Home /News /jobs /

PLANNING A POST GRADUATE COURSE IN THE UK HERES EVERYTHING YOU NEED TO KNOW ABOUT THE GREAT SCHOLARSHIPS 2022 GH VB

UK Great Scholarships: గ్రేట్ స్కాలర్‌షిప్‌తో యూకేలో ఉన్నత విద్య సాకారం.. దీనికి ఎలా అప్లై చేయాలి..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యూకే లాంటి దేశాలు భారతీయ విద్యార్థుల కోసం స్పెషల్ స్కాలర్ షిప్‌లు ప్రకటిస్తున్నాయి. పైగా అకడమిక్ ఎక్సలెన్స్, వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్కిల్ ఫ్యాకల్టీకి యూకే కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. దీంతో చాలా మంది విద్యార్థులను యూకే ఆకర్షిస్తుంది.

ఇంకా చదవండి ...
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడం చాలా మంది విద్యార్థుల కల. అయితే ట్యూషన్ ఫీజులు(Tuition Fee), రోజువారీ అవసరాలకు పెద్దమొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. దీంతో విద్యార్థుల్లో ఎక్కువ మంది విదేశాల్లో చదవడానికి వెనకడుగు వేస్తారు. అయితే యూకే లాంటి దేశాలు భారతీయ విద్యార్థుల కోసం స్పెషల్ స్కాలర్ షిప్‌లు ప్రకటిస్తున్నాయి. పైగా అకడమిక్ ఎక్సలెన్స్, వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్కిల్ ఫ్యాకల్టీకి(Skill Faculty) యూకే కేరాఫ్ అడ్రస్‌గా(Address) నిలిచింది. దీంతో చాలా మంది విద్యార్థులను యూకే ఆకర్షిస్తుంది. ఇండియన్ కరెన్సీలో పోల్చితే ఫౌండ్ మారకం విలువ ఎక్కువ. దీంతో అక్కడ ఉన్నత విద్యను అభ్యసించడం ఆర్థికంగా భారతీయ విద్యార్థులకు సవాల్‌తో కూడుకున్న విషయం. అయితే అన్ని రంగాల్లో యూకేతో భారత్‌కు(India) సత్సంబంధాలు ఉండడంతో భారతీయ విద్యార్థుల కోసం యూకే ప్రభుత్వం గ్రేట్ స్కాలర్ షిప్‌లను మంజూరు చేస్తోంది.

IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్​లో వాటికి దరఖాస్తుల ఆహ్వానం.. ఎంపికైతే ప్రతినెలా రూ. 60 వేల స్టైఫండ్


గ్రేట్ స్కాలర్‌షిప్‌లు 2022-23
యూకేలో చదువుకోవడం కోసం ఆర్థికంగా వెసులుబాటు ఉండే గ్రేట్ స్కాలర్‌షిప్‌లనే ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఫ్రిఫర్ చేస్తుంటారు. యూకే ప్రభుత్వం గ్రేట్ బ్రిటన్ ఆధ్యర్వంలో బ్రిటిష్ కౌన్సిల్ స్కాలర్ షిప్ లను అందిస్తాయి. వీటి సహాయంతో యూకేలో ఎక్కడైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అభ్యసించే అవకాశం ఉంటుంది.

2022-23 అడమిక్ ఇయర్‌కు సంబంధించి భారతీయ విద్యార్థుల కోసం 20 పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రేట్ స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి సహాయంతో యూకేలోని 16 యూనివర్సిటీల్లో ఫైనాన్స్, మార్కెటింగ్, బిజినెస్, సైకాలజీ డిజైన్, హ్యూమానిటీస్, డ్యాన్స్ తదితర సబ్జెక్టుల్లో పీజీ చేయవచ్చు. వీటికి అదనంగా న్యాయశాస్త్రానికి సంబంధించి మరో 7 గ్రేట్ స్కాలర్ షిప్‌లను భారతీయ విద్యార్థుల కోసం ప్రకటించారు. మానవ హక్కులు, క్రిమినల్ జస్టిస్, వాణిజ్య చట్టం వంటి సబ్జెక్ట్‌లపై పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయవచ్చు.

ఒక సంవత్సరంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్యూషన్ ఫీజు కోసం ఒక స్కాలర్‌షిప్ కి 10వేల ఫౌండ్లు కేటాయించనున్నారు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన గ్రేట్ స్కాలర్‌షిప్‌లు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయి.

Application Invited: వాళ్లు ఏడాదికి రూ.60 వేలు పొందే అవకాశం.. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 15.. వివరాలివే..


స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోండి ఇలా
ముందుగా స్టడీ UK వెబ్‌సైట్‌లోని గ్రేట్ స్కాలర్‌షిప్‌ల పేజీలను సందర్శించండి. భారతీయుల కోసం గ్రేట్ స్కాలర్‌షిప్‌లను అందిస్తున్న యూనివర్సిటీల జాబితాను పరిశీలించండి. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ పేజీని సందర్శించండి. అనంతరం యూనివర్సిటీ స్వంత అప్లికేషన్ సిస్టమ్ ద్వారా మీరు ఎంచుకున్న కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవడానికి యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

దరఖాస్తు ప్రక్రియలో భాగంగా, కొన్ని యూనివర్సిటీలు టెస్ట్‌ను కండక్ట్ చేయవచ్చు. గతంలో మీరు చదివిన ఏదైనా అంశంపై 500 పదాలను మించకుండా ఓ వ్యాసాన్ని పంపమని అడగవచ్చు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను షార్ట్ లిస్టు చేయడానికి ఈ టెస్ట్‌ను నిర్వహిస్తారు. షార్ట్‌లిస్ట్‌లో పేరు ఉన్న విద్యార్థులు సెలక్షన్ కమిటీతో వీడియో ఇంటర్వ్యూకి హాజరుకావలసి ఉంటుంది. స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా తాను చదివే యూనివర్సిటీ నుండి ఎంట్రీ ఆఫర్‌ను అందుకోవాలి. గ్రేట్ స్కాలర్‌షిప్‌ల కోసం ఒకటి కంటే ఎక్కువ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Scholarships, Students, Uk

తదుపరి వార్తలు