హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Government Jobs In PRL: డిగ్రీ పూర్తి చేశారా.. అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండిలా..

Government Jobs In PRL: డిగ్రీ పూర్తి చేశారా.. అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూసే నిరుద్యోగులకు శుభవార్త. ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ అసిస్టెంట్ , జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ప్రభుత్వ ఉద్యోగాల(Government Jobs) కోసం చూసే నిరుద్యోగులకు శుభవార్త. ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ అసిస్టెంట్(Assistant), జూనియర్ పర్సనల్ అసిస్టెంట్(Junior Personnel Assistant) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది.  దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 01గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ prl.res.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కింద మొత్తం 17 పోస్టులను భర్తీ చేశారు.

Police Jobs 2022: 12వ తరగతి అర్హతతో.. సబ్ ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్..

ముఖ్యమైన తేదీలు ఇలా..

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ - అక్టోబర్ 1, 2022

పత్రాలను సమర్పించడానికి చివరి తేదీ - అక్టోబర్ 7, 2022

దరఖాస్తు ఫీజు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 250 ఫీజు చెల్లించాలి. మహిళా అభ్యర్థులతో పాటు రిజర్వేషన్ కేటగిరీలు (SC, ST, దివ్యాంగులు) దరఖాస్తు రుసుములో పూర్తి మినహాయింపు ఇవ్వబడింది.

విద్యార్హతలు..

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా ఏదైనా ఇతర ఉన్నత విద్యా సంస్థ నుండి ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. దీంతో పాటు.. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాల వేగం కలిగి ఉండాలి.

వయోపరిమితి..

రెండు పోస్టులకు అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. గరిష్ట వయోపరిమితి 26 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం..

అసిస్టెంట్ , జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పే మ్యాట్రిక్స్ లెవల్ 4 కింద రూ. 25,500 - రూ. 81,100 జీతం ఇవ్వబడుతుంది.

Software Jobs: ఉద్యోగుల సంఖ్యను 10వేలకు పెంచుకోనున్న సంస్థ.. 2500 వరకు ఉద్యోగాలు ఖాళీ..

దీనికి సంబంధించి పూర్తి వివరాలకు https://www.prl.res.in/prl-eng/job_vacancies లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ అనేది అహ్మదాబాద్ కేంద్రంగా పని చేస్తుంది.

దరఖాస్తు విధానం ఇలా..

Step 1 : అభ్యర్థులు ముందుగా అధికారిక నోటిఫికేషన్ ను ఓపెన్ చేయాలి. దాని కోసం డైరెక్ట్ లింక్ దీనిపై క్లిక్ చేయండి.

Step 2 : విండో కనిపిస్తున్న ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.

Step 3 : తర్వాత ఇచ్చిన నియమ, నిబంధనలు చదువుకొని.. స్క్రోల్ డౌన్ చేస్తే.. రెండు రకాల పోస్టులు కనపడతాయి.

Step 4 : దానిలో ఒకదాన్ని ఎంచుకొని.. రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Step 5 : రిజిస్ట్రేషన్ ఫారమ్ లో పేరు, ఊరు, అడ్రస్ ప్రాథమిక వివరాలను నమోదు చేయాలి.

Step 6 : రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇవి మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీకి వస్తాయి.

Step 7 : ఈ విండోలో అర్హతకు సంబంధించి పూర్తి వివరాలను నమోదు చేసి.. దరఖాస్తును పూర్తి చేయవచ్చు.

Step 8 : చివరగా దరఖాస్తు ఫారమ్ ను ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఇది భవిష్యత్ అవసరాల కొరకు ఉపయోగపడుతుంది.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Central Government Jobs, JOBS

ఉత్తమ కథలు