• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • PM NARENDRA MODI LAUNCHES CUSTOMIZED CRASH COURSE PROGRAMME FOR COVID 19 FRONTLINE WORKERS NS

PM Modi: కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రత్యేక క్రాష్ కోర్సును ప్రారంభించిన మోదీ.. ఏ అంశాలపై శిక్షణ ఇస్తారంటే..

ప్రధాని మోదీ(ఫైల్ ఫొటో)

కరోనా వారియర్స్ కోసం రూపొందించిన ప్రత్యేక క్రాష్ కార్సును ప్రధాని మోదీ ప్రారంభించారు.

  • Share this:
    కరోనా మహమ్మారిపై పోరాటం సాగిస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్లలో సామర్థ్యం పెంచేలా రూపొందించిన క్రాష్ కోర్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 26 రాష్ట్రాల్లో చేపట్టిన స్కిల్ డవలప్మెంట్ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం ప్రారంభించారు. ఈ ప్రోగ్రాం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు లక్ష మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. కరోనా రోగులకు సేవలు, శాంపిల్స్ సేకరణ, వైద్య పరికరాల వినియోగం తదితర అంశాలపై ఈ కోర్సు ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం ప్రధాని కౌశల్ వికాస్ యోజన కింద రూ. 276 కోట్లను కేటాయించినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. హోమ్ కేర్ సపోర్ట్, బేసిక్ కేర్ సపోర్ట్, అడ్వాన్స్డ్ కేర్ సపోర్ట్, ఎమర్జెన్సీ కేర్ సపోర్ట్, శాంపుల్ కలక్షన్ సపోర్ట్, మెడికల్ ఎక్విప్మెంట్ సపోర్ట్ తదితర విభాగాల్లో పని చేస్తున్న వారికి ఈ శిక్షణ అందిస్తున్నారు. ఈ శిక్షణ ఆరోగ్య రంగంలో పని చేస్తున్న వారికి భవిష్యత్ అవసరాలను తీర్చగల నైపుణ్యం అందిస్తుందని ప్రధాని చెప్పారు.
    India Corona: ఇండియాలో 74 రోజుల దిగువకు కరోనా యాక్టివ్ కేసులు.. వరుసగా 37వ రోజూ రికవరీలే ఎక్కువ
    Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గుతుందా..?

    రోజుకో కొత్త రూపంలో ప్రపంచానికే సవాలు విసురుతున్న కరోనాపై పోరాటానికి మనం మరింత సన్నద్ధంగా మారాలని ప్రధాని మోదీ అన్నారు. వైరస్ లో మ్యూటేషన్ల కారణంగా మరింతగా ముప్పు పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. కరోనా యోధులకు కస్టమైజ్డ్​క్రాష్‌ కోర్సును ప్రధాని శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా లక్ష మందిలో పని సామర్థ్యాన్ని పెంచేలా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ క్రాష్​ కోర్స్​లో శిక్షణ పొందినవారు కరోనాపై పోరులో పాల్గొంటారని ఆయన వెల్లడించారు.



    కరోనా చికిత్స అందిస్తున్న ఆస్పత్రులకు వెంటిలేటర్స్‌, ఆక్సిజన్‌ పంపిణీకి సన్నాహాలు చేస్తున్నామని ప్రధాని వివరించారు. పీపీఈ కిట్లు, టెస్ట్ కిట్లు, మౌలిక వసతుల కల్పన, కరోనా చికిత్సలు, దానికి సంబంధించిన వైద్య పరికరాల సమీకరణ వంటి విషయాల్లో భారత్ కు అతిపెద్ద నెట్ వర్క్ ఏర్పడిందన్నారు. ఎక్కువ సంఖ్యలో హాస్పటల్స్ కు ఆక్సిజన్, వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని సూచించారు.
    Published by:Nikhil Kumar S
    First published: