PHONEPE IS RECRUITING MUTUAL FUNDS SPECIALIST POST RESHERS CAN ALSO APPLY KNOW DETAILS EVK
PhonePe Jobs: ఫోన్‌పేలో మ్యూచ్‌వల్ ఫండ్ స్పెషలిస్ట్ ఉద్యోగాలు.. ఫ్రెషర్స్‌కు అవకాశం
ప్రతీకాత్మక చిత్రం
PhonePe : భారతదేశం (India) లోని ప్రముఖ డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్ ఫోన్‌పే (PhonePe) నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఫోన్‌పేలో మ్యూచువల్ ఫండ్స్ స్పెషలిస్ట్ పోస్టును భర్తీ చేయడానికి రిక్రూట్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది
భారతదేశం (India) లోని ప్రముఖ డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్ ఫోన్‌పే (PhonePe) నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఫోన్‌పేలో మ్యూచువల్ ఫండ్స్ స్పెషలిస్ట్ పోస్టును భర్తీ చేయడానికి రిక్రూట్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds)కు సంబంధించిన కస్టమర్ల (Customers) సందేహాలను పరిష్కరించాల్సి ఉంటుంది. అంతే కాకుండా వారికి ఫండ్స్‌కు సంబంధించి మెరుగైన అనుభవాన్నిఅందించాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ జాబ్ రోల్ (Job Role) లో ముఖ్యంగా వినియోగదారుల సమస్యలు వేగంగా పరిష్కరించిందేకు కృషి చేయాలి. అందుకు అనుగుణంగా ప్లానింగ్ (Planning)ను అందించాలి.
దరఖాస్తుకు అర్హతలు..
- దరఖాస్తు చేసుకొనే అభ్యర్థికి 0-2 సంవత్సరాల వృత్తి అనుభవం ఉండాలి.
- అద్భుతమైన వ్రాత, మౌఖిక సంభాషణా సామర్థ్యం అవసరం.
Step 7 : అవరసమైన వివరాలను అందించి సైన్ ఇన్ అవ్వాలి. అనంతరం దరఖాస్తు ఫాంలోని అన్ని ఫీల్డ్‌లను నింపాలి.
Step 8 : దరఖాస్తు పూర్తయిన తరువాత సబ్మిట్ చేయాలి.
మరిన్ని అవకాశాలు..
అంతే కాకుండా ఫోన్‌పే కంపెనీ సీనియర్ ఆటోమేషన్ స్పెషలిస్ట్ అండ్ సోషల్ మీడియా (Auto Machine Specialties and Social Media) నిపుణులను కూడా నియమిస్తోంది. రెండు పోస్టులకు దరఖాస్తులు తెరిచి ఉన్నాయి. ఫ్రెషర్లు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. Phonepeలో, ఐదు పని దినాలు ఉన్నాయి, అయితే, సంస్థ ఏ ఉద్యోగానికి అందించే జీతం వివరాలు పేర్కొనలేదు.
ఫోన్‌పే ఈ సంవత్సరం జూన్‌లో ఫీచర్ (Feature) ప్రారంభించినప్పటి నుంచి ఒక మిలియన్ UPI- ఆటోపే ఆదేశాలను నమోదు చేసినట్లు ప్రకటించింది. ఈ మైలురాయిని అందుకొన్న మొదటి డిజిటల్ పేమెంట్ (Digital Payment) ప్లాట్‌ఫాంగా గుర్తింపు పొందినట్టు సంస్థ పేర్కొంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.