Home /News /jobs /

PHYSICAL MEASUREMENTS DETAILS OF PHYSICAL MEASUREMENTS BY SI CONSTABLE BY POST EVK

Physical Measurements: ఎస్సై. కానిస్టేబుల్ ద‌రాఖాస్తు చేస్తున్నారా. పోస్టుల వారీగా ఫిజిక‌ల్ మెజ‌ర‌మెంట్స్ వివరాలు

(ఫ్రతీకాత్మక చిత్రం)

(ఫ్రతీకాత్మక చిత్రం)

Police Jobs | నిరుద్యోగుల ఎంతో ఎదురు చూస్తున్న పోలీస్ ఎస్సై, కానిస్టేబుల్ నోటిఫికేష‌న్ వ‌చ్చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 16,614 పోలీసు ఉద్యోగాల (Police Jobs) భర్తీ చేయ‌నున్నారు. పోలీస్ ఉద్యోగాల‌కు రాత ప‌రీక్ష‌తో పాటు ఫిజిక‌ల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఫిజిక‌ల్ టెస్ట్‌కు సంబంధించి వివ‌రాలు..

ఇంకా చదవండి ...
    నిరుద్యోగుల ఎంతో ఎదురు చూస్తున్న పోలీస్ ఎస్సై, కానిస్టేబుల్ నోటిఫికేష‌న్ వ‌చ్చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 16,614 పోలీసు ఉద్యోగాల (Police Jobs) భర్తీ చేయ‌నున్నారు. పోలీస్ జాబ్ కోసం కొన్ని నెలలుగా ప్రిపేర్ అవుతున్నారు. వారికి ఊరటనిస్తూ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ 2022 మే 2న ప్రారంభం కానుంది. 2022 మే 22 లోగా దరఖాస్తు చేయొచ్చు. ఈ నోటిఫికేషన్‌లో కానిస్టేబుల్ పోస్టులు 16,027, ఎస్ఐ పోస్టులు 587 ఉన్నాయి. పోలీస్ ఉద్యోగాల‌కు రాత ప‌రీక్ష‌తో పాటు ఫిజిక‌ల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఫిజిక‌ల్ టెస్ట్‌కు సంబంధించి వివ‌రాలు..

    Jobs in Andhra Pradesh: విశాఖ‌ప‌ట్నంలో హెచ్‌పీ కంపెనీలో ఉద్యోగాలు.. వేత‌నం నెల‌కు రూ.55,000.. అర్హ‌త‌లు అప్లికేష‌న్ ప్రాసెస్‌

    ఎస్సై పోస్టుల‌కు సంబంధించి ఫిజిక‌ల్ టెస్ట్ అర్హ‌త‌లు..

    - 11, 12, 13, 14, 16, 17, 18 నెంబర్ పోస్టులకు పురుషులు 167.6 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. 11, 12 పోస్టులకు మహిళలు 152.5 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి.

    - ఏజెన్సీ ఏరియాల్లోని వారైతే పురుషులు 160 సెంటీమీటర్లు, మహిళలు 150 సెంటీమీటర్లు ఉండాలి.

    - 31, 32, 33 నెంబర్ పోస్టులకు పురుషులు 162 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. మహిళలు 152.5 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఏజెన్సీ ప్రాంతాలకు చెందినవారైతే పురుషులు 160 సెంటీమీటర్లు, మహిళలు 150 సెంటీమీటర్లు ఉండాలి.

    - లాంగ్ జంప్ ఈవెంట్‌లో పురుషులు (జనరల్) 4 మీటర్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 3.5, షాట్‌పుట్ ఈవెంట్‌‌లో ఇద్దరికీ 6 మీటర్ల క్వాలిఫయింగ్ డిస్టెన్స్ ఉంటుంది. మహిళ అభ్యర్థులకు లాంగ్ జంప్ 2.50 మీటర్లు, షాట్ పుట్ 4 మీటర్ల క్వాలిఫయింగ్ డిస్టెన్స్ ఉంటుంది.

    Infosys: ఇన్ఫోసిస్ కొత్త రూల్‌.. రిజైన్ చేస్తే.. ఆరు నెల‌ల‌పాటు ఆ కంపెనీల్లో చేరొద్దని రూల్‌!

    కానిస్టేబుల్ పోస్టుల‌కు సంబంధించి ఫిజిక‌ల్ మెజ‌ర‌మెంట్స్‌

    - పోస్టు కోడ్ 21 నుంచి 27 వ‌ర‌కు (పురుషుల‌కు ) ఎత్తు 167.6సెం.మీ ఉండాలి. మ‌హిళ‌ల‌కు పోస్టు కోడ్ 21,22, 28లో ఎత్తు 152.5 సెం.మీ ఉండాలి.

    - ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే వారికి పోస్టు కోడ్ 21 నుంచి 27 వ‌ర‌కు (పురుషుల‌కు ) ఎత్తు 160 సెం.మీ ఉండాలి. మ‌హిళ‌ల‌కు పోస్టు కోడ్ 21,22, 28లో ఎత్తు 150 సెం.మీ ఉండాలి.

    - లాంగ్ జంప్ ఈవెంట్‌లో పురుషులు (జనరల్) 4 మీటర్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 3.5, షాట్‌పుట్ ఈవెంట్‌‌లో ఇద్దరికీ 6 మీటర్ల క్వాలిఫయింగ్ డిస్టెన్స్ ఉంటుంది. మహిళ అభ్యర్థులకు లాంగ్ జంప్ 2.50 మీటర్లు, షాట్ పుట్ 4 మీటర్ల క్వాలిఫయింగ్ డిస్టెన్స్ ఉంటుంది.

    రాష్ట్రంలో  మొత్తం 16,614 పోస్టుల భర్తీకి నాలుగు వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. పోలీస్ కానిస్టేబుల్ సివిల్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఎస్సై సివిల్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. పోలీస్ కానిస్టేబుల్ ఐటీ, మెకానిక్ తదితర పోస్టులకు ఇక్కడ క్లిక్ చేయండి. ఎస్ఐ ఐటీ, పీటీఓ తదితర పోస్టులకు ఇక్కడ క్లిక్ చేయండి. పూర్తి వివరాలు https://www.tslprb.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Police jobs, Telangana government jobs, Ts jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు