• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • PM NARENDRA MODI PARIKSHA PE CHARCHA YOUR KIDS HAVE MENTAL TENSION ABOUT EXAMS HERE IS MODI KEY SUGGESTIONS SK

Pariksha pe charcha: పరీక్షల గురించి మీ పిల్లలు టెన్షన్ పడుతున్నారా? ప్రధాని మోదీ సూచనలు ఇవే

Pariksha pe charcha: పరీక్షల గురించి మీ పిల్లలు టెన్షన్ పడుతున్నారా? ప్రధాని మోదీ సూచనలు ఇవే

ప్రధాని నరేంద్ర మోదీ

కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలని ప్రధాని మోదీ సూచించారు. సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం మొదట చాలా కష్టమనిపిస్తాయని.. కానీ ఆ తర్వాత ఎంతో సులభంగా మారుతాయని ఆయన చెప్పారు. మీకు ఏవి కష్టమనిస్తాయో.. ఏవి సులభమనిపిస్తాయో.. జాబితా సిద్ధం చేసుకోవాలని సూచించారు

  • Share this:
    మరికొన్ని రోజుల్లో విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పలు తరగతుల విద్యార్థులను ప్రమోట్ చేశాయి. కానీ పదో తరగతితో పాటు ఇంటర్, డిగ్రీ, పీజీ పరీక్షలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లింది చాలా తక్కువ. ఆన్‌లైన్‌లోనే ఎక్కువగా క్లాసులు విన్నారు. ఈ క్రమంలో పరీక్షల వేళ టెన్షన్ ఎక్కువవుతోంది. ఈసారి పరీక్షలు ఎలా రాయాలో అని ఆందోళన పడుతున్నారు. అలాంటి విద్యార్థులకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గిస్తే.. వారిలో పరీక్షలపై ఉన్న భయం చాలా వరకు తగ్గిపోతుందని పేర్కొన్నారు. కష్టమైన సబ్జెక్టులకు దూరంగా ఉండకూడదని.. కష్టాలను ఎదుర్కొంటేనే భవిష్యత్‌లో విజయం సాధించగలమని ఆయన చెప్పారు.

    ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పరీక్షా పే చర్చలో భాగంగా పలువురు విద్యార్థులతో ముచ్చటించారు. పరీక్షలు దగ్గర పడుతున్న వేళ.. వారిలో ఆందోళనను తగ్గించి ధైర్యం నింపడ కోసం ఈ కార్యక్రం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులత మోదీ మాట్లాడారు. మొదట ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన 9వ తరగతి విద్యార్థిని పల్లవి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. విద్యార్థులపై తల్లిదండ్రులతో పాటు అధ్యాపకులు, మిత్రులు ఒత్తిడి చేయడం మానేయాలని... అప్పుడే వారు పరీక్షలకు స్వచ్ఛగా సన్నద్ధం కాగలరని, పరీక్షలు చాలా సులభతరమవుతాయని చెప్పారు. పరీక్షల గురించి విద్యార్థులు ఆందోళనకు గురికావొద్దని సూచించారు ప్రధాని మోదీ. పిల్లల మెదళ్లలో అనవసరపు భయాందోళనలు రేకెత్తించవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

    కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలని ప్రధాని మోదీ సూచించారు. సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం మొదట చాలా కష్టమనిపిస్తాయని.. కానీ ఆ తర్వాత ఎంతో సులభంగా మారుతాయని ఆయన చెప్పారు. మీకు ఏవి కష్టమనిస్తాయో.. ఏవి సులభమనిపిస్తాయో.. జాబితా సిద్ధం చేసుకోవాలని సూచించారు. జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను నోట్ చేసి పెట్టుకోవాలని తెలిపారు. ఈ ప్రాక్టీస్ రేయడం వల్ల.. మీకు భవిష్యత్‌లో ఏవీ కూడా కష్టంగా అనిపించవని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రముఖ గాయనికి భౌగోళిక శాస్త్రం పెద్దగా తెలియకపోవచ్చని..కానీ ఒక గాయనిగా ఆమె అసమానురాలని చెప్పారు. అందరూ అన్ని సబ్జెక్టుల్లోనూ రాణించలేరని.. కొన్ని కష్టమనిపించవచ్చని ప్రధాని చెప్పారు. అలాని జీవితంలో మనం ఓడిపోయినట్లు కాదని స్పష్టం చేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published: