Home /News /jobs /

PM MODI ADVICE TO STUDENTS IN EXAM AT PARIKSHA CHARCHA DISCUSSION SUGGESTIONS ON MANAGING NEW CHANGES GH VB

Pariksha Pe Charcha: పరీక్ష పే చర్చలో విద్యార్థులకు మోదీ సలహాలు.. కొత్త మార్పులను మేనేజ్ చేయడంపై సూచనలు..

చర్చా సమయంలో విద్యార్థులతో మాట్లాడుతున్న మోదీ

చర్చా సమయంలో విద్యార్థులతో మాట్లాడుతున్న మోదీ

ఢిల్లీలో జరిగిన పరీక్షా పే చర్చ (Pariksha Pe Charcha) ఈవెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎగ్జామ్ స్ట్రాటజీస్ గురించి ఆయన వివరించారు. అలాగే బోర్డు పరీక్షల్లో మార్పుల గురించి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

ఇంకా చదవండి ...
నేడు అంటే ఏప్రిల్ 1న ఢిల్లీలో జరిగిన పరీక్షా పే చర్చ (Pariksha Pe Charcha) ఈవెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎగ్జామ్ స్ట్రాటజీస్(Strategies) గురించి ఆయన వివరించారు. అలాగే బోర్డు పరీక్షల్లో మార్పుల గురించి విద్యార్థులు(Students) అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 10, 12వ క్లాస్ స్టూడెంట్ల మొత్తం అకడమిక్ ఇయర్‌ను(Academic Year) ఆన్‌లైన్‌ మోడ్‌లో(Online Mode) కండక్ట్ చేయడం నుంచి ఈ అకడమిక్ ఇయర్‌లో చాలా మార్పులు వెలుగుచూశాయి. ఈ ఏడాది సీబీఎస్ (CBSE), సీఐఎస్సీఈ (CISCE) కేంద్ర బోర్డులతో సహా చాలా బోర్డులు బోర్డు ఎగ్జామ్స్ ను రెండుసార్లు నిర్వహించాయి. ఈసారి బోర్డు ఎగ్జామ్స్ ప్యాట్రన్(Pattern) కూడా భిన్నంగా ఉంది. అంతేకాదు, క్లాస్ 12 బోర్డ్ పరీక్షా మార్కుల ఆధారంగా కాకుండా న్యూ ఎంట్రెన్స్ ఎగ్జామ్ సీయూఈటీ (CUET) ఆధారంగా అడ్మిషన్స్ జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో విద్యార్థులు బాగా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అయితే పరీక్షా పే చర్చలో ఈ మార్పుల గురించే ఒక విద్యార్థి మోదీని ప్రశ్నించారు.

Pariksha Pe Charcha: ఆన్‌లైన్‌లో చదువుతున్నారా..? రీల్స్‌ చూస్తున్నారా..? విద్యార్థులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్న మోదీ..!


12వ తరగతి విద్యార్థి విద్యార్థులు ఒకే విద్యా సంవత్సరంలో చాలా మార్పులు ఫేస్ చేస్తున్నారు. ఇన్ని మార్పులపై మీ అభిప్రాయం ఏమిటని ఒక విద్యార్థి మోదీని ప్రశ్నించారు. "ఈ ఏడాది విద్యార్ధులు బోర్డు పరీక్షా ప్యాట్రన్ చేంజ్ అవ్వడం నుంచి CUET పరీక్ష, ఎగ్జామ్స్ లో భారీ చేంజెస్ వరకు ఎన్నో మార్పులను ఫేస్ చేస్తున్నారు. ఇలాంటి మార్పులకు మేం ఇప్పుడు ఏం చేయాలి? ఈ మార్పులను ఎలా మేనేజ్ చేయాలి? " అని ఒక విద్యార్థి పరీక్షా పే చర్చలో మోదీని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ... "విద్యార్థులు తమ పాయింట్ ఆఫ్ వ్యూ (Perspectives), ప్రిపరేషన్ స్ట్రాటజీలు (Preparation Strategies) మార్చుకోవాలి" అని ప్రధాని మోదీ కోరారు. కేవలం పరీక్షల కోసమే చదవడం, ప్రిపేర్ అవ్వడం వంటి పద్ధతిని చేంజ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందుకు బదులుగా సబ్జెక్టులను బాగా అర్థం చేసుకునేలా ప్రిపేర్ అవ్వాలని విద్యార్థులకు సూచించారు. సబ్జెక్టులను పూర్తిస్థాయిలో అర్థం చేసుకున్నట్లయితే ఏ పరీక్షలోనైనా రాణించొచ్చని, ఏ ఫార్మాట్‌లో ప్రశ్న అడిగినా దానికి ఆన్సర్ ఇవ్వచ్చని మోదీ విద్యార్థులకు తెలియజేశారు.

“ఒక పర్టిక్యులర్ ఎగ్జామ్ కోసమే చదవకూడదు. మీరు ఓకే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుంటే ఆ ఒక్క ఎగ్జామ్ కోసం మీరు కొన్ని ప్రశ్నలు చదివి అందులో మాత్రమే మీరు రాణించగలుగుతారు. ఎందుకంటే ఆ ఎగ్జామ్ కి తగినట్టుగా మాత్రమే మీరు స్ట్రాటజీని ఫాలో అవుతారు. ఇలా కాకుండా మీరు సిలబస్‌లోని అన్ని సబ్జెక్టులను నేర్చుకున్నట్లయితే... మీరు ఏ పరీక్షా విధానంలోనైనా లేదా ఫార్మాట్‌లోనైనా ప్రశ్నలకు సమాధానం ఇవ్వగల నైపుణ్యం కలిగి ఉంటారు. మీరు మీ సబ్జెక్టులలో మాస్టర్ అవుతారు. ఇది మీకు అన్ని రకాల పరీక్షలను పరిష్కరించడంలో సహాయపడుతుంది - అది బోర్డు ఎగ్జామ్స్ కావచ్చు లేదా పోటీ పరీక్షలు కావచ్చు." అని మోదీ స్టూడెంట్ ఇంటరాక్షన్ లో చెప్పుకొచ్చారు.

Pariksha Pe Charcha: పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటారు.. 'పరీక్ష పే చర్చ' లో ప్రధాని మోదీ


ప్రధాని తన అభిప్రాయాన్ని సులభంగా వివరించేందుకు ఒక స్పోర్ట్స్ ప్లేయర్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు. "ఒక స్పోర్ట్స్ ప్లేయర్ ఆటలో అద్భుతమైన ప్రదర్శన చూపించడానికి సిద్ధమవుతాడు. ఇందుకు అతడు మంచి ట్రైనింగ్ తీసుకుంటాడు. అలా జిల్లా లేదా జాతీయ స్థాయి పోటీల్లోనైనా బాగా రాణించగలుగుతాడు. విద్యార్థులు కూడా సబ్జెక్టులను బాగా ప్రిపేరైతే ఏ స్థాయి ఎగ్జామ్ లోనైనా రాణించొచ్చు" అని మోదీ వివరించారు.

విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్ళడానికి పరీక్షలను మాత్రమే గేట్‌వేగా తీసుకోవద్దని.. అందుకు బదులుగా చదువుపైనే దృష్టి పెట్టాలని కోరారు. ఫలితాలతో సంబంధం లేకుండా విద్యార్థులు పోటీ పరీక్షలకు హాజరుకావాలని, ఫలితం అనుకూలంగా లేకుంటే తమకు అనుకూలమైన ప్రత్యామ్నాయాలను వెతకాలని ఆయన కోరారు. "ఏదైనా మీకు అనుకూలంగా ఉండకపోతే, అది మీ కోసం కాదని అర్థం చేసుకొని ప్రత్యామ్నాయం కోసం చూడండి. మీ జనరేషన్ కు పోటీ మాత్రమే కాదు చాలా ఛాయిస్ లు, ఆల్టర్నేటివ్స్ అందుబాటులో ఉన్నాయి” అని పీఎం విద్యార్థులకు చెప్పారు.
Published by:Veera Babu
First published:

Tags: Board exams, Pariksha Pe Charcha, Pm modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు