హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Advance 2021 Analysis: గ‌ణితం క‌ఠినంగా.. ఫిజిక్స్ సుల‌భంగా : జేఈఈ అడ్వాన్స్ 2021 విశ్లేష‌ణ

JEE Advance 2021 Analysis: గ‌ణితం క‌ఠినంగా.. ఫిజిక్స్ సుల‌భంగా : జేఈఈ అడ్వాన్స్ 2021 విశ్లేష‌ణ

8. ఈ నియమం కేవలం SSC CHSL కి మాత్రమే కాకుండా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలు (CGLE), స్టెనోస్టె గ్రాఫర్ పరీక్షలు, కానిస్టేబుస్టే ల్ GDమొదలైన అన్ని ఇతర పరీక్షలకు తప్పనిసరి కానుంద‌ని క‌మిష‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి.  (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

8. ఈ నియమం కేవలం SSC CHSL కి మాత్రమే కాకుండా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలు (CGLE), స్టెనోస్టె గ్రాఫర్ పరీక్షలు, కానిస్టేబుస్టే ల్ GDమొదలైన అన్ని ఇతర పరీక్షలకు తప్పనిసరి కానుంద‌ని క‌మిష‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

IIT Entrance Exams : జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (Joint Entrance Examination) అడ్వాన్స్‌డ్ 2021 ఈ రోజు జ‌రిగింది. ఈ ప‌రీక్ష‌పై విద్యార్థులు భిన్న‌మైన అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ప్ర‌వేశ ప‌రీక్ష‌లో గ‌ణితం చాలా క‌ఠినంగా ఉంద‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

ఇంకా చదవండి ...

ఐఐటీ ప్రవేశాల కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (Joint Entrance Examination) అడ్వాన్స్‌డ్ 2021 మొదటి షిఫ్ట్ ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. ఈ ప‌రీక్ష‌పై విద్యార్థులు భిన్న‌మైన అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ప్ర‌వేశ ప‌రీక్ష‌లో గ‌ణితం చాలా క‌ఠినంగా ఉంద‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. త‌రువాత ర‌సాయ‌శాస్త్రం (Chemistry), భౌతిక‌శాస్త్రం సుల‌భంగా ఉన్నాయ‌ని విద్యార్థులు పేర్కొన్నారు. భౌతిక‌శాస్త్రం, రసాయశాస్త్రంలో సెల‌బ‌స్ (Syllabus) నుంచి అన్ని అంశాలు వ‌చ్చాయి. అయితే.. అయితే, కాలిక్యులస్ (calculus) నుంచి చాలా తక్కువ ప్రశ్నలు ఉన్నాయి. గణితంలో, సంభావ్యత, మాత్రికలు డిట‌ర్‌మెంట్స్ నుంచి ఒక్కొక్క ప్ర‌శ్న చొప్పున నాలుగు ప్ర‌శ్న‌లు అడిగిన‌ట్లు ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ నేషనల్ అకడమిక్ డైరెక్టర్ (Engineering) అజయ్ కుమార్ శర్మ పేర్కొన్నారు.

కెమిస్ట్రీలో అంచనా ప్ర‌కారం స‌మ‌తుల్యంగా ప్ర‌శ్న‌లు అడిగారు. ముఖ్యంగా 11, 12 త‌ర‌గ‌తుల నుంచి స‌మానంగా ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేరుగా ఎన్‌సీఆర్‌టీ (NCERT) ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి. ముఖ్యంగా అమైన్స్‌, బ‌యోమాలిక్యూల్‌, ఆక్సీజ‌న్ కంటైనింగ్ కాంపౌండ్స్ నుంచి అన్ని ప్ర‌శ్న‌లు క‌వ‌ర్ చేశారు. అంతే కాకుండా భౌతిక రసాయన శాస్త్రంలో, ప్రశ్నలు టైట్రేషన్, ఎలెక్ట్రోకెమిస్ట్రీ (Electro Chemistry), థర్మోడైనమిక్స్ (Thermodynamics) అధ్యాయాలను కవర్ చేస్తాయి.

SSC Recruitment 2021 : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త.. ప‌ది, ఇంట‌ర్ విద్యార్హ‌త‌తో ఎస్ఎస్‌సీలో 1,775 ఉద్యోగాలు


ప్ర‌తీ ఏటా భౌతికశాస్త్రంలో, ప్రశ్నలు ఎక్కువగా క్లాస్ 11 అధ్యాయాల నుంచి అడిగేవారు. ఈ సారి కరెంట్ విద్యుత్, ఆప్టిక్స్, రొటేషన్ మరియు ఆధునిక ఫిజిక్స్ నుంఇచ కొన్ని కఠినమైన ప్రశ్నలు అడిగారు. మొత్తంమీద, ఈ రెండు ఇతర సబ్జెక్టులతో పోలిస్తే ఈ విభాగం సులభం అని విద్యార్థులు తెలిపారు.

ఈసారి విద్యార్థుల‌కు గ‌ణితంలో ట్రిక్కీ ప్ర‌శ్న‌లు ఎక్కువ‌గా అడిగారు మొత్తం మూడు విభాగాల్లో గ‌ణితంలో క‌ఠినంగా అడిగారు. ఫంక్ష‌న్స్‌, కంటిన్యూటీ, డిఫెరెన్షియ‌బిలిటీ, డెరివేటీవీస్‌, ఇంటిగ్ర‌ల్స్, ప్రాబ‌బిలిటీ, కాంప్లెక్స్ నంబ‌ర్స్‌, త్రీబైమెన్స్ నంబ‌ర్ వంటి విభాగాల నుంచి ప్ర‌శ్న‌లు అడిగారు. పార‌బోలా నుంచి ట్రిగ్నామెట్రీ నుంచి క్లిష్ట‌మైన ప్ర‌శ్న‌లు అడిగారు. క్లాస్ 11 చాప్టర్‌లకు ఎక్కువ వెయిటేజీని ఇవ్వడంతో ఈ విభాగం అత్యంత క్లిష్టమైనదిగా విద్యార్థులు భావించారని, FIITJEE నోయిడా హెడ్ రమేష్ బట్లిష్ అన్నారు. ఈ ఏడు జేఈఈ అడ్వాన్స్ ప‌రీక్ష‌లో గ‌ణితం విద్యార్థుల‌కు క‌ఠినంగా ఇచ్చాడ‌ని ఎక్కువ‌గా ప్రాక్టీస్ చేసిన వారికి ఇది అబ్ధి చేకూరుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

గ‌తేడాది క‌న్నా భిన్నంగా..

గ‌త సంవత్స‌రంతో పోలిస్తే పేప‌ర్-1లో 57 ప్ర‌శ్న‌లు అడిగారు. గ‌త సంవ‌త్స‌రం 54 ప్ర‌శ్న‌లు అడిగారు. మొత్తం మార్కులు కూడా మారాయి గ‌తేడాది 198 మార్కులు వ‌స్తే ఈ ఏడాది 180 మార్కులు వ‌చ్చాయి. అక్టోబ‌ర్ 3, 2021న రెండు షిఫ్ట్‌లు జ‌రిగాయి. ఈ ఏడాది సుమారు 1.6 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్ష కోసం నమోదు చేసుకున్నారు.

First published:

Tags: EDUCATION, Exams, IIT, JEE Main 2021, Students

ఉత్తమ కథలు