• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • PM NARENDRA MODI WILL DISCUSS ABOUT CBSE BOARD EXAMS 2021 WITH THE EDUCATION MINISTER TOP OFFICIALS TODAY NS

CBSE Exams 2021: సీబీఎస్ఈ పరీక్షల రగడపై రంగంలోకి ప్రధాని మోదీ.. ఈ రోజే కీలక ప్రకటన?

CBSE Exams 2021: సీబీఎస్ఈ పరీక్షల రగడపై రంగంలోకి ప్రధాని మోదీ.. ఈ రోజే కీలక ప్రకటన?

ప్రధాని నరేంద్ర మోదీ(ఫైల్ ఫొటో)

సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను రద్దు చేయాలన్న డిమాండ్ విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అధికమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రధాని మోదీ ఈ విషయమై బోర్డు ఉన్నతాధికారులు, విద్యాశాఖ మంత్రితో సమావేశం కానున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. అయితే గతేడాది సైతం ఇదే సమయంలో కరోనా విజృంభించింది. దీంతో ఆ సమయంలో ఆయా ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యగా వివిధ బోర్డుల పరీక్షలను రద్దు చేశాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సైతం పరీక్షలను రద్దు చేయాలన్న డిమాండ్ ఆయా వర్గాల నుంచి జోరుగా వినిపిస్తోంది. ముఖ్యంగా సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను రద్దు చేయాలన్న డిమాండ్ అధికంగా వినిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జాగ్రత్తలను తీసుకుంటూ పరీక్షలను నిర్వహిస్తామన్న బోర్డు అధికారుల స్టేట్మెంట్ పై విద్యార్థులు, తల్లిదండ్రులు బగ్గుమంటున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసకుని పరీక్షలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. #CancelBoardExams2021 హ్యాష్ ట్యాగ్ తో వారి అభిప్రాయాలను ట్విట్టర్ లో షేర్ చేస్తున్నారు. సీబీఎస్ బోర్డు అధికారులు, ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంఖ్ ఖాతాలకు విద్యార్థులు తమ అభిప్రాయాలను ట్యాగ్ చేస్తున్నారు.

    ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ అంశంపై స్పందించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం కేంద్ర విద్యాశాఖ మంత్రి, సీబీఎస్ఈ బోర్డుకు చెందిన ఉన్నతాధికారులతో ప్రధాని సమావేశం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీబీఎస్ఈ టెన్త్, 12 వ తరగతి పరీక్షలను రద్దు చేయాలన్న డిమాండ్ పై అధికారులతో మోదీ చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల రద్దుపై నేడు ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

    స్పందించని అధికారులు
    అయితే.. పరీక్షల రద్దు పై సోషల్ మీడియాలో విద్యార్థుల నుంచి డిమాండ్ వినిపిస్తున్నా.. అధికారులు మాత్రం స్పందించడం లేదు. సీబీఎస్ విడుదల చేసిన డేట్ షీట్ ప్రకారం ఈ ఏడాది పరీక్షలు మే 4 నుంచి నిర్వహించనున్నారు. అయితే పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించాలన్న పట్టుదలతో అధికారులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి సైతం పరీక్షల రద్దు అంశాన్ని తోసిపుచ్చినట్లు కొన్ని మీడియాల్లో వార్తలు వస్తున్నాయి.

    పుకార్లు నమ్మొద్దు..
    సీబీఎస్ఈ పరీక్షలు రద్దు అవుతాయంటూ వస్తున్న పుకార్లను నమ్మొద్దంటూ సీబీఎస్ఈ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ డాక్టర్ భరద్వాజ్ విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు పరీక్షల ప్రిపరేషన్ పై శ్రద్ధ చూపాలన్నారు. ఇదిలా ఉంటే పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు సైతం జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే పరీక్ష కేంద్రాల సంఖ్యను 40 నుంచి 50 శాతం వరకు పెంచారు. పరీక్షా కేంద్రాల్లో సామాజిక దూరం పాటించేలా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published: