• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • PM MODI JOINS CBSE SESSION WITH STUDENTS AND PARENTS HERE FULL DETAILS NS

PM Modi: స‌ర్‌ప్రైజ్‌ ఇచ్చిన ప్రధాని మోదీ.. విద్యార్థులతో నిర్వహించిన మీటింగ్ లో ప్రత్యక్ష్యం.. ఏం మాట్లాడారంటే..

నరేంద్ర మోదీ (image credit - twitter)

ప్రధాని మోదీ విద్యార్థులకు స‌ర్‌ప్రైజ్‌ ఇచ్చారు. సీబీఎస్ఈ పరీక్షల రద్దుపై కేంద్ర విద్యాశాఖ విద్యార్థులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

  • Share this:
    సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల రద్దు నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కేంద్ర విద్యాశాఖ గురువారం వర్చువల్ గా సమావేశం నిర్వహించింది. అయితే.. ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకావడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే వాస్తవానికి ప్రధాని ఈ మీటింగ్ లో పాల్గొంటారని షెడ్యూల్ లో పేర్కొనలేదు. దీంతో ప్రధాని మీటింగ్ కు హాజరు కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు అధికారులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే కొద్ది సేపు మాత్రమే ప్రధాని ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. విద్యార్థులు, తల్లిదండ్రులను అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలకు ముందు టెన్షన్ పడ్డారా? అని విద్యార్థులను మోదీ అడిగారు. అయితే.. వారంతా సానుకూలంగా స్పందించడంతో ప్రధాని మాట్లాడుతూ.. " మీరంతా టెన్షన్ పడకూడదని ఎగ్జామ్ వారియర్ పుస్తకంలో రాశాను.. ఇప్పుడు అదంతా వ్యర్థం’’ అని ఛలోక్తి విసిరారు.
    PM Narendra Modi : దేశ సంస్కృతికి క్రీడలు హృదయం లాంటివి..మీ వెంట 135 కోట్ల దేశ ప్రజల దీవెనలు ఉన్నాయ్..

    పంచకులకు చెందిన విద్యార్థి హితేశ్వర్ శర్మను ఉద్దేశించి పీఎం మోదీ మాట్లాడుతూ... "మీరు 10 వ తరగతిలో టాపర్‌గా ఉన్నారు, 12 వ తరగతికి కూడా టాపర్ గానే ఉండేవారు. కానీ ఇప్పుడు పరీక్షలు లేనందున అది జరగదు." అని అన్నారు. ఇందుకు కృతజ్ఞతలు తెలిపిన మాస్టర్ శర్మ స్పందిస్తూ.. తాను పెట్టిన ప్రయత్నాలు వృథా కాదని అన్నారు.  జ్ఞానం మనతోనే ఉంటుందన్నారు. సీబీఎస్ఈ ఇప్పుడు విడుదల చేయబోయే ఫలితాలలోనూ తాను టాపర్ గా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు.

    స్కూళ్లు, కాలేజీల్లో ‘టీం స్పిరిట్’ గురించి బోధించేవారని ప్రధాని గుర్తు చేశారు. కరోనా సమయంలో ఈ టీం స్పిరిట్ ను స్పష్టంగా చూశామని ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. కలిసికట్టుగా కరోనాను ఎదుర్కొంటామని అందరూ ధీమాగా ఉన్నారన్నారు.  మీరంతా ఎక్కడికి వెళ్లినా ప్రకాశిస్తూనే ఉంటూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్తారని విద్యార్థులను ఉద్ధేశించి ప్రధాని వాఖ్యానించారు.
    Published by:Nikhil Kumar S
    First published: