Home /News /jobs /

PGCIL RECRUITMENT 2022 APPLICATIONS INVITING FOR ASSISTANT ENGINEER TRAINEE VACANCIES HERE IS APPLICATION LINK NS

PGCIL Recruitment 2022: బీటెక్ చేసిన వారికి అలర్ట్.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో జాబ్స్.. ఈ లింక్ తో అప్లై చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(PGCIL) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్(Job Notification) విడుదలైంది. బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    దేశంలో ఓ పైపు కరోనా(Corona) థర్డ్ వేవ్ విజృంభిస్తున్నా.. మరో వైపు నియామకాలు సైతం ఆగడం లేదు. పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు వరుసగా ఉద్యోగాల (Jobs) భర్తీకి ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. తాజాగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (PGCIL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ నిన్న అంటే జనవరి 27న ప్రారంభమైంది. దరఖాస్తుకు ఫిబ్రవరి 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అసిస్టెంట్ ఇంజనీరింగ్ ట్రైనీ (ASSISTANT ENGINEER TRAINEE) విభాగంలో 105 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు..




























    విభాగం పోస్టులు
    కంప్యూటర్ సైన్స్37
    ఎలక్ట్రికల్60
    సివిల్4
    ఎలక్ట్రానిక్స్4
    మొత్తం:105

    విద్యార్హతల వివరాలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్(Power), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్/పవర్ ఇంజనీరింగ్(ఎలక్ట్రికల్), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్, టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో బీటెక్ చేసిన వారు ఈ ఖఆళీలకు అప్లై చేసకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    Mazagon Dock Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. మజగావ్ డాక్ లో టెన్త్ అర్హతతో 1500 జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

    వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు డిసెంబర్ 12, 2021 నాటికి 28 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. అభ్యర్థులు ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    అభ్యర్థుల ఎంపిక:
    అభ్యర్థుల ఎంపికలో GATE 2021 మార్క్స్ కు 85%, గ్రూప్ డిస్కషన్ కు 3%, పర్సనల్ ఇంటర్వ్యూ కు 12 శాతం వెయిటేజీ ఉంటుంది.
    Jobs in Vizag Steel: వైజాగ్ స్టీల్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే



    ఎలా అప్లై చేయాలంటే..
    Step 1: అభ్యర్థులు మొదటగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అధికారిక వెబ్ సైట్ (https://www.powergrid.in/) ఓపెన్ చేయాలి.
    Step 2: అనంతరం Careers విభాగంలో Job Opportunities లో Openingsపై క్లిక్ చేయాలి.
    Step 3: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ Recruitment for the post of Assistant Engineer Trainee లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.
    Step 4: అక్కడ Click here to Apply ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Step 5: అక్కడ కావాల్సిన వివరాలను నమోదు చేసి అప్లికేషన్ ఫామ్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Central Government Jobs, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు