో పనిచేసిన అనుభవం ఉందా? అయితే మీకు శుభవార్త. పంజాబ్ నేషనల్ బ్యాంక్-PNB భారీగా ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. 535 పోస్టుల్ని ప్రకటించింది. బ్యాంకు అవసరాన్ని బట్టి నియామక ప్రక్రియ పూర్తయ్యే నాటికి పోస్టుల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. వేర్వేరు విభాగాల్లో మేనేజర్, సీనియర్ మేనేజర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 29 చివరి తేదీ. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను https://www.pnbindia.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

IBPS Clerk 2020: ప్రభుత్వ బ్యాంకుల్లో 1557 క్లర్క్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

SBI Jobs: ఎస్‌బీఐలో 14,000 ఉద్యోగాలు... నాలుగు నెలల్లో భర్తీ

PNB SO Recruitment 2020, Punjab National Bank jobs, Punjab National Bank Manager job notification, PNB Manager job notification, Bank jobs 2020, Bank job notification 2020, బ్యాంకు ఉద్యోగాలు 2020, బ్యాంక్ జాబ్స్ 2020, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్యోగాలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ జాబ్స్
ప్రతీకాత్మక చిత్రం

PNB Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 535
మేనేజర్ (రిస్క్)- 160మేనేజర్ (క్రెడిట్)- 200
మేనేజర్ (ట్రెజరీ)- 30
మేనేజర్ (లా)- 25
మేనేజర్ (ఆర్కిటెక్ట్)- 2
మేనేజర్ (సివిల్)- 8
మేనేజర్ (ఎకనమిక్)- 10
మేనేజర్ (హెచ్ఆర్)- 10
సీనియర్ మేనేజర్ (రిస్క్)- 40
సీనియర్ మేనేజర్ (క్రెడిట్)- 50

Railway Jobs: రైల్వే సంస్థలో 1000 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Anganwadi Jobs: రంగారెడ్డి జిల్లాలో 232 అంగన్వాడీ పోస్టులు... ఖాళీల వివరాలు ఇవే

PNB SO Recruitment 2020, Punjab National Bank jobs, Punjab National Bank Manager job notification, PNB Manager job notification, Bank jobs 2020, Bank job notification 2020, బ్యాంకు ఉద్యోగాలు 2020, బ్యాంక్ జాబ్స్ 2020, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్యోగాలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ జాబ్స్
పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఖాళీల వివరాలు (source: Punjab National Bank)

PNB Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 సెప్టెంబర్ 8
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 29
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
ఆన్‌లైన్ ఎగ్జామ్- అక్టోబర్ లేదా నవంబర్
వయస్సు- మేనేజర్ పోస్టుకు 25 నుంచి 35 ఏళ్లు, సీనియర్ మేనేజర్ పోస్టుకు 25 నుంచి 37 ఏళ్లు
ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ
దరఖాస్తు ఫీజు- రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175.
Published by: Santhosh Kumar S
First published: September 9, 2020, 12:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading