Home /News /jobs /

PM NARENDRA MODI10 LAKH JOBS TARGET MEANS 1850 JOBS DAILY RECRUITMENT AGENCIES NEED TO RAMP UP CAPACITY GH SK

Jobs Target: రోజుకు 1850 ఉద్యోగాలు.. ఏడాదిన్నరలో ప్రధాని మోదీ 10 లక్షల టార్గెట్ పూర్తయ్యేనా?

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Central Govt Jobs: కేంద్ర ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు 10 లక్షల మందిని ఆన్‌బోర్డ్ లోకి తీసుకురావడానికి రాబోయే 18 నెలల్లో తమ సామర్థ్యాన్ని అనేక రెట్లు పెంచుకోవాలి. ఎందుకంటే మోదీ చెప్పిన టార్గెట్ ప్రకారం రోజూ దాదాపు 1,850 మందిని ఏజెన్సీలు నియమించుకోవాల్సి ఉంటుంది. మరి ఈ టార్గెట్ అనుకున్న సమయంలో పూర్తయ్యేనా?

ఇంకా చదవండి ...
Jobs Target: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఒక గుడ్ న్యూస్ చెప్పారు. రానున్న ఒకటిన్నర సంవత్సరాల్లో 10 లక్షల మందిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. అంటే కేంద్ర ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (Recruitment Agencies)లు 10 లక్షల మందిని ఆన్‌బోర్డ్ లోకి తీసుకురావడానికి రాబోయే 18 నెలల్లో తమ సామర్థ్యాన్ని అనేక రెట్లు పెంచుకోవాలి. ఎందుకంటే మోదీ చెప్పిన టార్గెట్ ప్రకారం రోజూ దాదాపు 1,850 మందిని ఏజెన్సీలు నియమించుకోవాల్సి ఉంటుంది. ఈ పనిని మిషన్ మోడ్‌లో పూర్తి చేయాలని ప్రధాని ఆదేశించారు. ప్రతి సంవత్సరం 46,000 మంది యువతను సాయుధ దళాలలోకి తీసుకురావడానికి మంగళవారం అగ్నిపథ్ స్కీమ్‌ను కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత ఉద్యోగాల భర్తీ గురించి మోదీ మాట్లాడారు. ఈ రెండు నిర్ణయాలు యువతతో పాటు దేశానికి ప్రయోజనం చేకూర్చేవని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

BJP MP Grateful To Owaisi : మోదీ సర్కార్ కి ఝలక్..ఓవైసీకి బీజేపీ ఎంపీ కృతజ్ణతలు


యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), రైల్వేస్ వంటి వివిధ ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు ప్రధానమంత్రి నిర్దేశించిన ‘10 లక్షల ఉద్యోగాలు’ లక్ష్యం కోసం మరింత సమర్థంగా పని చేయాలి. 2014 నుంచి 2020 మధ్య ఆరేళ్ల కాలంలో ఈ ఏజెన్సీలన్నీ కలిసి దాదాపు 5.6 లక్షల మందిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించుకున్నాయని ప్రభుత్వం గతంలో పార్లమెంటుకు ఇచ్చిన సమాధానంలో తెలిపింది. అంటే కొత్త టార్గెట్ కోసం సంస్థలు కసరత్తును ఏ స్థాయికి పెంచాలో అర్థం చేసుకోవచ్చు. 2020 నాటికి కేంద్ర ప్రభుత్వంలో మొత్తం ఖాళీలు 8.7 లక్షలకు చేరుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి.



News18 రివ్యూ చేసిన డేటా ప్రకారం, 2014 నుంచి 2020 మధ్య UPSC ద్వారా స్ట్రక్చర్డ్ ఎగ్జామినేషన్, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో 29,000 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. అదే ఆరేళ్లలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా 2.28 లక్షల మందిని నియమించారు. రైల్వేస్ కూడా వివిధ స్థాయిల్లో సుమారు 3 లక్షల మందిని ఎంపానెల్ చేసింది. అదనంగా ఆరేళ్లలో 6,300 గెజిటెడ్ ఖాళీలను భర్తీ చేసింది.

Bank Jobs: నిరుద్యోగుల‌కు అల‌ర్ట్‌.. ప్ర‌ముఖ బ్యాంక్‌లో డిగ్రీ అర్హ‌త‌తో 312 జాబ్స్‌..


ఈ ఏడాది ఏప్రిల్ 6న పార్లమెంటుకు ఇచ్చిన సమాధానంలో ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ గురించి వెల్లడించింది. 2017 నుంచి 2022 మధ్య ఐదేళ్లలో యుపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ కలిసి సుమారు రెండు లక్షల మందిని నియమించుకున్నాయని ప్రభుత్వం తెలిపింది. “గత ఐదేళ్లలో SSC, UPSC వరుసగా 1,85,734, 27,764 ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు ఇచ్చాయి. వివిధ మంత్రిత్వ శాఖల్లోని ఖాళీల సంఖ్యకు అనుగుణంగా ఎస్‌ఎస్‌సీ 1,74,744 మందిని, యూపీఎస్సీ 24,836 మంది అభ్యర్థులను రిక్రూట్ చేసుకున్నాయి” అని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రశ్నకు సమాధానం చెప్పింది.

గ్రూప్-1 ప‌రీక్ష తేదీ ఖరారు.. ఒక్కో పోస్టుకు ఎంత మంది పోటీ.. ఎంపిక విధానంలో కీల‌క విష‌యాలు


2018 నుంచి 2021 మధ్య రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ 1.39 లక్షల మందిని నియమించుకుందని రైల్వే శాఖ గత డిసెంబర్‌లో పార్లమెంట్‌కు తెలిపింది. “ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీలు ఏర్పడటం, వాటిని కొత్తగా భర్తీ చేయడం నిరంతర ప్రక్రియ. ఖాళీల విషయంలో సకాలంలో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అన్ని మంత్రిత్వ శాఖలకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తుంది” అని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఏప్రిల్‌లో పార్లమెంటుకు ఇచ్చిన ఈ సమాధానంలో తెలిపారు. SSB భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలలో ఖాళీలను భర్తీ చేస్తుంది. దీంతోపాటు సబార్డినేట్ కార్యాలయాలలో వివిధ గ్రూప్ C, గ్రూప్ B పోస్టులకు రిక్రూట్‌మెంట్‌ను నిర్వహిస్తుంది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Central Government Jobs, Job notification, JOBS, PM Narendra Modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు