యూపీఎస్సీ (UPSC) సివిల్స్ ఫలితాలు వెలువడ్డాయి. యూపీఎస్సీ 2020 పరీక్ష ఫలితాలను కమిషన్ సెప్టెంబర్ 24న విడుదల చేసింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించని అభ్యర్థుల్లో ప్రధాని మోదీ స్ఫూర్తి నింపారు. ఈ విషయంపై ఆయన ట్విట్టర్ (Twitter) ద్వారా పేర్కొన్నారు. “UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించని యువ స్నేహితులకు, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను.. మీరు చాలా ప్రతిభావంతులు.. మరిన్ని అవకాశాలుమీ కోసం ఎదురుచూస్తున్నాయి. అంటూ ట్వీట్ చేశారు. ఇతర రంగాల్లో లేదా ఇదే రంగంలో మరింత బాగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. అంతే కాకుండా యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఆయన శుభాకాంక్షలు తెలుపుతు ట్వీట్ చేశారు.
To those young friends who did not clear the UPSC examination, I would like to say- you are very talented individuals. There are more attempts awaiting.
At the same time, India is full of diverse opportunities waiting to be explored. Best wishes in whatever you decide to do.
యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ (Civil service) పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని అభినందిస్తున్నాను.. ప్రజా సేవలో ఉత్తేజకరమైన, సంతృప్తికరమైన కెరీర్ (Career) మీ కోసం ఎదురు చూస్తోదని పీఎం మోదీ ట్వీట్ చేశారు. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు కీలక అడ్మినిస్ట్రేటివ్ పాత్రలను పొందుతారని ఆయన పేర్కొన్నారు.
Congratulations to those who successfully cleared the UPSC Civil Services examination. An exciting and satisfying career in public service awaits.
Those who have cleared the exam will go on to have key administrative roles during an important period of our nation’s journey.
ఈ ఏడాది సెప్టెంబర్ 24 సాయంత్రం, UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2020 ఫలితాన్ని ప్రకటించింది, మొత్తం 761 మంది అభ్యర్థులు ఉత్తమ ప్రతిభను కనబర్చి సెలెక్ట్ అయ్యారు. పరీక్షకు అర్హత సాధించిన మొత్తం అభ్యర్థులలో 545 మంది పురుషులు మరియు 216 మంది మహిళలు ఉన్నారు. బీహార్‌కు చెందిన శుభమ్ కుమార్ మొదటి స్థానాన్ని దక్కించుకోగా, మధ్యప్రదేశ్‌కు చెందిన జాగృతి అవస్థీ రెండో ర్యాంకును సాధించింది. శుభమ్ IIT బొంబాయి నుంచి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (సివిల్ ఇంజనీరింగ్) లో గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్నారు. అతను తన ఐచ్ఛిక సబ్జెక్ట్‌గా ఆంత్రోపాలజీని ఎంచుకొన్నారు. రెండో ర్యాంక్ సాధించిన జాగృతి భోపాల్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మానిట్) నుండి బి.టెక్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) డిగ్రీని చేశారు. ఆమె ఆప్షనల్ సబ్జెక్టుగా సోషియాలజీని ఎంచుకొన్నారు.
ఈ పరీక్షలో పాసైన అభ్యర్థులను ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ మరియు సెంట్రల్ సర్వీసెస్ పోస్టులకు అభ్యర్థుల సిఫార్సు చేస్తారు. అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్య మరియు పరీక్ష కోసం నియమాలలో ఉన్న నిబంధనలను పరిగణనలోకి తీసుకొని నియామకం చేస్తారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.