• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • PHARMACY SECTOR TO CREATE UP TO 100000 NEW JOBS DUE TO CORONAVIRUS PANDEMIC EFFECT SS

Jobs: ఈ కోర్సు చేసినవారికి లక్ష ఉద్యోగాలు... కరోనా వైరస్ ఎఫెక్ట్

Jobs: ఈ కోర్సు చేసినవారికి లక్ష ఉద్యోగాలు... కరోనా వైరస్ ఎఫెక్ట్

Jobs: ఈ కోర్సు చేసినవారికి లక్ష ఉద్యోగాలు... కరోనా వైరస్ ఎఫెక్ట్ (ప్రతీకాత్మక చిత్రం)

Jobs | కరోనా వైరస్ మహమ్మారి అనేక ఉద్యోగాలకు డిమాండ్ పెంచింది. ఆయా రంగాల్లో కోర్సులు చేసినవారికి ఉద్యోగావకాశాలు భారీగా ఉన్నాయి.

  • Share this:
    కరోనా వైరస్... ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టించిన, సృష్టిస్తోన్న భయానక మహమ్మారి. కరోనా వైరస్ దెబ్బకు అనేక రంగాలు కుదేలైపోయాయి. వ్యాపారాలు మూతపడ్డాయి. లక్షలాది మంది ఉద్యోగాలు పోయాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు కావడానికి కరోనా వైరస్ ప్రధాన కారణం. ఇదంతా ఒకవైపు. కరోనా వైరస్ కొన్ని రంగాలు పుంజుకోవడానికి కారణమైంది. కరోనా ఎఫెక్ట్‌తో కొన్ని రంగాలు గతంలో ఎన్నడూ లేనంతగా దూసుకెళ్తున్నాయి. అందులో ఆరోగ్య రంగం ఒకటి. హెల్త్ సెక్టార్‌లో ఆస్పత్రులు, ఫార్మసీలు, ఫార్మా కంపెనీలు, హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు... ఇలా అనేక వ్యాపారాలు దూసుకెళ్తున్న మాట వాస్తవం. అందుకే ఈ రంగంలో కొత్తగా ఉద్యోగాల కల్పన పెరుగుతోంది. ఈ రంగాల్లో పనిచేయడానికి వివిధ కోర్సులు చేసినవారికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. గతంలో కోర్సులు చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి, ఇటీవలే కోర్సులు పూర్తి చేసి ఫ్రెషర్స్‌గా ఈ రంగాల్లో అడుగుపెట్టాలనుకునేవారికి అనేక అవకాశాలు లభిస్తున్నాయి.

    Job Loss: కరోనా కాలంలో ఉద్యోగం పోతే ప్రభుత్వం నుంచి సాయం... పథకాన్ని పొడిగించిన కేంద్రం

    Army Public School Jobs: టీచర్ జాబ్ మీ కలా? ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో 8000 ఉద్యోగాలకు 3 రోజుల్లో అప్లై చేయండి

    కరోనా వైరస్ సంక్షోభంలో ఆన్‌లైన్ షాపింగ్‌కు డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌లో మెడిసిన్ తెప్పించుకోవడానికి కూడా అనేక మంది ఆసక్తి చూపించారు. దీంతో మెడిసిన్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడం, మెడిసిన్ హోమ్ డెలివరీ లాంటి సర్వీసులు బాగా పెరిగాయి. దీంతో ఫార్మసీల్లో, ఇ-ఫార్మసీల్లో ఉద్యోగావకాశాలు భారీగా పెరిగాయి. ఫార్మాసిస్టులతో పాటు డెలివరీ బాయ్స్‌కి డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ ఇక్కడితో ఆగిపోలేదు. ముందుముందు కూడా వీరికి ఫుల్ డిమాండ్ ఉండబోతోంది. ఫార్మసీ సంబంధిత కోర్సులు చేసినవారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు రాబోతున్నాయి. వచ్చే ఏడాది వరకు వీరికి బాగా డిమాండ్ ఉండబోతోంది. వచ్చే ఏడాదిలోగా సుమారు లక్ష ఉద్యోగాల వరకు డిమాండ్ ఉండబోతోందని అంచనా. అంటే కొత్తగా ఒక లక్ష ఉద్యోగాలు ఈ రంగంలో రాబోతున్నాయి. కాబట్టి ఈ కోర్సులు చేసినవారికి మంచి రోజులు రానున్నాయి.

    AP Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే

    Jobs: మొత్తం 550 ఉద్యోగాల భర్తీకి ఎన్ఎల్‌సీ ఇండియా నోటిఫికేషన్... నేటి నుంచి దరఖాస్తులు

    ఈ రంగం మాత్రమే కాదు ఇ-కామర్స్ రంగంలో కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా షాపింగ్‌కు వెళ్లేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఏం కావాలన్నా మొదట ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేద్దామన్న ఆలోచన పెరిగిపోతోంది. దీంతో ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌కు ఆర్డర్స్ పెరిగిపోతున్నాయి. ఇ-కామర్స్ రంగంలో సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్, పార్సిల్ డెలివరీ లాంటి విభాగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. ఈ అంశాల్లో నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగాలు సులువుగా లభిస్తున్నాయి. అనుభవం లేకపోయినా ఫ్రెషర్స్‌ని నియమించుకొని స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తున్నాయి కంపెనీలు. అందుకే నిరుద్యోగులు ఏఏ రంగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ ఉందో తెలుసుకొని సంబంధిత కోర్సులు చేయడం ద్వారా ఉద్యోగావకాశాలు పెంచుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: