PGIMER Exam: చండీఘడ్ వర్సిటీ బీఎస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల.. ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

పోస్ట్ గ్యాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (PGIMER) చండీఘడ్ వర్సిటీ బీఎస్సీ నర్సింగ్ కోర్సు అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
పోస్ట్ గ్యాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (PGIMER) చండీఘడ్ వర్సిటీ బీఎస్సీ నర్సింగ్ కోర్సు అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్(పోస్ట్ బేసిక్) కోర్సులకు అప్లికేషన్లను స్వీకరిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ మే 25 నుంచి ప్రారంభమమైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు పీజీఐఎంఈఆర్ అధికారిక వెబ్ సైట్ pgimer.edu.in ద్వారా అప్లికేషన్లు సమర్పించవచ్చు. 2021 జూన్ 24 వ తేదీతో ఈ దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగుస్తుంది. PGIMER బీఎస్సీ నర్సింగ్ 2021 ప్రవేశ పరీక్ష జులై 31(శనివారం) నిర్వహిస్తారు. తుది ఫలితాలు ఆగస్టు 9న ప్రకటించే అవకాశముది. అర్హత సాధించిన వారు 10+2 సర్టిఫికేట్, మార్క్ షీట్ ను ఆగస్టు 12వ తేదీ లోపు సమర్పించాలి. ఆగస్టు 20 ఉదయం 11 గంటల నుంచి జరగబోయే కౌన్సిలింగ్ కు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఆహ్వానిస్తారు. PGIMER B.Sc నర్సింగ్ నాలుగేళ్ల కొర్సుతో పాటు బీఎస్సీ నర్సింగ్ పోస్ట్ బేసిక్ కోర్సులో చేరేందుకు ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. రెండు కోర్సుల్లో మొత్తం 155 సీట్లు అందుబాటులో ఉంటాయి.
TVVP Recruitment 2021: తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో ఉద్యోగాలు... మే 31 లాస్ట్ డేట్
Scholarships: రిసెర్చ్​ కోసం మూడు అత్యుత్తమ స్కాలర్‌షిప్​లు.. అర్హత, దరఖాస్తు వివరాలివే..

PGIMER బీఎస్సీ నర్సింగ్ 2021 కోర్సుకు ఎలా అప్లై చేసుకోవాలి..
-ముందుగా అధికారిక వెబ్ సైట్ pgimer.edu.in ను సందర్శించాలి
-అనంతరం హోంపేజీకి వెళ్లి ఆన్ లైన్ అప్లికేషన్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ అనే ట్యాబ్ పై క్లిక్ చేయాలి.
- న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ సెక్షన్ కింద ఉన్న అప్లై ట్యాబ్ క్లిక్ చేయాలి
- రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో వివరాలు రాయాలి.
- సమాచారాన్ని మరోసాకి తనిఖీ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది.

- తిరిగి వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ నెంబరుతో మళ్లీ లాగిన్ అవ్వాలి.
- అనంతరం అప్లికేషన్ నింపి, సూచించిన ఫార్మాట్ లో డాక్యూమెంట్లను అప్ లోడ్ చేయాలి.
- అనంతరం పేమెంట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. దీంతో ప్రాసెస్ పూర్తవుతుంది.
-పేమెంట్ చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోవడం మర్చిపోకూడదు. కౌన్సెలింగ్, కళాశాల అడ్మిషన్ సమయంలో ఈ అప్లికేషన్ అవసరమవ్వచ్చు. అందుకోసం తప్పకుండా ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
Published by:Nikhil Kumar S
First published: