హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

PM Shri Schools: దేశవ్యాప్తంగా పీఎం శ్రీ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ పాఠశాలల ప్రత్యేకత ఇదే..

PM Shri Schools: దేశవ్యాప్తంగా పీఎం శ్రీ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ పాఠశాలల ప్రత్యేకత ఇదే..

విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

కేంద్రం కొత్తగా అధునాతన పాఠశాలలను తీసుకొస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) వెల్లడించారు. బావి భారత పౌరులను భవిష్యత్తు పోటీ ప్రపంచానికి సన్నద్ధం చేసే లక్ష్యంతో పీఎం శ్రీ స్కూల్స్ (PM Shri Schools) అనే కొత్త మోడల్ స్కూల్స్‌ ఏర్పాటు చేసే ప్రణాళికపై ?

ఇంకా చదవండి ...

భారత ప్రధాన నరేంద్ర మోదీ (Narendra Modi) హయాంలో ఎన్నడూ లేని విధంగా భారతీయ విద్యా రంగానికి ప్రాధాన్యత సంతరించుకుంటోంది. అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలకు దీటుగా మన విద్యారంగాన్ని తీర్చిదిద్దేందుకు మోదీ ప్రభుత్వం వినూత్న మార్పులను తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం కొత్తగా అధునాతన పాఠశాలలను తీసుకొస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) వెల్లడించారు. బావి భారత పౌరులను భవిష్యత్తు పోటీ ప్రపంచానికి సన్నద్ధం చేసే లక్ష్యంతో పీఎం శ్రీ స్కూల్స్ (PM Shri Schools) అనే కొత్త మోడల్ స్కూల్స్‌ ఏర్పాటు చేసే ప్రణాళికపై కేంద్రం పనిచేస్తోందని ఆయన తాజాగా పేర్కొన్నారు. ఇటీవల గుజరాత్‌లో జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020పై జరిగిన సదస్సులో పీఎం శ్రీ స్కూళ్ల ఏర్పాటు ప్లాన్ గురించి మంత్రి తెలిపారు.

"భారతదేశం విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ (Knowledge Based Economy)గా మారడానికి పాఠశాల విద్య అనేది బలమైన పునాది" అని ధర్మేంద్ర అన్నారు. "ప్రస్తుతం మేం పీఎం శ్రీ స్కూల్స్‌ను నెలకొల్పుతున్నాం. ఈ స్కూల్స్ విద్యార్థులను భవిష్యత్తు ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా సన్నద్ధం చేస్తాయి. ఈ అడ్వాన్స్‌డ్‌ స్కూల్స్ ఎన్‌ఈపీ 2020 ప్రయోగశాలుగా ఉంటాయి" అని ఆయన చెప్పుకొచ్చారు.

TSPSC Group-1 Applications: అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. గ్రూప్‌-1 ద‌ర‌ఖాస్తుకు ఒక్క రోజే చాన్స్‌.. ఈ విష‌యాలు గుర్తుంచుకోండి

* విద్య కోసం ఫ్యూచరిస్టిక్ బెంచ్‌మార్క్

పీఎం శ్రీ స్కూల్స్ రూపంలో ఫ్యూచరిస్టిక్ బెంచ్‌మార్క్ మోడల్‌ను రూపొందించడానికి మొత్తం విద్యా పర్యావరణ వ్యవస్థ, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తెలియజేయాలని ఆయన కోరారు. "21వ శతాబ్దపు విజ్ఞానం, నైపుణ్యాల నుంచి మన కొత్త తరాన్ని మనం దూరం చేయలేం. మనది వసుధైవ కుటుంబాన్ని విశ్వసించే నాగరికత. మన దేశానికి మాత్రమే కాకుండా ప్రపంచానికి కూడా జ్ఞానం పంచుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని గ్రహించాలి." అని మంత్రి తెలిపారు. ప్రపంచ సంక్షేమానికి కట్టుబడి ఉండే నాలెడ్జ్ ఎకానమీగా భారత్‌ను నెలకొల్పేందుకు రానున్న 25 ఏళ్లు కీలకమని అభిప్రాయపడ్డారు. నేషనల్ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి.. అలాగే డిజిటల్ విద్య పరిధిని విస్తరిండానికి.. విద్యను విశ్వవ్యాప్తం చేయడానికి క్వాలిటీ ఈ-కంటెంట్‌ను పెంచడానికి అన్ని విద్యా సంస్థలు చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

ప్రీ-స్కూల్ నుంచి సెకండరీ స్కూల్ వరకు కవర్ చేసే 5+3+3+4 పాలసీ అనేది ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (ECCE), టీచర్ ట్రైనింగ్ & వయోజన విద్య, పాఠశాల విద్యతో నైపుణ్యాభివృద్ధిని ఏకీకృతం చేయడం వంటి వాటికి ప్రాధాన్యతనిస్తుందని మంత్రి చెప్పారు. మాతృభాషలో అన్నీ నేర్చుకునే వెసులుబాటు కల్పించడమనేది 21వ సెంచరీ గ్లోబల్ సిటిజన్లు తయారు చేయడంలో కీలక స్టెప్ అని అన్నారు. ఎన్‌ఈపీపై జరిగిన ఈ సదస్సుకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, పలు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, విద్యాశాఖకు చెందిన సీనియర్ అధికారులు, ఛైర్‌పర్సన్లు హాజరయ్యారు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, EDUCATION, Minister, Students

ఉత్తమ కథలు