Home /News /jobs /

PGECET 2020 COUNSELLING SEATS ALLOTTED TO THE CANDIDATES NS

PGECET 2020 Admissions: విద్యార్థులకు అలర్ట్.. ఆ కోర్సుల్లో ప్రవేశాలపై కీలక ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పీజీఈసెట్ రెండో విడత కౌన్సిలింగ్ పై అధికారులు గురువారం కీలక ప్రకటన చేశారు. ఇంజనీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు జరుగుతున్న రెండో విడత కౌన్సెలింగ్‌ జాబితాను గురువారం విడుదల చేశారు.

    పీజీఈసెట్ రెండో విడత కౌన్సిలింగ్ పై అధికారులు గురువారం కీలక ప్రకటన చేశారు. ఇంజనీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు జరుగుతున్న రెండో విడత కౌన్సెలింగ్‌ జాబితాను గురువారం విడుదల చేశారు. మొత్తం కన్వీనర్‌ కోటాలో 5,052 సీట్లు ఉండగా 5,044 మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. అయితే వీరిలో 2,981 మందికి సీట్లు కేటాయించినట్లు కన్వీనర్‌ ఆచార్య పి.రమేశ్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. సీటు పొందిన విద్యార్థులు జనవరి 7 లోపు ఆయా కళాశాలల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ప్రవేశ పరీక్షలన్నీ ఆలస్యంగా జరిగాయి. అయితే సాధ్యమైనంత త్వరగా కౌన్సెలింగ్ పూర్తి చేసి అడ్మిషన్లు కంప్లీట్ చేసేందుకు అధికారులు యుద్ధ ప్రతిపదికన ఏర్పట్లు చేస్తున్నారు.

    ఇదిలా ఉంటే.. సీబీఎస్ఈ బోర్డు పరీక్షల తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఈ రోజు ప్రకటించారు. మే 4 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని ఆయన వెల్లడించారు. జూన్ 10న పరీక్షలు ముగుస్తాయన్నారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఈ రోజు మాట్లాడారు. కరోనా నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహిస్తామన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు.

    జూలై 15న ఫలితాలను వెల్లడిస్తామన్నారు. ప్రాక్టికల్స్ పరీక్షలు మే 1న ప్రారంభం అవుతాయని వివరించారు. కేంద్ర మంత్రి ప్రకటనతో పరీక్షలపై విద్యార్థుల సందేహాలు, అనుమానాలు తీరాయి. అయితే పరీక్షలకు మరో నాలుగు నెలలు మాత్రమే సమయం మిగిలింది. దీంతో ప్రిపరేషన్ కు సమయం సరిపోతుందా? లేదా? అన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: School admissions, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు