Home /News /jobs /

PHD NOT MANDATORY FOR HIRING ASSISTANT PROFESSORS TILL 2023 UGC GH VB

Assistant Professors: అసిస్టెంట్ ప్రొఫెసర్లకు యూజీసీ గుడ్​న్యూస్​.. పీహెచ్​డీ నిబంధన అమలుపై కీలక వ్యాఖ్యలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Assistant Professors: యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్​ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పీహెచ్​డీ తప్పనిసరి చేస్తూ గతంలో యూజీసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిబంధనకు ప్రస్తుతానికి మినహాయింపునిస్తున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్​ కమిషన్​ స్పష్టం చేసింది.

ఇంకా చదవండి ...
యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్(Assistant Professors)​ పోస్టులకు దరఖాస్తు(Application) చేసుకునే అభ్యర్థులకు పీహెచ్​డీ(Phd) తప్పనిసరి చేస్తూ గతంలో యూజీసీ(UGC) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిబంధనకు ప్రస్తుతానికి మినహాయింపునిస్తున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్​ కమిషన్​(University Grants Commission) స్పష్టం చేసింది. దీన్ని 2023 జూలై 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. వాస్తవానికి ఈ నిబంధనను 2021 నుంచి అమల్లోకి తేవాలని 2018లోనే యూజీసీ నిర్ణయించింది. అయితే కోవిడ్​-19 మహమ్మారి కారణంగా దీని అమలును 2023 వరకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో 2023 వరకు UGC NET స్కోర్ ఆధారంగానే అసిస్టెంట్​ ప్రొఫెసర్ల నియామకాలు కొనసాగనున్నాయి.

Osmania University: ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఉస్మానియా విశ్వవిద్యాలయం.. వివరాలిలా..


కాగా, యూజీసీ తాజా నిర్ణయాన్ని ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్​ అసోసియేషన్​ (టీయూటీఏ) స్వాగతించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీల్లో అసిస్టెంట్​ ప్రొఫెస్టర్లుగా పనిచేస్తున్న వేలాది మందికి ఉపశమనం కలిగించిందని పేర్కొంది. యూజీసీ తాజాగా జారీ చేసిన ప్రకటన ప్రకారం ‘‘కోవిడ్-19 మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని అసిస్టెంట్ ప్రొఫెసర్ల ప్రత్యక్ష నియామకానికి పీహెచ్‌డి తప్పనిసరి నిబంధనలో సడలింపు ఇస్తున్నాం. ప్రస్తుతానికైతే దీన్ని అమలు చేయడం లేదు. ఈ నిబంధన 2023 జులై 1 నుంచి అమల్లోకి వస్తుంది" అని పేర్కొంది.

ఐటీ ఉద్యోగాల కోసం చూసేవారికి గుడ్‌న్యూస్.. ట్రైనింగ్ ఇచ్చిమరీ ఉద్యోగాల్లోకి తీసుకోనున్న HCL సంస్థ.. పూర్తి వివరాలు ఇవే..


ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం, NET, SET, SLET సహా ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే పీహెచ్‌డి పట్టా పొందిన అభ్యర్థులకు నెట్/స్లెట్/సెట్ కనీస క్వాలిఫై నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది.

IIIT Hyderabad: ట్రిపుల్​ఐటీ హైదరాబాద్​లో కొత్త కోర్సు.. ఆ ప్రోగ్రాంకు దరఖాస్తుల ఆహ్వానం.. వివరాలివే..


యూనివర్సిటీలు, కాలేజీల్లో నాణ్యమైన విద్యా బోధన కోసం అసిస్టెంట్​ ప్రొఫెసర్లకు పీహెచ్​డీ తప్పనిసరి చేస్తూ 2018లోనే యూజీసీ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిబంధనలను వెంటనే అమలు చేస్తే వేలాది మంది అసిస్టెంట్​ ప్రొఫెసర్లు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని.. అమలును వాయిదా వేయాలని యూనివర్సిటీలు విజ్ఞప్తి చేశాయి. దీంతో దీని అమలును మూడేళ్ల పాటు వాయిదా వేసింది.

పీహెచ్​డీ పూర్తి చేసేందుకు అసిస్టెంట్​ ప్రొఫెసర్లకు మూడేళ్ల గడువు ఇస్తున్నామని, 2021లోగా పూర్తి చేసుకోవాలని తెలిపింది. అయితే కరోనా కారణంగా పీహెచ్​డీ అర్హత పరీక్ష యూజీసీ నెట్​ వాయిదా పడటంతో 2‌‌023 జులై 1 వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Published by:Veera Babu
First published:

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు