
ప్రతీకాత్మక చిత్రం
నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీ(National Recruiting Agency) పేరు మీద కొందరు ఓ ఫేక్ వెబ్ సైట్ ను రూపొందించారు. ఈ వెబ్ సైట్ ద్వారా వివిధ పోస్టుల పేరు మీద ఫేక్ ప్రకటనలు సైతం విడుదల చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ ఇంటర్ నెట్ యుగంలో అనేక ఫేక్ వెబ్ సైట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అమాయకులను మోసం చేయడమే లక్ష్యంగా అవి పని చేస్తున్నాయి. నిరుద్యోగులే టార్గెట్ గా పని చేసే వెబ్ సైట్లు ఇంటర్ నెట్లో అనేకంగా దర్శనమిస్తున్నాయి. దొంగ ఉద్యోగ ప్రకటనలు ఇస్తూ.. అవి మోసాలకు పాల్పడుతున్నాయి. వివిధ రకాల ఫీజులు చెల్లించిన తర్వాత తాము మోస పోయామని నిరుద్యోగులు తెలుసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి మోసం ఒకటి బయటపడింది. PIB Fact చెక్ ఆ వెబ్ సైట్ మోసాలను బయటపెట్టింది. ఆ వెబ్ సైట్ ఫేక్ అని నిర్ధారించింది. వివరాల ప్రకారం.. నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీ(National Recruiting Agency) పేరు మీద కొందరు ఓ ఫేక్ వెబ్ సైట్ ను రూపొందించారు. ఈ వెబ్ సైట్ ద్వారా వివిధ పోస్టుల పేరు మీద ఫేక్ ప్రకటనలు సైతం విడుదల చేస్తున్నారు.
ఈ అంశంపై PIB పరిశీలించగా ఆ వెబ్ సైట్ ఫేక్ అని తేలింది. నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీ(NRA) పేరు మీద ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదని నిర్ధారణ అయ్యింది. ఇలాంటి దొంగ వెబ్ సైట్లు నమ్మి ప్రజలు, ముఖ్యంగా నిరుద్యోగులు మోస పోవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఊరూ పేరు లేని వెబ్ సైట్లు విడుదల చేసే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు. ఏదైనా అనుమానం వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారు సూచిస్తున్నారు.
Published by:Nikhil Kumar S
First published:December 23, 2020, 17:56 IST