• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • PM MODI SAYS CBSE 12 CLASS EXAMS CANCELLED IN THE INTEREST OF STUDENTS AK

PM Modi: అందుకే CBSE పరీక్షలు రద్దు.. ప్రధాని మోదీ వివరణ

నరేంద్ర మోదీ (image credit - twitter)

PM Modi on cbse exams cancel: ఒత్తిడితో కూడుకున్న పరిస్థితుల్లో పరీక్షలు రాసే విధంగా విద్యార్థులపై ఒత్తిడి తీసుకురాకూడదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.

  • Share this:
    సీబీఎస్ఈ 12వ తగరతి పరీక్షల నిర్వహణపై కొనసాగిన ఉత్కంఠకు కేంద్రం తెరదించింది. ఈ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా ? లేక రద్దు చేస్తారా ? అనే అంశంపై అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేంద్రం సుప్రీంకోర్టుకు వివరించింది. దీంతోపాటు ఈ అంశంపై ఎంతోమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఉత్కంఠకు తెరదించాలని భావించిన కేంద్ర ప్రభుత్వం.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరీక్షలు నిర్వహించకుండా ఉండటమే మంచిదనే నిర్ణయానికి వచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.

    ఇప్పటికే ఈ పరీక్షల నిర్వహణ అంశంపై అనేక రాష్ట్రాల నుంచి అభిప్రాయాలను సేకరించిన కేంద్రం.. చివరకు పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించింది. విద్యార్థులను దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత ఎంతో ముఖ్యమని.. ఈ విషయంలో అస్సలు రాజీపడబోమని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఉత్కంఠకు తెరదించాల్సి అవసరం ఉందని ప్రధాని తెలిపారు. ఒత్తిడితో కూడుకున్న పరిస్థితుల్లో పరీక్షలు రాసే విధంగా విద్యార్థులపై ఒత్తిడి తీసుకురాకూడదని అన్నారు. విద్యార్థుల విషయంలో అంతా సహృదయంతో ఆలోచించాలని ప్రధాని మోదీ కోరారు.

    అంతకుముందు గత ఏప్రిల్‌లో సీబీఎస్ఈ 10వ తరగతి ప‌రీక్ష‌లను కేంద్రం రద్దు చేసింది. 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసింది. 10వ త‌ర‌గ‌తి చదువుతున్న విద్యార్థులను అంతర్గత అసెస్ మెంట్ ద్వారా ప్రమోట్ చేస్తామని పేర్కొంది. 12 త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు మే 4 నుంచి జూన్ 14 వ‌ర‌కూ జ‌ర‌గాల్సి ఉండ‌గా.. అవి వాయిదా పడ్డాయి. జూన్ 1న బోర్డు అప్ప‌టి ప‌రిస్థితుల‌ను స‌మీక్షించి 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భావిస్తున్న కేంద్రం.. వీటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
    Published by:Kishore Akkaladevi
    First published: