Home /News /jobs /

PLEA IN SUPREME COURT CANCELATION OF NEET 2021 MEDICAL ENTRANCE TEST EVK

NEET 2021 : నీట్2021 పరీక్ష రద్దుచేయాలంటూ సుప్రీం కోర్టులో పిల్

సుప్రీం కోర్టు
(File Photo: Supreme Court)

సుప్రీం కోర్టు (File Photo: Supreme Court)

సెప్టెంబర్ 12, 2021న నీట్ – యూజీ 2021 పరీక్ష జరిగింది. ఈ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేయాలంటూ ప‌లువురు విద్యార్థులు సుప్రీం కోర్టు (Supreme Court) ను ఆశ్ర‌యించారు. ప‌రీక్ష ర‌ద్దు చేయ‌డంతోపాటు కోర్టు విచార‌ణ పూర్త‌య్యే వ‌ర‌కు ప‌లితాలు నిలిపివేయాల‌ని వారు పిటిష‌న్‌ (Petition)లో పేర్కొన్నారు.

ఇంకా చదవండి ...
  • Advertorial
  • Last Updated :
    సెప్టెంబర్ 12, 2021న నీట్ – యూజీ 2021 పరీక్ష జరిగింది. ఈ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేయాలంటూ ప‌లువురు విద్యార్థులు సుప్రీం కోర్టు (Supreme Court) ను ఆశ్ర‌యించారు. ప‌రీక్ష ర‌ద్దు చేయ‌డంతోపాటు కోర్టు విచార‌ణ పూర్త‌య్యే వ‌ర‌కు ప‌లితాలు నిలిపివేయాల‌ని వారు పిటిష‌న్‌ (Petition)లో పేర్కొన్నారు. దీనిపై సుప్రీం కోర్టు త‌క్ష‌ణ‌మే విచార‌ణ చేప‌ట్టాల‌ని పిటిష‌న్‌దారులు కోరారు. దేశ‌వ్యాప్తంగా ఎంతో మంది రాసే ప‌రిక్ష నీట్ 2021. నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) ఎంతో క‌ట్టుదిట్టంగా ప‌రీక్ష నిర్వ‌హిస్తుంది. అభ్య‌ర్థుల‌ను ప‌రీక్షించిన త‌రువాతే ప‌రీక్ష హాల్‌లోకి పంపుతారు. చెవిపోగుల‌ను, చేతి కంక‌ణాల‌ను సైతం తీసేయిస్తారు. అలాంటిది రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో అభ్యర్థులు అధికారుల కళ్లుకప్పి మోసపూరితంగా పరీక్ష రాసినట్లు తేలింది. రాజస్థాన్ (Rajasthan) లో పరీక్ష నిబంధనలకు వ్యతిరేకంగా, మాస్ కాయింగ్ కి పాల్పడిన విద్యార్థిని గుర్తించి ఆమెతోపాటు ఆమెకు సహకరించిన మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. దీంతో ప‌లువురు ప‌రీక్ష ర‌ద్దు చేయాల‌ని కోర్టును ఆశ్ర‌యించారు.

    ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో నీట్ 2021 ప‌రీక్ష‌లో జరిగిన అవకతవకలకు సంబంధించిన అన్ని సంబంధిత సమాచారం మరియు డాక్యుమెంట్‌లతో ఒక వారంలోగా సుప్రీంకోర్టు ముందు నిజ నిర్ధారణ నివేదికను సమర్పించాలని రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ సీబీఐ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులను కోర్టు ఆదేశించింది.

    NEET 2021 : నీట్ క‌ట్ఆఫ్ గ‌తేడాది కంటే త‌క్కువ ఉంటుందా?.. అంచనా వివ‌రాలు


    MBET, BDS, BAMS, BSMS, BUMS మరియు BHMS లలో ప్రవేశానికి NEET 2021 నిర్వహిస్తారు. ఈ సంవత్సరం నుంచి మెడికల్ ఎంట్రన్స్(Medical entrance) స్కోర్లు కూడా BSc నర్సింగ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు వ‌ర్తించ‌నున్నాయి. ఈ సంవత్సరం 16 లక్షల మంది విద్యార్థులు నీట్ ప‌రీక్ష‌కోసం దరఖాస్తు చేసుకున్నారు.

    ఈ నేప‌థ్యంలో పరీక్ష అవ‌క‌త‌వ‌క‌ల‌పై సీబీఐ ద‌ర్యాప్తు చేస్తోంది. డ‌బ్బులు తీసుకొని ప‌రీక్ష రాయ‌డం, న‌కిలీ అడ్మిట్ కార్డులు, ఒక‌రి బ‌దులు ఒక‌రు ప‌రీక్ష రాయ‌డం వంటి అంశాలపై ద‌ర్యాప్తును వేగ‌వంతం చేసింది. 2020 లో CBSE బోర్డ్ పరీక్షల రద్దు కోసం పోరాడిన న్యాయవాది మమతా శర్మ నీట్ ర‌ద్దుకు పిటిషన్ వేసింది. అంతే కాకుండా పరీక్షలో సెక్యూరిటీ ప్రోటోకాల్‌లను మెరుగుపరచడానికి విద్యా మంత్రిత్వ శాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి ఆదేశాలను వారు కోరారు. నీట్‌ను ఎందుకు ర‌ద్దు చేయ‌కూడ‌దు అనే అంశంపై NTA నుంచి సమాధానాన్ని కోరారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: EDUCATION, Exams, National Testing Agency, NEET 2021, Supreme Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు