Home /News /jobs /

PJTSAU RECRUITMENT 2022 JAYASHANKAR AGRICULTURAL UNIVERSITY JOBS SELECTION THROUGH INTERVIEW ONLY KNOW FULL DETAILS HERE VB

PJTSAU Recruitment 2022: జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగాలు.. కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం(PJTSAU) నుంచి పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ(Telangana) రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం(PJTSAU) నుంచి పలు పోస్టులకు నోటిఫికేషన్(Notification) విడుదల అయింది. యంగ్ ప్రొఫెషనల్ II ఖాళీల పోస్టులకు అర్హులైన అభ్యర్థులను నియమిస్తోంది . M.Sc. అర్హత గల అభ్యర్థులు చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. PJTSAU రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు(Application) చేసుకోవడానికి చివరి తేదీ 12/07/2022 గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దీనిలో మొత్తం 02 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. PJTSAUలోని యంగ్ ప్రొఫెషనల్ II ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.35,000 వేతనంగా పొందుతారు . ఈ రెండు పోస్టులను పూర్తిగా కాంట్రాక్ట్ విధానం(Contract Basis) ద్వారా తీసుకుంటారు. అంటే ఒక సంవత్సరం కాల వ్యవధి వరకు తీసుకోనున్నారు.

ఇదీ చదవండి: Video : భర్తను వదిలి ప్రియుడు ఇంటికి..ఆదివాసీ మహిళను వివస్త్రను చేసి చితకబాది..ఊరంతా అలా తిప్పి..

వీళ్లు మార్చి 31, 2023 వరకు ఉద్యోగంలో కొనసాగుతారు. తర్వాత అవసరాన్ని బట్టి కాంట్రాక్ట్ పెంచే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు తప్పనిసరిగా  ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లేదా ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎమ్మెస్సీ చేసి ఉండాలి. అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి 40 ఏళ్లు. దీనిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఫీల్డ్ పని చేయాల్సి ఉంటుంది. దీనిలో రాత పరీక్ష లాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్ గా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.



ఇంటర్వ్యూ తేదీ జూలై 12, 2022 గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు.. పోస్టుకు కావాల్సిన అర్హతగల సర్టిఫికేట్లను జిరాక్స్, ఒరిజినల్స్ తో హాజరవ్వాలి. దీనికి ఎలంటి టీఏ, డీఏ లాంటి అలవెన్స్ లు ఉండవు. వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరవ్వాల్సిన అడ్రస్.. ఆఫీస్ ఆఫ్ ది యూనిట్ కో ఆర్టినేటర్, Aicrp ఆన్ వుమెన్ ఇన్ అగ్రికల్చర్, PG And RC, PJTSAU, Rajendranagar, Hyderabad-30.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. https://www.pjtsau.edu.in/ వెబ్ సైట్ లో మరిన్ని వివరాలు అందుబాటులో ఉన్నాయి.

మరో నోటిఫికేషన్ లో ఇలా..
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ స్టాటిస్టిషియన్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హులైన , ఆసక్తిగల అభ్యర్థులు 11-07-2022న ఉదయం 11.00 గంటలకు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ స్కీమ్ (CCS), అగ్రికల్చరల్ ఎకనామిక్స్ డిపార్ట్‌మెంట్, అగ్రికల్చర్ కాలేజ్, రాజేంద్రనగర్, హైదరాబాద్‌లో జరగనున్న వాక్-ఇన్-ఇంటర్వ్యూ కోసం హాజరవ్వాల్సి ఉంటుంది. తెలంగాణకు సాగు పథకంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఒక అసిస్టెంట్ స్టాటిస్టిషియన్, మూడు ఫీల్డ్ సూపర్‌వైజర్ల నాన్ టీచింగ్ పోస్టులను తాత్కాలికంగా తీసుకోనున్నారు. అసిస్టెంట్ స్టాటిస్టిషియన్ పోస్టు కొరకు దరఖాస్తు చేసుకునే వారు ఎమ్మెస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి స్టాటిస్టిక్స్ విభాగంలో పీహెచ్ డీ పూర్తి చేయాలి. దీనికి జీతంగా రూ.40 వేలు ఉంటుంది. ఎమ్మెస్సీతో పాటు పీహెచ్డీ కూడా ఉన్నవారికి రూ.45 వేలు ఉంటుంది. ఈ పోస్టులు మూడు నెలల కాలపరిమితికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన తీసుకోనున్నారు.

ఫీల్ట్ సూపర్ వైజర్ పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకునే వారు M. Sc లో అగ్రికల్చర్ పూర్తి చేయాలి మరియు ఆర్థిక శాస్త్రంలో Ph. D లో ఉండాలి. దీనికి కూడా జీతంగా రూ.40 వేలు ఉంటుంది. ఎమ్మెస్సీతో పాటు పీహెచ్డీ కూడా ఉన్నవారికి రూ.45 వేలు ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Telangana jobs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు