news18-telugu
Updated: June 16, 2020, 1:12 PM IST
Powergrid Jobs: తెలుగు రాష్ట్రాల్లో ఖాళీల భర్తీకి పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ నోటిఫికేషన్
(ప్రతీకాత్మక చిత్రం)
తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు శుభవార్త. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-PGCIL ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 67 ఖాళీలను ప్రకటించింది. ఇప్పటికే సదరన్ రీజియన్‌లో కర్నాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చెరీలో
119 ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది. అసిస్టెంట్, ఎగ్జిక్యూటీవ్, గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-PGCIL. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 15న ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 5 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.powergridindia.com/ వెబ్సైట్లో చూడొచ్చు.
PGCIL Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 67
అసిస్టెంట్ (హ్యూమన్ రీసోర్స్)- 4
ఎగ్జిక్యూటీవ్ (హ్యూమన్ రీసోర్స్)- 3
గ్రాడ్యుయేట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్- 5
గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 8డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్- 5
డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 26
ఐటీఐ ఎలక్ట్రికల్- 16
PGCIL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2020 జూన్ 15
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 5
విద్యార్హతలు- సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా
నోటిఫికేషన్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి
ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
IAF Jobs: ఇంటర్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 256 ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ట్రైనింగ్
Railway Jobs: రైల్వేలో 196 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Jobs: తెలంగాణలోని ఎయిమ్స్‌లో 141 జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు
Published by:
Santhosh Kumar S
First published:
June 16, 2020, 1:12 PM IST